Breaking News

వృద్ధాశ్రమంలో దుస్తుల పంపిణీ

 

కామారెడ్డి, ఫిబ్రవరి 5

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్‌ జన్మదినాన్ని పురస్కరించుకొని తెరాస పార్టీ నాయకులు కామారెడ్డి శివారులోని వృద్దాశ్రమంలో వృద్దులకు దుస్తులు, పండ్లు పంపిణీ చేశారు. పంచముఖి హనుమాన్‌ ఆలయ కమిటీ ఛైర్మన్‌ గైని శ్రీనివాస్‌ గౌడ్‌, పార్టీ సీనియర్‌ నాయకులు జూకంటి ప్రభాకర్‌రెడ్డి ఆద్వర్యంలో వీటిని పంపిణీ చేశారు. పట్టణ తెరాస నాయకుడు సంగమేశ్వర్‌, మైనార్టీ నాయకులు షౌకత్‌ అలీ ఖాన్‌ ఆధ్వర్యంలో ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో రోగులకు అల్పాహారం పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎంపిపి లద్దూరి మంగమ్మ, నాయకులు బల్వంత్‌రావు, మామిండ్ల రమేశ్‌, జగదీశ్వర్‌, బాబాగౌడ్‌, రవిందర్‌ గుప్త, నరేశ్‌ రెడ్డి, సలీం, సమీర్‌ తదితరులు పాల్గొన్నారు.

Check Also

చిన్నమల్లారెడ్డిలో పోలీసుల కవాతు

కామారెడ్డి, మార్చ్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : స్థానిక, పార్లమెంటు ఎన్నికల దృష్ట్యా కామారెడ్డి మండలం చిన్నమల్లారెడ్డి ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *