Breaking News

చట్టాలపై అవగాహన అవసరం

 

నిజామాబాద్‌ టౌన్‌, ఫిబ్రవరి 3

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సమాజంలో ప్రతి ఒక్కరికి చట్టాలపై కనీస అవగాహన ఉండాలని జిల్లా సీనియర్‌ సివిల్‌ జడ్జి సూర్యచంద్రకళ అన్నారు. శనివారం ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన సమాచార హక్కు చట్టం -2005 అవగాహన సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరై ఆమె మాట్లాడారు. సమాచార హక్కు చట్టం వల్ల సామాన్యునికి న్యాయం జరుగుతుందని, ప్రతి ఒక్కరు దీనిపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని, చట్టం కార్యకర్తలను ప్రోత్సహించాలని ఆమె అన్నారు. సమాచారహక్కు చట్టం వికాస సమితి నిజామాబాద్‌ జిల్లా అధ్యక్షుడు కిరణ్‌కుమార్‌ మాట్లాడుతూ సామాన్య మానవునికి తమ సమస్యల పరిష్కారం కొరకు సమాచార హక్కు చట్టం ఎంతగానో ఉపయోగపడుతుందని, అదేవిధంగా తమ సమితి కూడా సామాన్యులకు ఎల్లవేళలా సేవలందించడానికి సిద్దంగా ఉందని, ప్రజల్లో ఆర్‌టిఐ చట్టాన్ని తీసుకొని వెళ్లడం, ప్రజలకు అవగాహన కల్పించడం లాంటి కార్యక్రమాలు చేపడుతున్నామని ఆయన అన్నారు. సమావేశంలో సమితి జిల్లా వ్యవహార అధ్యక్షుడు, కన్వీనర్‌ జానకిరాజు, ఉపాధ్యక్షుడు పోనుగంటి సుమన్‌రెడ్డి, గణేశ్‌, నాగరాజు, చింతల సాయికృష్ణ, దుబ్బాక రవికుమార్‌, మహ్మద్‌ సలీం, గోపాలవర ప్రసాద్‌, గంగారాం, శ్రీనివాస్‌, సాయికుమార్‌ యాదవ్‌, తదితరులున్నారు.

Check Also

ఆరోగ్య సేవలపై జాయింట్‌ డైరెక్టర్‌ సమీక్ష

కామారెడ్డి, మే 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జనహిత సమావేశ మందిరంలో శనివారం మాతా శిశు ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *