Breaking News

శనివారం రెండు పడక గదుల ఇళ్లకు భూమిపూజ

 

బీర్కూర్‌, జనవరి 12

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బీర్కూర్‌ మండలంలోని కిష్టాపూర్‌ గ్రామంలో రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి శనివారం రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణానికి భూమిపూజ నిర్వహించనున్నట్టు ఎంపిపి మల్లెల మీణ హన్మంతు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నిరుపేదలకు అందించే రెండు పడక గదుల ఇళ్లలో భాగంగా కిష్టాపూర్‌ గ్రామానికి 5 ఇళ్లు మంజూరయ్యాయన్నారు. భూమిపూజ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రి విచ్చేస్తున్న సందర్భంగా తెరాస కార్యకర్తలు, నాయకులు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.

Check Also

బాసరకు పాదయాత్ర

  బీర్కూర్‌, జనవరి 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వసంత పంచమి సరస్వతిదేవి జన్మదినాన్ని పురస్కరించుకొని బీర్కూర్‌ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *