Breaking News

కార్పొరేటర్‌పై చర్యలు తీసుకోవాలి

 

నిజామాబాద్‌ టౌన్‌, ఫిబ్రవరి 5

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కార్పొరేటర్‌ షకీల్‌పై చర్యలు తీసుకొని తమ భూమి కబ్జానుంచి రక్షించాలని నిజామాబాద్‌ నగరానికి చెందిన ఏ.ఆనంద్‌కుమార్‌, అతని సోదరులు సోమవారం ప్రజావాణిలో కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. అనంతరం బాధితుడు ఆనంద్‌ మట్లాడుతూ తమకు మాలపల్లి ప్రాంతంలో వారసత్వంగా లభించిన భూమి (సర్వే నెంబరు 2481, 2482, 2484)ని స్థానిక కార్పొరేటర్‌ కబ్జాచేయడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని, ఇది గమనించి హైకోర్టును ఆశ్రయించామని, హైకోర్టు కూడా తమకు అనుకూలంగా స్టే ఆర్డర్‌ ఇచ్చిందని, హైకోర్టు ఆర్డర్‌లకు సంబందించిన బోర్డులను పెట్టి హద్దులు ఏర్పాటు చేశామని తెలిపారు. కానీ అట్టి బోర్డులను కార్పొరేటర్‌ షకీల్‌, అతని అనుచరులు ధ్వంసం చేసి తమను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. ఈ విషయంపై 1వ టౌన్‌ ఎస్‌హెచ్‌వోకు ఫిర్యాదు చేస్తే ఆయనకూడా కార్పొరేటర్‌కు అనుకూలంగా వ్యవహరిస్తు తమను బెదిరిస్తున్నారని ఆనంద్‌ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంపై గతంలో ప్రజావాణిలో జనవరి 8న, 22న, 29న తిరిగి సోమవారం ప్రజావాణిలో ఫిర్యాదు చేశామని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజావాణిలో ఫిర్యాదచేసిన ప్రతీసారి సంబంధిత అధికారులకు ఆదేశాలు వెళ్లినప్పటికి పోలీసుశాఖ గాని, మునిసిపల్‌ శాఖ గాని, రెవెన్యూ అధికారులుగాని స్పందించడం లేదని, వారి దగ్గరికి వెళ్ళి అడగగా నిర్లక్ష్యంగా సమాధానం చెబుతున్నారని, కార్పొరేటర్‌ దౌర్జన్యాలపై ఇప్పటికైనా జిల్లా యంత్రాంగం స్పందించి తగు చర్యలు తీసుకోవాలని, కోర్టు ధిక్కారానికి పాల్పడిన కార్పొరేటర్‌ను అరెస్టు చేసి తమకు న్యాయం చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. లేనియెడల తాము కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకుంటామని హెచ్చరించారు.

Check Also

ఆరోగ్య సేవలపై జాయింట్‌ డైరెక్టర్‌ సమీక్ష

కామారెడ్డి, మే 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జనహిత సమావేశ మందిరంలో శనివారం మాతా శిశు ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *