Breaking News

గాంధారి ఆసుపత్రిలో సమస్యలు పరిస్కరించాలి

 

గాంధారి, జనవరి 24

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా గాంధారి మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో సమస్యలు పరిష్కరించాలని రాష్ట్ర వైద్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డికి స్థానిక జడ్పిటిసి తానాజీరావు వినతి పత్రం అందజేశారు. బుధవారం కామారెడ్డి జిల్లాలో వివిధ అభివృద్ది కార్యక్రమాల్లో పాల్గొనడానికి విచ్చేసిన ఆయన గాంధారి మీదుగా బాన్సువాడకు వెళ్తు గాంధారి మండల కేంద్రంలోని నెహ్రూ చౌరస్తా వద్ద మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, ఎంపి బిబి పాటిల్‌తో కలిసి కొద్దిసేపు ఆగారు. ఈ సందర్భంగా జడ్పిటిసి తానాజీరావు గ్రామస్తులతో కలిసి మంత్రికి వినతిపత్రం అందజేశారు. గాంధారి ఆసుపత్రిలో నెలకొన్న సమస్యలను వివరించారు. ప్రస్తుత సిహెచ్‌సి ఆసుపత్రిని ఏరియా ఆసుపత్రిగా మార్చాలని, స్త్రీ వైద్య నిపుణులు, పిల్లల వైద్యులు, అనస్తీషియ వైద్యులు కావాలని సూచించారు. అదేవిధంగా ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీచేయాలని కోరారు. ఆసుపత్రి ఆవరణలో డ్రైనేజీ వ్యవస్థ బాగాలేదని, నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని వినతి పత్రంలో పేర్కొన్నారు. ఆసుపత్రి చుట్టు కాంపౌండ్‌ వాల్‌ నిర్మాణం, ఆసుపత్రి వరకు రోడ్డు నిర్మాణం, బిల్డింగ్‌ మరమ్మతుల కొరకు నిధులు కావాలని అడిగారు. ఆసుపత్రిలో చాలా కాలంగా విద్యుత్‌ వ్యవస్థ పూర్తిగా చెడిపోయిందని, అలాగే ప్లంబింగ్‌ వ్యవస్థ సైతం బాగాలేదని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. కార్యక్రమంలో ఎంపిటిసి రాంకిషన్‌రావు, బెజగం సంతోష్‌, దిలీప్‌రావు, భాస్కర్‌గౌడ్‌, రాజన్న, మధుసూదన్‌ తదితరులున్నారు.

Check Also

ఫిజియోథెరఫి శిబిరం

  నిజాంసాగర్‌, ఫిబ్రవరి 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని మహ్మద్‌నగర్‌, నిజాంసాగర్‌ జడ్పిహెచ్‌ఎస్‌లో ఫిజియోథెరఫి శిబిరాన్ని ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *