Breaking News

ఘనంగా వివేకానంద జయంతి

 

కామారెడ్డి, జనవరి 12

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : స్వామి వివేకానంద 155వ జయంతి ఉత్సవాలు వివిధ పార్టీలు, స్వచ్చంద సంస్థల ఆధ్వర్యంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. మునిసిపల్‌ కార్యాలయం వద్దగల వివేకానంద విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా బిజెపి రాష్ట్ర అభివృద్ది కమిటీ ఛైర్మన్‌ మురళీధర్‌గౌడ్‌ మాట్లాడుతూ యువతతో పాటు ప్రజలు వివేకుని అడుగుజాడల్లో నడవాలని సూచించారు. కార్యక్రమంలో నాయకులు మోతె కృష్ణాగౌడ్‌, చింతల రమేశ్‌, జూలూరి సుధాకర్‌ తదితరులున్నారు. అలాగే దోమకొండ అనాథ ఆశమంలో బిసి సంఘం ఆధ్వర్యంలో జయంతి ఉత్సవాల్లో భాగంగా విద్యార్థులకు మిఠాయిలు పంచిపెట్టారు. ఆర్యవైశ్య యువజన సంఘం, టిజివిపి, వాసవీక్లబ్‌ తదితర సంస్థల ఆద్వర్యంలో జయంతి ఉత్సవాలు నిర్వహించారు. కార్యక్రమంలో ప్రతినిధులు రమేశ్‌, నిమ్మ దామోదర్‌రెడ్డి, కైలాష్‌ లక్ష్మన్‌, అనిల్‌, నవీన్‌, సురేశ్‌ తదితరులున్నారు.

Check Also

ఐటి సెల్‌ కార్యక్రమానికి తరలిన బిజెపి శ్రేణులు

  కామారెడ్డి, జనవరి 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బిజెపి రాష్ట్ర ఐటిసెల్‌ కార్యక్రమానికి ఆదివారం వెళ్తున్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *