Breaking News

ఉపాధ్యాయ వృత్తికి నైపుణ్యాలు పెంపొందించుకోవడం అవసరం

 

కామారెడ్డి, జనవరి 12

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఉపాధ్యాయ వృత్తికి న్యాయం చేయాలంటే నైపుణ్యాలు పెంపొందించుకోవడం అవసరమని కామరెడ్డి కర్షక్‌ బిఇడి కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ రషీద్‌ అన్నారు. అహ్మద్‌ బిఇడి కళాశాలలో శుక్రవారం ప్రభుత్వ, ప్రయివేటు పాఠశాలల్లో ఉపాధ్యాయ శిక్షణ పొందని ఇన్‌సర్వీసు ఉపాద్యాయులకు ఎన్‌ఐఓఎస్‌ ద్వారా బిఇడి కోర్సు ప్రారంభించారు. దీనికి ముఖ్య అతిథిగా హాజరై ఆయన మాట్లాడారు. సామాజిక భద్రత ఉపాధ్యాయుని చేతుల్లో ఉందన్నారు. ఈ కోర్సును ఉపయోగించుకొని నైపుణ్యాలు పెంచుకొని ఉత్తమ ఉపాధ్యాయునిగా తయారుకావాలని సూచించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్‌ బాలు, అధ్యాపక బృందం అనిఫ్‌ పాషా, సత్యనారాయణ, శ్రీనివాస్‌, స్వప్న, సాయిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Check Also

ఐటి సెల్‌ కార్యక్రమానికి తరలిన బిజెపి శ్రేణులు

  కామారెడ్డి, జనవరి 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బిజెపి రాష్ట్ర ఐటిసెల్‌ కార్యక్రమానికి ఆదివారం వెళ్తున్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *