Breaking News

ఎంపి క‌ల్వ‌కుంట్ల క‌విత మంత్రి హ‌రీశ్ స‌మావేశ‌o

నిజామాబాద్ పార్ల‌మెంటు నియోజ‌క వ‌ర్గంలో ఎత్తిపోత‌ల ప‌థ‌కాల‌ను మంజూరు చేసి, నిధుల‌ను కూడా మంజూరు చేయాల‌ని నిజామాబాద్ ఎంపి క‌ల్వ‌కుంట్ల క‌విత ఇరిగేష‌న్‌, మార్కెటింగ్ శాఖ‌ల మంత్రి హ‌రీశ్ రావును కోరారు. ఈ మేర‌కు నియోజ‌క వ‌ర్గాల వారీగా ప్ర‌తిపాద‌న‌ల‌ను మంత్రికి అంద‌జేశారు. శ‌నివారం హైద‌రాబాద్ జ‌ల‌సౌధ‌లో ఎంపి క‌విత మంత్రి హ‌రీశ్ రావుతో స‌మావేశ‌మ‌యి సాగునీటి ప్రాజెక్టులు, కొత్త‌గా ఆయ‌క‌ట్టు పెంచేలా చ‌ర్య‌లు తీసుకోవ‌డంతో పాటు ప్ర‌స్తుత ఆయ‌క‌ట్టుకు సాగునీటి స్థిరీక‌ర‌ణ‌పై చ‌ర్చించారు. నియోజ‌క వ‌ర్గాల వారీగా స‌మ‌ర్పించిన ప్ర‌తిపాద‌న‌లు..

బోధన్ నియోజ‌క వ‌ర్గంలోని బినోల‌, క‌ల్దుర్కి నూత‌న ఎత్తిపోత‌ల ప‌థ‌కాల‌కు మంజూరి చేయాల‌ని నిజామాబాద్ ఎంపి క‌ల్వ‌కుంట్ల క‌విత మంత్రి హ‌రీశ్ రావును కోరారు. దీంతో పాటు నిజాంసాగ‌ర్ డిస్ట్రిబ్యూట‌రీల ఆధునీక‌ర‌ణ ప‌నుల‌కు మంత్రి హ‌రీశ్ రావు ఈ నెల 19వ తేదీన శంకుస్థాప‌న చేస్తారు. ఇప్ప‌టికే ఈ ప‌నుల కోసం మొద‌టి విడ‌త‌లో రూ.115 కోట్లు మంజూరు కాగా ప‌నులు చివ‌రి ద‌శ‌లో ఉన్నాయి. ఇక రెండ‌వ విడ‌త‌లో రూ. 93 కోట్లు మంజ‌ర‌యిన విష‌యం తెలిసిందే. బోద‌న్ నియోజ‌క వ‌ర్గంలో రూ.50 కోట్ల‌తో ఆధునీక‌ర‌ణ ప‌నులు చేప‌డ‌తారు. ఈ ప‌నుల‌ను మంత్రి హ‌రీశ్ రావు శంకుస్తాప‌న చేస్తారు.
అలాగే బోధ‌న్ నియోజ‌క వ‌ర్గానికి సంబంధించి తాడి బిలోలి ఎత్తిపోత‌ల ప‌థ‌కం, నిజాంపూర్ ఎత్తిపోత‌ల ప‌థ‌కం మ‌ర‌మ్మ‌త్తుల కోసం నిధులు కేటాయించాల‌ని ఎంపి క‌విత మంత్రి హ‌రీశ్ రావును కోరారు.

నిజామాబాద్ రూర‌ల్ నియోజ‌క వ‌ర్గంలో దుబ్బాక నూత‌న ఎత్తిపోత‌ల ప‌థ‌కానికి రూ.5 కోట్లు మంజూరు చేయాల‌ని కోరారు. అదే విధంగా బ‌ర్దీపూర్ ఎత్తిపోత‌ల ప‌థ‌కం మ‌ర‌మ్మ‌తుల‌కు నిధులు మంజూరు చేయాల‌ని కోరారు. చెక్ డ్యాంల‌ను కూడా మంజూరు చేయాల‌ని కోరారు.

 

ఆర్మూరు నియోజ‌క వ‌ర్గంలోని ప‌తేపూర్‌, సుబ్బిర్యాల్‌, కంతం, నిర్దాప‌ల్లి, మాచ‌ర్ల‌, మెట్‌ప‌ల్లి మ‌రియు ఆలూరు నూత‌న ఎత్తిపోత‌ల ప‌థ‌కాల‌కు నిధులు మంజూరు చేయాల‌ని కోరారు. అదేవిధంగా ఆర్మూర్‌లో వ‌న్నెల్ కె, త‌ల్వెడ‌, ద‌త్తాపూర్‌, బాద్‌గుణ‌, మంథ‌ని ఎత్తిపోత‌ల ప‌థ‌కాల మ‌ర‌మ్మ‌తుల‌కు నిధులు మంజూరు చేయాల‌ని ఎంపి కవిత కోరారు.

బాల్కొండ నియోజ‌క వ‌ర్గంలో పెద్ద‌వాగు చెక్ డ్యాం నిర్మాణంకు నిధులు కేటాయించాల‌ని కోరారు. ప‌చ్చ‌ల న‌డుకుడ‌, త‌డ‌పాక‌ల్‌, దోమ‌చంద‌, తాళ్ల‌రాంపూర్‌, చిట్టాపూర్‌ల‌లో నూత‌నంగా నిర్మించ త‌ల‌పెట్టిన ఎత్తిపోత‌ల ప‌థ‌కానికి నిధులు మంజూరు చేయాల‌ని కోరారు. జ‌లాల్‌పూర్‌, తొడ్తి, నాగేపూర్ ఎత్తిపోత‌ల మ‌ర‌మ్మ‌తు ప‌నుల‌కు నిధులు ఇవ్వాల‌ని కోరారు.

 

జ‌గిత్యాల మార్కెట్‌కు రూ. 5 కోట్లు మంజూరు
9న ఉన్న‌త స్థాయి స‌మావేశం

జ‌గిత్యాల మార్కెట్‌కు రూ. 5 కోట్లు మంజూరు చేశారు ఇరిగేష‌న్‌, మార్కెటింగ్ శాఖ‌ల మంత్రి హ‌రీశ్ రావు. శ‌నివారం హైద‌రాబాద్ జ‌ల‌సౌధ‌లో మంత్రితో నిజామాబాద్ ఎంపి క‌ల్వ‌కుంట్ల స‌మావేశ‌మ‌య్యారు. జ‌గిత్యాల చ‌ల్‌గ‌ల్ మార్కెట్ లో మౌళిక స‌దుపాయాల‌పై చ‌ర్చించారు. ఈ సంద‌ర్భంగా జ‌గిత్యాల మామిడికి దేశ‌వ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చేవిధంగా ఉద్యాన‌వ‌న శాఖ‌, మార్కెటింగ్ స‌మ‌న్వ‌యంతో ప‌నిచేయాల‌ని మంత్రి హ‌రీశ్ రావు సూచించారు. జ‌గిత్యాల మ్యాంగోకు అంత‌ర్జాతీయ మార్కెట్ క‌ల్ప‌న‌కు ఈ నెల 9వ తేదీన హైద‌రాబాద్‌లో మార్క్‌ఫెడ్‌, |హార్టిక‌ల్చ‌ర్‌, అగ్రిక‌ల్చ‌ర్‌, అపెడా శాఖ‌ల‌తో స‌మావేశ‌మ‌వ్వాల‌ని స‌మావేశంలో నిర్ణ‌యం తీసుకున్నారు. ఈ స‌మావేశానికి వ్య‌వ‌సాయ మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి, ఇరిగేష‌న్‌, మార్కెటింగ్ శాఖల మంత్రి హ‌రీశ్ రావుతో పాటు ఎంపి క‌ల్వ‌కుంట్ల క‌విత హాజ‌ర‌వుతారు.
నిజామాబాద్ టౌన్‌లో ఈ నెల 19న స‌ద్దిమూట కార్య‌క్ర‌మాన్ని మంత్రి హ‌రీశ్ రావు ప్రారంభిస్తారు. అలాగే క‌ర్ష‌క భ‌వ‌న్‌ను ప్రారంభిస్తారు. అదే రోజు నిజామాబాద్ మార్కెట్ యార్డ్‌లో మౌళిక స‌దుపాయాల క‌ల్ప‌న‌పై స‌మావేశాన్ని క‌డా నిర్వ‌హిస్తారు.
 ప‌సుపు రైతుల‌కు రైతు బంధు ప‌థ‌కం వ‌ర్తింపు
రూ.2 ల‌క్ష‌ల వ‌ర‌కు రుణం ఇవ్వ‌నున్న మార్కెటింగ్ శాఖ‌
ష‌లించిన ఎంపి క‌విత కృషి

ప‌సుపు రైతుల‌కు శుభ‌వార్త‌. మార్కెట్ ధ‌ర‌ల ఒడిదుడుకుల నుండి ప‌సుపు రైతుల‌ను ఆదుకునేందుకు రైతు బంధు ప‌థ‌కాన్ని ప్ర‌భుత్వం వ‌ర్తింపచేయాల‌ని నిర్ణ‌యించింది. నిజామాబాద్ ఎంపి క‌ల్వ‌కుంట్ల కవిత ఇరిగేష‌న్‌, మార్కెటింగ్ శాఖల‌ మంత్రి హ‌రీశ్ రావును క‌లిసి ప‌సుపు రైతుల‌ను ఆదుకునే అంశంపై సుదీర్గంగా చ‌ర్చించారు. వ్య‌వ‌సాయోత్ప‌త్తులు, మార్కెటింగ్ సౌకర్యాలు త‌దిత‌ర అంశాల‌పై మార్కెటింగ్ శాఖ అధికారుల‌తో స‌మీక్షించారు.ప‌సుపు పంట చేతికొచ్చే స‌మ‌యానికి ధ‌ర ప‌డిపోతున్న నేప‌థ్యంలో ఎంపి క‌విత విజ్ఞ‌ప్తి మేర‌కు రైతు బంధు ప‌థ‌కాన్ని ప‌సుపు రైతుల‌కు వ‌ర్తింప‌చేయాల‌ని నిర్ణ‌యం తీసుకున్నారు. మార్కెటింగ్ శాఖ జాయింట్ డైరెక్ట‌ర్ ర‌వికుమార్‌ను రేపే నిజామాబాద్‌కు వెళ్లి ట్రేడ‌ర్లు, అధికారుల‌తో స‌మావేశాన్ని కూడా ఏర్పాటు చేయాల‌ని మంత్రి హ‌రీశ్ రావు ఆదేశించారు. మార్కెట్‌లో ధ‌ర ప‌డిపోయిన సంద‌ర్భంలో రైతులు ప‌సుపును కోల్డ్ స్టోరేజిలో నిల్వ‌చేసుకుని, ధ‌ర బాగా ఉంద‌నుకున్న‌ప్పుడు విక్ర‌యించుకునే అవ‌కాశం రైతు బంధు ప‌థ‌కంలో ల‌భిస్తుంది. అలాగే ప్ర‌తి రైతుకు ర‌. 2 ల‌క్ష‌లు అప్పుగా ఇస్తారు. ఈ అప్పుపై 6 నెల‌ల వ‌ర‌క ఎలాంటి వ‌డ్డీ వ‌స‌లు చేయ‌రు. ప‌సుపు అమ్ముకోగానే తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. ప‌సుపు రైతుల‌ను ఆదుకునేందుకు కీల‌క‌మైన నిర్ణ‌యాన్ని తీసుకున్న మంత్రి హ‌రీశ్ రావుకు ఎంపి క‌విత కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు.

Check Also

బహుభాషా కోవిదుడు పి.వి.

నిజామాబాద్‌, జూన్‌ 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆదివారం ఉదయం నిజామాబాద్‌ కమిషనరేట్‌ పోలీస్‌ కార్యాల‌యంలో మరియు ...

Comment on the article