Breaking News

మహాగణపతి ఆలయంలో సంకట హర చతుర్థి

 

నిజామాబాద్‌ టౌన్‌, ఫిబ్రవరి 3

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నగరంలోని బొడ్డెమ్మ చెరువు వద్ద గల మహా గణపతి ఆలయంలో శనివారం సంకట హర చతుర్థిని పురస్కరించుకొని స్వామివారికి పంచామృతాభిషేకం, సింధూర సమర్పణ, గరికపూజ, గణపతి హోమం తదితర కార్యక్రమాలు నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామి వారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఆలయ కమిటీ ఛైర్మన్‌ భూషణ్‌చారి, పూజారులు రాజీవ్‌శర్మ, రాజు, సత్యం, శ్రీనివాస్‌, మురళి, సతీష్‌ తదితరులు పాల్గొన్నారు.

Check Also

మహిళ అభ్యున్నతికి పాటుపడిన వారందరికీ ధన్యవాదాలు

నిజామాబాద్‌, మార్చ్‌ 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బీసీ మహిళా సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షురాలు పొదిల‌ ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *