Breaking News

భారీ మొత్తంలో క్లోరోహైడ్రేట్‌ స్వాధీనం

 

నిజామాబాద్‌ టౌన్‌, ఫిబ్రవరి 5

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లా పోచంపాడ్‌ ఎక్స్‌రోడ్డు వద్ద ఎక్సైజ్‌ ఎన్‌పోర్సుమెంట్‌ బృందం సోమవారం జరిపిన రూట్‌ వాచ్‌లో భారీ మొత్తంలో కల్తీకల్లుకు వినియోగించే 180 కిలోల క్లోరోహైడ్రేట్‌ను స్వాధీనం చేసుకున్నట్టు ఎక్సైజ్‌ డిప్యూటి కమీషనర్‌ డేవిడ్‌ రవికాంత్‌ తెలిపారు. సోమవారం ఎక్సైజ్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సుంకెట్‌కు చెందిన గంధం శ్రీనివాస్‌ గౌడ్‌ అలియాస్‌ సుంకెట్‌ శ్రీను తన ఇండికా వెస్తా కారులో క్లోరోహైడ్రేట్‌ తరలిస్తుండగా పోచంపాడ్‌ ఎక్స్‌రోడ్డువద్ద ఎక్సైజ్‌ ఎన్‌పోర్సు బృందం పట్టుకొని అతన్ని అరెస్టు చేశామని, అతనివద్ద నుంచి నాలుగు బ్యాగుల క్లోరోహైడ్రేట్‌ స్వాధీనం చేసుకున్నామని, దీని విలువ సుమారు 5 లక్షల వరకు ఉంటుందని వివరించారు. శ్రీనివాస్‌గౌడ్‌పై గతంలో నిర్మల్‌లో ఒకటి, నిజామాబాద్‌ జిల్లాలో ఐదు కేసులు నమోదైనట్టు తెలిపారు. నిందితుని పట్టుకోవడంలో కృషిచేసిన టాస్క్‌ఫోర్సు బృందం ఇన్స్‌పెక్టర్‌ జె.వెంకట్‌రెడ్డి, ఎస్‌ఐ సింధు, ఆర్మూర్‌ సిఐ రఘునాథ్‌రెడ్డి, సిబ్బందిని అమీద్‌, ఫయాజ్‌, రమణారావు, రాజేశ్‌, నరేశ్‌, సుమలత లను అభినందించారు.

Check Also

26 నుంచి కాంగ్రెస్‌ బస్సుయాత్ర

  నిజామాబాద్‌ టౌన్‌, ఫిబ్రవరి 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈనెల 26 నుంచి తెలంగాణ కాంగ్రెస్‌ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *