Breaking News

ఘనంగా వివేకానంద జయంతి వేడుకలు

 

బీర్కూర్‌, జనవరి 12

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బీర్కూర్‌, నసురుల్లాబాద్‌ మండలాల్లోని ఆయా గ్రామాల్లో స్వామి వివేకానంద జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. నసురుల్లాబాద్‌ మండల కేంద్రంలో బిజెపి మండల అధ్యక్షుడు సతీష్‌ వివేకానందుని చిత్రపటానికి పూలమాలలువేసి నివాళులు అర్పించారు. అనంతరం మాట్లాడుతూ స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకొని జనవరి 12న జాతీయ యువజనోత్సవం జరుపుకోవడం ఆనందంగా ఉందన్నారు. యువత స్వామిజీని ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో బిజెపి నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

Check Also

బాసరకు పాదయాత్ర

  బీర్కూర్‌, జనవరి 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వసంత పంచమి సరస్వతిదేవి జన్మదినాన్ని పురస్కరించుకొని బీర్కూర్‌ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *