Breaking News

Daily Archives: February 5, 2018

గుర్తు తెలియని వాహనం డీ కొని సంఘటన స్థలంలొనే యూవకుడు మృతి

కామారెడ్డి జిల్లా… నిజాంసాగర్ మండలం లోని నిజాంసాగర్ ప్రాజెక్ట్ గేట్ల సమీపంలో గుర్తు తెలియని వాహనం డీ కొని సంఘటన స్థలం లొనే ఎల్లారెడ్డి మండలానికి చెందిన సతీష్ (23) అనే యూవకుడు మృతి.. మృతి చెందిన సతీష్ నారాయణఖేడ్ వైపు నుండి ద్విచక్ర వాహనంపై ఎల్లారెడ్డి కి వస్తుండగా ప్రమాదం జరిగినట్లు సమాచారం…  

Read More »

టిటిఎఫ్‌ క్యాలెండర్‌ ఆవిష్కరణ

  కామరెడ్డి, ఫిబ్రవరి 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సామిల్స్‌ అండ్‌ టింబర్‌ మర్చంట్స్‌ వెల్పేర్‌ అసోసియేషన్‌ ఆద్వర్యంలో రూపొందించిన టిటిఎఫ్‌ 2018 క్యాలెండర్‌ను సోమవారం సిసిఆర్‌ నిజామాబాద్‌ వినయ్‌కుమార్‌, డిఎప్‌వో బాలమణి, రేఖాబాయిలు ఆవిష్కరించారు. కార్యక్రమంలో సామిల్‌ ప్రతినిధులు వెంకటేశ్‌, మోహన్‌రెడ్డి, గంగాధర్‌, కాంతిలాల్‌, విఠల్‌, అక్రమ్‌, రాజిరెడ్డి, సాయిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Read More »

సంక్షేమ పథకాలు అందేలా అధికారులు కృషి చేయాలి

  కామారెడ్డి, ఫిబ్రవరి 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ ఫలాలు ప్రజలకందేలా అధికారులు నిరంతరం సమీక్షించాలని జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ ఫోన్‌ఇన్‌ కార్యక్రమంలో భాగంగా జిల్లా అధికారులకు సూచించారు. ప్రతినెల మొదటి సోమవారం నిర్వహించే ఫోన్‌ఇన్‌ కార్యక్రమంలో కలెక్టర్‌ ఫిర్యాదులు స్వీకరించి పరిష్కరించడంతో పాటు సంబంధిత అధికారులు ప్రతీవారం సమీక్షించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఫోన్‌ ఇన్‌ ద్వారా ప్రజలు చేసిన ఫిర్యాదులను అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. వాటిని పరిశీలించి వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. సమావేశంలో డిఆర్వో మణిమాల, ...

Read More »

వృద్ధాశ్రమంలో దుస్తుల పంపిణీ

  కామారెడ్డి, ఫిబ్రవరి 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్‌ జన్మదినాన్ని పురస్కరించుకొని తెరాస పార్టీ నాయకులు కామారెడ్డి శివారులోని వృద్దాశ్రమంలో వృద్దులకు దుస్తులు, పండ్లు పంపిణీ చేశారు. పంచముఖి హనుమాన్‌ ఆలయ కమిటీ ఛైర్మన్‌ గైని శ్రీనివాస్‌ గౌడ్‌, పార్టీ సీనియర్‌ నాయకులు జూకంటి ప్రభాకర్‌రెడ్డి ఆద్వర్యంలో వీటిని పంపిణీ చేశారు. పట్టణ తెరాస నాయకుడు సంగమేశ్వర్‌, మైనార్టీ నాయకులు షౌకత్‌ అలీ ఖాన్‌ ఆధ్వర్యంలో ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో రోగులకు అల్పాహారం పంపిణీ చేశారు. ...

Read More »

ఘనంగా ఎమ్మెల్యే జన్మదిన వేడుకలు

  కామారెడ్డి, ఫిబ్రవరి 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రభుత్వ విప్‌, కామరెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్‌ జన్మదిన వేడుకలను సోమవారం ఆయన కుటుంబ సభ్యులు, పార్టీ నాయకుల మధ్య ఘనంగా జరుపుకున్నారు. గంప గోవర్ధన్‌ కేక్‌ కట్‌చేయగా తల్లి, సతీమణికి, పార్టీ శ్రేణులకు పంచిపెట్టారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎమ్మెల్యేకు పుష్పగుచ్చాలు అందజేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో మునిసిపల్‌ ఛైర్మన్‌ పిప్పిరి సుష్మ, ఎంపిపి లద్దూరి మంగమ్మ, ఐసిడిఎంఎస్‌ ఛైర్మన్‌ ముజీబుద్దీన్‌, నాయకులు రమేశ్‌ గుప్త, ప్రభాకర్‌రెడ్డి, చంద్రశేఖర్‌, ...

Read More »

లేబర్‌ కార్యాలయంలో సిబ్బందిని నియమించాలి

  కామారెడ్డి, ఫిబ్రవరి 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామరెడ్డి కార్మికశాఖ కార్యాలయంలో సిబ్బందిని పూర్తిస్థాయిలో నియమించాలని ఏఐసిటియు అనుబంధ ఐక్య బిల్డింగ్‌ అండ్‌ అదర్‌ కన్‌స్ట్రక్షన్స్‌ వర్కర్స్‌ యూనియన్‌ ఆధ్వర్యంలో స్థానిక లేబర్‌ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. అనంతరం జిల్లా కలెక్టర్‌ కార్యాలయం వరకు నిరసన ర్యాలీ చేపట్టారు. జిల్లా సంయుక్త కలెక్టర్‌ సత్తయ్యకు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా సంఘం జిల్లా అధ్యక్షుడు తిరుపతి, కార్యదర్శి రాజలింగం మాట్లాడుతూ లేబర్‌ కార్యాలయంలో అధికారులు లేకపోవడంతో కార్మికుల ...

Read More »

భారీ మొత్తంలో క్లోరోహైడ్రేట్‌ స్వాధీనం

  నిజామాబాద్‌ టౌన్‌, ఫిబ్రవరి 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లా పోచంపాడ్‌ ఎక్స్‌రోడ్డు వద్ద ఎక్సైజ్‌ ఎన్‌పోర్సుమెంట్‌ బృందం సోమవారం జరిపిన రూట్‌ వాచ్‌లో భారీ మొత్తంలో కల్తీకల్లుకు వినియోగించే 180 కిలోల క్లోరోహైడ్రేట్‌ను స్వాధీనం చేసుకున్నట్టు ఎక్సైజ్‌ డిప్యూటి కమీషనర్‌ డేవిడ్‌ రవికాంత్‌ తెలిపారు. సోమవారం ఎక్సైజ్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సుంకెట్‌కు చెందిన గంధం శ్రీనివాస్‌ గౌడ్‌ అలియాస్‌ సుంకెట్‌ శ్రీను తన ఇండికా వెస్తా కారులో క్లోరోహైడ్రేట్‌ తరలిస్తుండగా ...

Read More »

కార్పొరేటర్‌పై చర్యలు తీసుకోవాలి

  నిజామాబాద్‌ టౌన్‌, ఫిబ్రవరి 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కార్పొరేటర్‌ షకీల్‌పై చర్యలు తీసుకొని తమ భూమి కబ్జానుంచి రక్షించాలని నిజామాబాద్‌ నగరానికి చెందిన ఏ.ఆనంద్‌కుమార్‌, అతని సోదరులు సోమవారం ప్రజావాణిలో కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. అనంతరం బాధితుడు ఆనంద్‌ మట్లాడుతూ తమకు మాలపల్లి ప్రాంతంలో వారసత్వంగా లభించిన భూమి (సర్వే నెంబరు 2481, 2482, 2484)ని స్థానిక కార్పొరేటర్‌ కబ్జాచేయడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని, ఇది గమనించి హైకోర్టును ఆశ్రయించామని, హైకోర్టు కూడా తమకు అనుకూలంగా స్టే ఆర్డర్‌ ఇచ్చిందని, ...

Read More »

ప్రజావాణిలో 44 పిర్యాదులు

  కామారెడ్డి, ఫిబ్రవరి 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జనహిత భవనంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి 44 ఫిర్యాదులు అందినట్టు కలెక్టరేట్‌ అధికారులు తెలిపారు. ఇందులో పంచాయతీరాజ్‌ 5, మునిసిపల్‌ 5, రెవెన్యూ 14, డిఆర్‌డిఎ 4, వ్యవసాయ శాఖ 4,. మత్స్యశాఖ 3 సంబంధించి ఫిర్యాదులు అందాయన్నారు. వాటిని పరిశీలించి వెంటనే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో సంయుక్త కలెక్టర్‌ సత్తయ్య, డిఆర్‌డిఎ పిడి చంద్రమోహన్‌రెడ్డి అధికారులు పాల్గొన్నారు.

Read More »

డయల్‌ యువర్‌ సిపిలో 12 పిర్యాదులు

  నిజామాబాద్‌ టౌన్‌, ఫిబ్రవరి 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ పోలీసు కమీషనర్‌ కార్తికేయ ప్రతి సోమవారం నిర్వహించే డయల్‌ యువర్‌ సిపి కార్యక్రమానికి 12 పిర్యాదులు అందాయి. బోధన్‌, ఆర్మూర్‌, నిజామాబాద్‌ డివిజన్‌ల నుంచి 12 ఫిర్యాదులు అందినట్టు కమీషనర్‌ తెలిపారు. ఇట్టి ఫిర్యాదులను ఆయా పోలీసు స్టేషన్‌ల అదికారులకు పంపి బాధితుల సమస్యలు పరిష్కరిస్తామని ఆయన పేర్కొన్నారు.

Read More »

రైతులను ఆర్థికంగా బలోపేతం చేయడమే ప్రభుత్వ లక్ష్యం

  కామారెడ్డి, ఫిబ్రవరి 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రైతులను ఆర్థికంగా బలోపేతం చేయడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. సోమవారం కామారెడ్డి మండలం అడ్లూర్‌ వ్యవసాయ మార్కెట్‌ కమిటీ గోడౌన్‌ను ప్రారంభించారు. అనంతరం మాచారెడ్డి మండలం ఆరేపల్లి గ్రామంలో 16 లక్షలతో నిర్మించిన గ్రామ పంచాయతీ భవనం, మహిళా సమాఖ్యభవనాన్ని ప్రారంభించారు. కోటి 80 లక్షలతో చేపట్టిన ఆరేపల్లి రోడ్డుపై హైలెవల్‌ వంతెనకు శంకుస్థాపన చేశారు. కోటి 50 లక్షలతో 2500 ...

Read More »