Breaking News

అంగన్‌వాడి సెంటర్లకు కుర్చీల వితరణ

 

కామారెడ్డి, ఫిబ్రవరి 3

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలోని 12వ వార్డు భరత్‌రోడ్డులోగల అంగన్‌వాడి కేంద్రానికి కౌన్సిలర్‌ కుంభాల రవి యాదవ్‌ శనివారం 30 కుర్చీలను వితరణ చేశారు. అంగన్‌వాడి కేంద్రానికి వచ్చే చిన్నారులు నేలపై కాకుండా కుర్చీల్లో కూచొని చదువుకోవడానికి వీలుంటుందని కుర్చీలు అందజేసినట్టు తెలిపారు. అంగన్‌వాడి కేంద్రాలను బలోపేతం చేసేందుకు తనవంతుగా కుర్చీలు అందజేసినట్టు తెలిపారు. అనంతరం విద్యార్థులకు అందిస్తున్న ఆహారాన్ని పరిశీలించారు. కార్యక్రమంలో కౌన్సిలర్‌ రవి యాదవ్‌, కేంద్ర నిర్వాహకురాలు మంజుల, భవాని, శాంతి, మేఘన, తదితరులు పాల్గొన్నారు.

Check Also

సెయింట్‌ థెరిసా హై స్కూల్‌ సీజ్‌ చేశారు

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలోని కంఠేశ్వర్‌ ప్రాంతంలోగల సెయింట్‌ థెరిసా ...

Comment on the article