Breaking News

5 సం||లోపు చిన్నారులందరికి పోలియో చుక్కలు వేయించాలి

 

– జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌రావు

నిజామాబాద్‌ టౌన్‌, జనవరి 27

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : 5 సంవత్సరాలలోపు చిన్నారులందరికి తప్పకుండా పోలియో చుక్కలు వేయించాలని జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌రావు అన్నారు. శనివారం ఉదయం కలెక్టరేట్‌ నుంచి వైద్య ఆరోగ్యశాఖ ఆద్వర్యంలో ఏర్పాటు చేసిన పల్స్‌ పోలియో అవగాహన ర్యాలీని కలెక్టర్‌ జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ 28వ తేదీ ఆదివారం రోజున పోలియో కేంద్రాల్లో, 29, 30 తేదీల్లో ఇంటింటా తిరుగుతూ పోలియో చుక్కలు వేయడం జరుగుతుందని తెలిపారు. ఇందుకుగాను మొత్తం 1061 పోలియో కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందని, 1007 శాశ్వత కేంద్రాలు, 36 మోబైల్‌ కేంద్రాలు, 18 ట్రానిడ్‌ పాయింట్లను, బస్టాండ్‌, రైల్వే స్టేషన్లలో ఇతర ముఖ్య కూడళ్లలో పోలియో కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందని, ఇందుకుగాను 4172 మంది, 101 మంది సూపర్‌వైజర్లు నియమించామని కలెక్టర్‌ తెలిపారు. ప్రజలందరు 5 సంవత్సరాలలోపు చిన్నారులందరికి తప్పకుండా పోలియో చుక్కలు వేయించి పోలియో రహిత సమాజానికి సహకరించాలని కలెక్టర్‌ అన్నారు. మొత్తం జిల్లా వ్యాప్తంగా 19 వేల 189 మంది చిన్నారులున్నట్టు గుర్తించినట్టు కలెక్టర్‌ తెలిపారు. కార్యక్రమంలో డిఎం అండ్‌ హెచ్‌వో డాక్టర్‌ వెంకట్‌, గంగాధర్‌, సిద్ధార్థ, తిరుమల మెడికల్‌, ఫార్మసీ విద్యార్థులు, రెడ్‌క్రాస్‌, లయన్స్‌ క్లబ్‌ ప్రతినిధులు, జిఎన్‌ఎంలు, ఏఎన్‌ఎంలు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

Check Also

ఎమ్మెల్యేను సన్మానించిన సొసైటీ సభ్యులు

నిజాంసాగర్‌, ఫిబ్రవరి 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజాంసాగర్‌ మండలంలోని అచ్చంపేట్‌ సొసైటీ చైర్మన్‌ నరసింహారెడ్డి, వైస్‌ ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *