Breaking News

వ్యాయామం, శారీరక శ్రమతో ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి

 

కామారెడ్డి, జనవరి 21

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రతి ఒక్కరు వ్యాయామం, శారీరక శ్రమ, ఆరోగ్య పరీక్షలు చేయించుకుంటూ తమ ఆరోగ్యాన్ని సంరక్షించుకోవాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్‌ సత్యనారయణ అన్నారు. జిల్లా కేంద్రంలోని స్థానిక వివేకానంద పాఠశాలలో ఆదివారం శ్రీప్రసన్నాంజనేయ రెడ్డి సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత మెగా వైద్య శిబిరానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించి ఉచితంగా వైద్య పరీక్షలు జరపడం అభినందనీయమన్నారు. ప్రజలు వ్యాధి వచ్చాక కాకుండా ముందస్తు ఆరోగ్య పరీక్షలు చేయించుకొని చికిత్సలు చేయించుకోవాలని సూచించారు. ముఖ్యంగా మహిళలు, శిశువుల ఆరోగ్యం పట్ల వైద్య శిబిరాలు నిర్వహించాల్సిన అవసరముందన్నారు. వైద్య బృందం బిపి, జిఆర్‌బిఎస్‌, ఇసిజి, టుడిఎకో పరీక్షలు చేశారు. కార్యక్రమంలో సంఘం అధ్యక్షుడు లక్ష్మారెడ్డి, ప్రధాన కార్యదర్శి మధుసూదన్‌రెడ్డి, ప్రతినిదులు మల్లేశ్‌, నరేందర్‌రెడ్డి, మ్యాక్స్‌ క్యూర్‌ ఆసుపత్రి వైద్యులు అనిల్‌కుమార్‌రెడ్డి, నరేశ్‌, శివకుమార్‌, తదితరులు పాల్గొన్నారు.

Check Also

రాజ్యాంగానికి అనుగుణంగా జీవనం సాగించాలి

కామారెడ్డి, ఆగష్టు 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మంగళవారం ఉదయం లింగంపేట్‌లో జరిగిన సమావేశంలో సర్పంచ్‌కు కాంస్టిట్యూషన్‌ ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *