Breaking News

ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవాల శాతం పెంచాలి

 

కామారెడ్డి, జనవరి 12

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవాల శాతం మరింతగా పెంచేందుకు చర్యలుతీసుకోవాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ ఆదేశించారు. శుక్రవారం విద్యాశాఖ, ఐసిడిఎస్‌ అధికారులతో కన్వర్జెన్సీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కెసిఆర్‌ కిట్‌ ప్రోగ్రాం ఆన్‌లైన్‌ నమోదులో జుక్కల్‌, పిట్లం, పెద్ద కోడప్‌గల్‌, నిజాంసాగర్‌ తదితర ఆరోగ్య కేంద్రాలు వెనకబడి ఉండడం పట్ల కలెక్టర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయా ఆరోగ్య కేంద్రాల సిబ్బందిని మందలించారు. కెసిఆర్‌ కిట్‌ గురించి ప్రజల్లో మరింత అవగాహన కల్పించాలని సూచించారు. హైరిస్కు డెలివరి కేసుల గురించి నిరంతరం అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. రోగులకు మెరుగైన వైద్య సేవలందించాలని పేర్కొన్నారు. సమావేశంలోజిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి చంద్రశేఖర్‌, ఐసిడిఎస్‌ పిడి రాధమ్మ, ప్రోగ్రాం అధికారులు రవీందర్‌గౌడ్‌, హేమరాజ్‌, చంద్రశేఖర్‌, తదితరులు పాల్గొన్నారు.

Check Also

ఐటి సెల్‌ కార్యక్రమానికి తరలిన బిజెపి శ్రేణులు

  కామారెడ్డి, జనవరి 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బిజెపి రాష్ట్ర ఐటిసెల్‌ కార్యక్రమానికి ఆదివారం వెళ్తున్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *