Breaking News

పల్స్‌పోలియో విజయవంతం చేయండి

 

బీర్కూర్‌, జనవరి 12

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈనెల 28 నుంచి 30 వరకు నిర్వహించే పల్స్‌పోలియో కార్యక్రమం విజయవంతం చేయాలని మండల అభివృద్ది అధికారి భరత్‌కుమార్‌ అన్నారు. బీర్కూర్‌ మండల కేంద్రంలోని తహసీల్‌ కార్యాలయంలో మండలంలోని ఆయా శాఖ అధికారులచే శుక్రవారం సమీక్షించారు. ఈ సందర్బంగా ప్రాథమిక వైద్యులు డాక్టర్‌ దిలీప్‌కుమార్‌ మాట్లాడుతూ 0 నుంచి 5 సంవత్సరాల చిన్నారులకు తప్పకుండా పోలియో చుక్కలు వేయాలని, బీర్కూర్‌, నసురుల్లాబాద్‌ మండలాల్లో సుమారు 6 వేల మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేసేలా లక్ష్యం పెట్టుకున్నామన్నారు. ఇందుకోసం 33 కేంద్రాలు, ఒక మోబైల్‌ వాహనం, 2 బస్టాండ్‌ కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. 28న ఆయా కేంద్రాల్లో పల్స్‌పోలియో వేస్తామని, 29, 30 తేదీల్లో మండలంలోని ఆయా గ్రామాల్లో మిగిలిన చిన్నారులను గుర్తించి ఇంటింటికి వెళ్లి పోలియో చుక్కలు వేస్తామన్నారు. కార్యక్రమంలో నాయబ్‌ తహసీల్దార్‌ ముజీబ్‌, అంగన్‌వాడిలు, ఆరోగ్య కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

Check Also

బాసరకు పాదయాత్ర

  బీర్కూర్‌, జనవరి 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వసంత పంచమి సరస్వతిదేవి జన్మదినాన్ని పురస్కరించుకొని బీర్కూర్‌ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *