Breaking News

పోలియో ర్యాలీని ప్రారంభించిన కలెక్టర్‌

 

కామారెడ్డి, జనవరి 27

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామరెడ్డి జిల్లా కేంద్రంలో శనివారం పోలియో ర్యాలీని జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ జెండా ఊపి ప్రారంభించారు. ర్యాలీలో ఆయనతోపాటు డిఎం అండ్‌ హెచ్‌వో చంద్రశేఖర్‌, మునిసిపల్‌ ఛైర్‌పర్సన్‌ పిప్పిరి సుష్మ, ఆసుపత్రి సూపరింటెండెంట్‌ అజయ్‌, అంగన్‌వాడి అధికారిణి రాధమ్మ, అడ్మినిస్ట్రేషన్‌ అధికారి రాజు, మాస్‌ మీడియా అధికారి శ్రీనివాస్‌ రావులు పాల్గొన్నారు. ప్రభుత్వ ఆసుపత్రి నుంచి ప్రారంభమైన ర్యాలీ అంబేడ్కర్‌ కూడలి, నిజాంసాగర్‌ కూడలి, మునిసిపల్‌ కార్యాలయం, బస్టాండ్‌ మీదుగా సిఎస్‌ఐ చర్చి వరకు సాగింది. ఈ సందర్బంగా జిల్లా వైద్యశాఖాధికారి మాట్లాడుతూ అప్పుడే పుట్టిన పిల్లల నుంచి 5 సంవత్సరాలలోపు చిన్నారులందరికి పోలియో చుక్కలు వేయడానికి పటిష్ట ప్రణాళిక అనుసరించాలని సిబ్బందికి నిర్దేశించారు. కామారెడ్డి జిల్లాలో 0-5 సంవత్సరాల పిల్లలు లక్ష 9 వేల 493 మంది ఉన్నారని, వీరికిగాను 698 పోలియో బూత్‌లు, 34 ట్రాన్సిస్ట్‌ బూత్‌లు, 19 మోబైల్‌ బృందాలు, 192 ప్రాంతాలు ఉండగా 2552 మంది సిబ్బంది కార్యక్రమంలో పాల్గొననున్నట్టు తెలిపారు. ఆదివారం ఉదయం నుంచి కార్యక్రమం ప్రారంభమవుతుందని తెలిపారు. కార్యక్రమంలో సంజీవరెడ్డి, రాణి, దేవి, చలపతి, విఠల్‌రావు తదితరులు పాల్గొన్నారు.

Check Also

రోడ్డు ప్రమాదంలో యువకుని దుర్మరణం

కామారెడ్డి, మే 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మెదక్‌జిల్లా రామాయంపేట బైపాస్‌రోడ్డు వద్ద బుధవారం జరిగిన రోడ్డు ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *