Breaking News

Daily Archives: February 2, 2018

నిత్యవసర వస్తువులను విడిగా విక్రయించవద్దు

  కామారెడ్డి, ఫిబ్రవరి 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : దుకాణదారులు నూనెలు, ప్రతిపాదిత నిత్యవసర వస్తువులను విడిగా విక్రయించవద్దని జిల్లా సంయుక్త కలెక్టర్‌ సత్తయ్య ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని సమస్త వాణిజ్య, కిరాణ దుకాణ వ్యాపారస్తులు, కూరగాయల దుకాణదారులు ఈ విషయాన్ని గమనించాలని సూచించారు. నిత్యవసర వస్తువుల ధరల నియంత్రణ సమావేశం నిర్వహించి వ్యాపారస్తులకు ఈ మేరకు ఆదేశాలిచ్చినట్టు తెలిపారు. ప్యాకింగ్‌లో నిర్దేశించిన రుసుముతో వస్తువులను అమ్మాలని, ప్రజలు సైతం విడిగా కొనవద్దని సూచించారు. కిలో ఉల్లి ధరను రూ. ...

Read More »

ఫిజియోథెరఫి శిబిరం

  నిజాంసాగర్‌, ఫిబ్రవరి 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని మహ్మద్‌నగర్‌, నిజాంసాగర్‌ జడ్పిహెచ్‌ఎస్‌లో ఫిజియోథెరఫి శిబిరాన్ని శుక్రవారం నిర్వహించారు. మండలంలోని ఆయా ప్రబుత్వ పాఠశాలల్లో చదువుతున్న 19 మంది దివ్యాంగ విద్యార్థులకు వైద్యురాలు ప్రణీత పలు రకాల వ్యాయామాలు చేయించారు. ప్రతిరోజు ఇంటి వద్ద చేయాల్సిన వ్యాయామం గురించి, సంరక్షణ గురించి సూచించారు. శిబిరంలో ఉపాధ్యాయులు అమర్‌సింగ్‌, సునీల్‌, సాయిలు, తదితరులున్నారు.

Read More »

ఓటరు జాబితా పకడ్బందీగా రూపొందించాలి

  కామారెడ్డి, ఫిబ్రవరి 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఓటరు జాబితాను పూర్తిస్థాయిలో పరిశీలించి ప్రచురించాలని చీఫ్‌ ఎలక్టోరల్‌ అధికారి అనుప్‌సింగ్‌ వీడియో కాన్ఫరెన్సు ద్వారా అధికారులకు సూచించారు. శుక్రవారం ఆర్డీవో కార్యాలయంలో ఏర్పాటైన వీడియో కాన్ఫరెన్సులో ఆయన అధికారులతో మాట్లాడారు. జనవరి 23న ఓటరు రోల్స్‌ ప్రచురణ, ఫిబ్రవరి 14 వరకు క్లెయిమ్‌, అబ్జెక్షన్‌ చేపట్టి మార్చి 5 నాటికి జీరో క్లెయిమ్‌ చేయాలన్నారు. ఫిబ్రవరి 4, 11న ప్రత్యేక క్యాంపెయిన్‌ చేపట్టాలని సూచించారు. నియోజకవర్గాల్లో రాజకీయ పార్టీల సమావేశం ...

Read More »

లయన్స్‌ క్లబ్‌ ఆధ్వర్యంలో శవపేటిక వితరణ

  కామారెడ్డి, ఫిబ్రవరి 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : లయన్స్‌ క్లబ్‌ ఆఫ్‌ భిక్కనూరు ఆద్వర్యంలో శుక్రవారం భిక్కనూరులో శవపేటికను వితరణ చేశారు. మృతదేహాలను భద్రపరిచేందుకు వినియోగించే ఫ్రీజర్‌ను వితరణ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ లయన్స్‌ క్లబ్‌ ఆధ్వర్యంలో చేపడుతున్న సామాజిక సేవా కార్యక్రమాల్లో భాగంగా ఫ్రీజర్‌ను అందజేసినట్టు తెలిపారు. కార్యక్రమానికి అతిథిగా హాజరైన జాయింట్‌ కలెక్టర్‌ సత్తయ్య క్లబ్‌ సేవలను కొనియాడారు. కార్యక్రమంలో క్లబ్‌ ప్రతినిధులు వి.టి.రాజ్‌కుమార్‌, చంద్రకాంత్‌, రేణుకుమార్‌, రాజమౌళి, రాజన్న, భిక్షపతి, నందరమేశ్‌, నర్సింహరెడ్డి, ...

Read More »

బాధిత కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే

  నిజాంసాగర్‌, ఫిబ్రవరి 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజాంసాగర్‌ మండలంలోని నర్వా గ్రామానికి చెందిన చింతల శివకన్య కుటుంబాన్ని జుక్కల్‌ ఎమ్మెల్యే హన్మంత్‌ షిండే శుక్రవారం పరామర్శించారు. నర్వా గ్రామానికి చెందిన చింతల కృష్ణమూర్తి సతీమని శివకన్య జనవరి 28న మృతి చెందారు. దీంతో కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే పరామర్శించారు. మృతురాలి కుమారుడు సాక్షరభారతి మండల కో ఆర్డినేటర్‌గా పనిచేస్తున్నాడు. ఈ కుటుంబానికి సిఎం సహాయనిధి కింద ఆర్థిక సాయం అందిస్తామని ఎమ్మెల్యే తెలిపారు. ఎమ్మెల్యే వెంట మండల తెరాస ...

Read More »

దళిత మోర్చా మండల అధ్యక్షునిగా శ్రవణ్‌

  బీర్కూర్‌, ఫిబ్రవరి 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నసురుల్లాబాద్‌ మండల దళిత మోర్చా అధ్యక్షునిగా వర్ని శ్రావణ్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్టు మండల బిజెపి అద్యక్షుడు సతీష్‌ తెలిపారు. నసురుల్లాబాద్‌ మండల కేంద్రంలోని రామాలయంలో జిల్లా కిసాన్‌ మోర్చా అధ్యక్షుడు పోతంగల్‌ కిషన్‌ ఆద్వర్యంలో ఏకగ్రీవంగా బిజెపి దళిత మోర్చా అధ్యక్షుని ఎన్నుకున్నట్టు తెలిపారు. బాన్సువాడ అసెంబ్లీ నియోజకవర్గ కన్వీనర్‌ సాయిలు, బిజెపి నాయకులు పాల్గొన్నారు.

Read More »

ముదిరాజ్‌లను బిసి ఏ లో కలపాలి

  బీర్కూర్‌, ఫిబ్రవరి 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ముదిరాజ్‌ కులస్తులను బిసి ఏ లో చేర్చాలని బీర్కూర్‌, నసురుల్లాబాద్‌ మండలాల్లో ముదిరాజ్‌ కులస్తులు బైక్‌ ర్యాలీ నిర్వహించి అనంతరం ఆయా మండలాల తహసీల్దార్‌లకు తమ డిమాండ్లతో కూడిన వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ న్యాయమైన డిమాండ్లు ప్రభుత్వం తీర్చాలని కోరారు. గ్రామంలో ముదిరాజ్‌ కమ్యూనిటీ హాల్‌లు నిర్మించాలని, ప్రతి మండలంలో ముదిరాజ్‌ విద్యార్థులకు గురుకుల పాఠశాల నిర్మించాలని, మత్స్య కార్మిక సంఘంలో సభ్యత్వం ఇవ్వాలని, ...

Read More »

తెరాస పార్టీలో చేరిన గోసంగి సభ్యులు, విడిసి సభ్యులు

  ఆర్మూర్‌, ఫిబ్రవరి 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ మండలంలోని చేపూర్‌ గ్రామనికి చెందిన గోసంగి సంఘం సభ్యులు తెరాసలో చేరారు. వీరిని ఆర్మూర్‌ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. గోసంగి సంఘం సభ్యులు కమ్యూనిటి హాల్‌ నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని వినతి పత్రం సమర్పించారు. దీనికి సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే రూ. 5 లక్షల నిధులు కేటాయించారు. సత్తయ్య, మల్లేశ్‌, నర్సింగ్‌, దేవరాజు, గంగాధర్‌, లక్ష్మి, భారతి, సుజాత, ఆర్మూర్‌ జడ్పిటిసి సాందన్న ఉన్నారు. ...

Read More »

దేశానికే ఆదర్శం మిషన్‌ భగీరథ

  – రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి నిజాంసాగర్‌, ఫిబ్రవరి 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్రంలోని గ్రామీణ, పట్టణ ప్రజలందరికి రక్షిత మంచినీటిని సరఫరా చేయాలన్న లక్ష్యంతో దేశంలో ఎక్కడా లేనివిధంగా భగీరథ ప్రయత్నం జరుగుతుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. సంగారెడ్డి జిల్లా పుల్కల్‌ మండలంలోని సింగూరు ప్రాజెక్టు వద్ద రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్‌ భగీరథ మోటార్లు, ఇన్‌టెక్‌ వెల్‌ మోటారును నీటిపారుదల శాఖ మంత్రి హరీష్‌రావు, మంత్రి ...

Read More »

మరుగుదొడ్ల నిర్మాణానికి సహకరించండి

  నిజాంసాగర్‌, ఫిబ్రవరి 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఇంటింటా వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణానికి ప్రతి ఒక్కరు సహకరించాలని ఎంపిడివో రాములు నాయక్‌ అన్నారు. మండలంలోని నర్సింగ్‌రావుపల్లి గ్రామంలో వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాలపై గ్రామస్తులతో శుక్రవారం సమావేశం నిర్వహించారు. గ్రామంలో వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం కోసం ప్రభుత్వం రూ. 12 వేల చొప్పున నిధులు మంజూరు చేస్తుందన్నారు. ఇందుకోసం గ్రామంలో 111 మరుగుదొడ్లకు గ్రూపుగా నిధులు మంజూరయ్యాయన్నారు. వచ్చిన నిధులకు సంబంధించిన పనులు పూర్తికావడంతో మరుగుదొడ్ల పూర్తయినట్టు గ్రామస్తులు అన్నారు. అలాగే ...

Read More »

టిఆర్ఎస్ పార్టీ లో నందిపేట్ నాయకుల చేరిక

ఈరోజు నందిపేట్ నుండి మచ్చర్ల సాయన్న( మాజీ సర్పంచ్ -నందిపేట్,మాజీ మార్కెట్ కమిటీ డైరెక్టర్ నిజామాబాద్),కొత్తూరు రాజేశ్వర్ (సింగల్ విండో చైర్మైన్ ఇలాపూర్),మంద సాయన్న(కాంగ్రెస్ కిసాన్ సెల్ మండల్ ప్రెసిడెంట్) మరియు మంద మౌలాజి (సీనియర్ కాంగ్రెస్ నాయకులు) సింగ్స్ పార్టీ నుండి 400 మంది అనుచరులతో టిఆర్ఎస్ పార్టీ లో చేరారు.వీరిని నిజామాబాద్ పార్లమెంట్ సభ్యురాలు శ్రీమతి కవిత గారు మరియు నియోజకవర్గ పు శాసన సభ్యులు శ్రీ జీవన్ రెడ్డి గారు టిఆర్ఎస్ కండువా కప్పి పార్టీ లో కి ఆహ్వానించారు ...

Read More »

రైతు పండించిన ప్రతీ గింజను ప్రభుత్వం కొనుగోలు చేయాలి

 –టీ జాక్ కన్వీనర్ ప్రో..కోదండరామ్….. గాంధారి: రైతులు పండించిన ప్రతి ధాన్యపు గింజను గిట్టుబాటు ధరకు ప్రభుత్వమే కొనుగోలు చేయాలని తెలంగాణ జేఏసీ కన్వీనర్ ప్రొఫెసర్ కోదండరామ్ డిమాండ్ చేశారు. రైతు అధ్యయన యాత్రలో భాగంగా గురువారం కామారెడ్డి జిల్లా గాంధారి మండల కేంద్రంలోని మార్కెట్ కమిటీ కార్యాలయంలో కొనుగోలు కేంద్రాలను పరిశీలించి రైతులతో మాట్లాడారు. ఈ సందర్భంగా మార్కెట్ కమిటీ కార్యాలయం ఆవరణలో రైతులు నిల్వ ఉంచిన మొక్కజొన్న లను పరిశీలించారు. రైతులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గిట్టుబాటు ధర వల్ల ...

Read More »

అక్రమ నిర్మాణాన్ని నిలిపివేయాలి

  కామారెడ్డి, ఫిబ్రవరి 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : దోమకొండ మండలం సంగమేశ్వర్‌ గ్రామంలో నిర్మిస్తున్న అక్రమ నిర్మాణాన్ని నిలుపుదల చేయాలని గ్రామస్తులు గురువారం జాయింట్‌ కలెక్టర్‌ సత్తయ్యకు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సంగమేశ్వర్‌ గ్రామంలో హనుమాన్‌ ఆలయం పక్కన గ్రామ పంచాయతీ అనుమతి పొందకుండా క్రిస్టియన్‌ ట్రస్టు భవనం పేరిట అక్రమ నిర్మాణం చేపట్టారన్నారు. దీనికి సంబంధించి నిర్మాణం నిలుపుదలకోసం గ్రామ పంచాయతీ నుంచి నోటీసులు జారీచేసినా అక్రమంగా ట్రస్టు భవన నిర్మాణం చేపడుతున్నారన్నారు. ...

Read More »