Breaking News

సంధ్య మృతికి కారకులైన వైద్యులపై చర్యలు తీసుకోవాలి

 

కామారెడ్డి, జనవరి 29

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యం కారణంగా మృతి చెందిన గర్భిణీ సంధ్య మృతికి కారకులైన వైద్యులపై చట్టరీత్యా చర్యలుతీసుకోవాలని ఏఐఎఫ్‌డిడబ్ల్యు కామారెడ్డి జిల్లా ఉపాధ్యక్షురాలు వి.లక్ష్మి డిమాండ్‌ చేశారు. సోమవారం కామారెడ్డిలో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యం వల్ల పేద మహిళలు అవస్థలు పడుతున్నారన్నారు. వారం కిందటే ఈ విషయంలో ఆందోళన చేశామని, అయినా వైద్యుల తీరులో మార్పు రాకపోవడం సంద్య మృతికి దారితీసిందన్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యుల తీరు మారకుంటే సమరశీల పోరాటానికి వెనుకాడబోమని స్పష్టం చేశారు. ప్రభుత్వం బాద్యత వహించి సంధ్య కుటుంబానికి 10 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో లక్ష్మి, షహీన్‌, ఖాసింబీ, తదితరులు పాల్గొన్నారు.

Check Also

ప్రజావాణిలో 47 ఫిర్యాదులు

కామారెడ్డి, జూలై 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జనహిత భవనంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *