Breaking News

సంకల్ప బలముంటే విజయం సలాం చేస్తుంది

 

నిజామాబాద్‌ టౌన్‌, జనవరి 12

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : యువతకు స్పూర్తి ప్రదాత, ప్రపంచ మేధావులను ఆలోచింపజేసిన మహానుభావుడు స్వామివివేకానంద 155వ జయంతిని సిరికొండ మండలంలోని సత్యశోధక్‌ పాఠశాలలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్‌ నర్సయ్య మాట్లాడుతూ యువతరం నరనరాన శక్తిని రంగరింపజేసి అద్బుత ప్రసంగాలు, మాటలతో యావత్‌ దేశానికే వన్నె తెచ్చిన స్వామి వివేకానంద జీవిత ఇతిహాసం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందని అన్నారు. సంకల్ప బలముంటే విజయం సలాం చేస్తుందని, అంకిత భావం, ఆత్మవిశ్వాసం, కార్యదీక్ష సమూహమైతే అసాద్యమంటూ ఏది లేదన్నారు. అనంతరం స్వామి వివేకానంద చిత్రపటానికి పూలమాలలువేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు, సిబ్బంది పాల్గొన్నారు.

Check Also

బాసరకు పాదయాత్ర

  బీర్కూర్‌, జనవరి 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వసంత పంచమి సరస్వతిదేవి జన్మదినాన్ని పురస్కరించుకొని బీర్కూర్‌ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *