Breaking News

Daily Archives: February 11, 2018

కాంటిజెన్సి కార్మికులకు కనీస వేతనం ఇవ్వాలి

  కామారెడ్డి, ఫిబ్రవరి 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రభుత్వ పాఠశాలలో పనిచేయు స్వచ్చ కార్మికులకు, జూనియర్‌ డిగ్రీ కళాశాలలో పనిచేయు కాంటిజెన్సి కార్మికులకు కనీస వేతనాలు తెలంగాణ ప్రభుత్వం అందజేయాలని సిఐటియు జిల్లా కార్యదర్శి సిద్దిరాములు అన్నారు. ఆదివారం కామరెడ్డి జిల్లా కేంద్రంలోని ఆర్డీవో కార్యాలయంముందు సిఐటియు ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాల, జూనియర్‌, డిగ్రీ కళాశాలలో పనిచేసే స్వచ్చ కార్మికుల జనరల్‌ బాడీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ కార్మికులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కనీస వేతనం ...

Read More »

దీనదయాళ్‌ మార్గంలో కార్యకర్తలు నడుచుకోవాలి

  కామారెడ్డి, ఫిబ్రవరి 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పండిత దీనదయాళ్‌జి చూపిన మార్గంలో కార్యకర్తలు నడుచుకోవాలని భారతీయ జనతాపార్టీ తెలంగాణ రాష్ట్ర అభివృద్ది కమిటీ ఛైర్మన్‌ మురళీధర్‌గౌడ్‌ అన్నారు. ఆదివారం దీనదయాళ్‌జి బలిదాన దినం పురస్కరించుకొని బిజెపి కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలలువేసి నివాళులు అర్పించారు. దేశాభివృద్ది జరగాలంటే పాలకుడు నీతిమంతుడై ఉండి అభివృద్ది ఫలాలు అట్టడుగు ప్రజలకు అందినపుడే నిజమైన అభివృద్ది అన్నారు. క్రమశిక్షణతో జాతీయవాదం కోసం పనిచేయాలన్నారు. కార్యక్రమంలో మోతె కృష్ణాగౌడ్‌, రమేశ్‌, తేలు శ్రీనివాస్‌, భానుప్రసాద్‌, ...

Read More »

ఉద్యోగాల కోసం 12న ధర్నా

  కామారెడ్డి, ఫిబ్రవరి 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఏఐఎఫ్‌డివై యువజన సంఘం ఆద్వర్యంలో ప్రభుత్వం అనుసరిస్తున్న యువజన వ్యతిరేక విధానాన్ని సమర్థవంతంగా ఎదుర్కొని నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు, ఉద్యోగ హామీలు అమలు చేయాలని ఈనెల 12న జిల్లా కలెక్టర్‌ కార్యాలయం వద్ద నిరసన చేపడుతున్నట్టు ఏఐఎఫ్‌డివై జిల్లా నాయకులు రాజలింగం తెలిపారు. ఈ కార్యక్రమం విజయవంతం చేసేందుకు జిల్లాలోని నిరుద్యోగ యువత తరలిరావాలని పిలుపునిచ్చారు. గత ఎన్నికల ముందు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రబుత్వం ఇచ్చిన హామీ ఇంటికో ...

Read More »

క్రీడలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి

  నిజామాబాద్‌ టౌన్‌, ఫిబ్రవరి 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : క్రీడలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని, ప్రముఖ వైద్యులు మోతిలాల్‌ అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని గిరిరాజ్‌ కళాశాల ప్రాంగణంలో కబడ్డి ఫైనల్‌ మ్యాచ్‌ ప్రారంభించి అనంతరం ఆయన మాట్లాడారు. క్రీడల వల్ల శారీరక వ్యాయామం జరుగుతుందని, తద్వారా మానసిక ఉల్లాసం కూడా కలుగుతుందని, ఈరోజుల్లో విద్యార్థులు ఎల్లవేళలా ఫోన్లో ఆటలాడుతూ కనిపిస్తున్నారని, అదే ఆటలు బయట ఆడితే శారీరక దారుఢ్యం ఏర్పడుతుందని, ఇది ప్రతి ఒక్కరు గుర్తించి క్రీడల్ని ...

Read More »

రాష్ట్ర ద్వితీయ మహాసభల గోడప్రతుల ఆవిష్కరణ

  కామారెడ్డి, ఫిబ్రవరి 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ అంగన్‌వాడి టీచర్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ సిఐటియు రాష్ట్ర ద్వితీయ మహాసభల గోడప్రతులను ఆదివారం సిఐటియు కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి సిద్దిరాములు మాట్లాడుతూ ఈనెల 18,19 తేదీల్లో అంగన్‌వాడి టీచర్స్‌ హెల్పర్స్‌ యూనియన్‌ సిఐటియు రాష్ట్ర ద్వితీయ మహాసభలని నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలో నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఈ సభలకి జిల్లాలోని 22 మండలాల్లోని అంగన్‌వాడిలు, ఆయాలు, మినీ అంగన్‌వాడిలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం ...

Read More »

రైతుల శ్రేయస్సుకు మరిన్ని చట్టాలు తేవాలి

  నిజామాబాద్‌ టౌన్‌, ఫిబ్రవరి 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రైతుల శ్రేయస్సుకు పార్లమెంటులో మరిన్ని చట్టాలు తేవాలని ఏఐకెఎంఎస్‌ రాష్ట్ర నాయకులు వేల్పూర్‌ భూమయ్య అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని ఎన్‌ఆర్‌ భవన్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. పసుపు రైతులకు, ఎర్రజొన్న రైతులకు, ఇతర రైతులకు పంటలను లాభసాటి ధరలకు విక్రయించే విదంగా పార్లమెంటులో చట్టం తేవాలని డిమాండ్‌ చేశారు. కేంద్ర ప్రభుత్వం రైతులను పట్టించుకోకుండా నిర్లక్ష్యం వహిస్తుందని, పసుపును మార్కెట్లోకి తీసుకొస్తే వ్యాపారస్తులు సిండికేట్‌గా మారి ...

Read More »

అనంత్‌రెడ్డి కుటుంబానికి ఎమ్మెల్యే పరామర్శ

  నిజామాబాద్‌ టౌన్‌, ఫిబ్రవరి 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జక్రాన్‌పల్లి మాజీ ఎంపిపి అనంత్‌రెడ్డి కుటుంబాన్ని ఆదివారం రూరల్‌ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్‌ పరామర్శించారు. పక్షంరోజుల క్రితం ఎంపిపి తల్లి స్వర్గస్తులైన విషయం తెలిసిందే. అనంత్‌రెడ్డి కుటుంబీకులను పరామర్శించి ఎమ్మెల్యే ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. ఆయన వెంట అప్పాల రాజన్న, ఎంపిపి తనూజ శ్రీనివాస్‌రెడ్డి, జడ్పిటిసి భోజన్న, ఆయా గ్రామాల సర్పంచ్‌లు, ఎంపిటిసిలు, తెరాస కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు.

Read More »

అంగన్‌వాడి 2వ రాష్ట్ర మహాసభలు జయప్రదం చేయండి

  నిజామాబాద్‌ టౌన్‌, ఫిబ్రవరి 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈనెల 18,19 తేదీల్లో నిజామాబాద్‌లో జరగనున్న అంగన్‌వాడి 2వ రాష్ట్ర మహాసభలు జయప్రదం చేయాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి రమేశ్‌బాబు అన్నారు. కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్రంలోని 31 జిల్లాల ప్రతినిదులు హాజరవుతున్నారని, అఖిలభారతీయ నాయకులతోపాటు ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడు, కర్ణాటకు చెందిన నాయకులు పాల్గొంటారని పేర్కొన్నారు. మహాసభల్లో గత రెండు సంవత్సరాలుగా చేసిన పోరాటాలు, భవిష్యత్‌లో ఉద్యోగ భద్రత, కేంద్ర ప్రభుత్వ వేతనాల పెంపు, రిటైర్‌మెంట్‌ బెనిఫిట్‌, మినీ అంగన్‌వాడిల ...

Read More »

సోమవారం డయల్‌ యువర్‌ సిపి

  నిజామాబాద్‌ టౌన్‌, ఫిబ్రవరి 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ పోలీసు కమీషనర్‌ కార్తికేయ ప్రతి సోమవారం డయల్‌ యువర్‌ సిపి కార్యక్రమం యధావిధంగా కొనసాగుతుందని కమీషన్‌ ఒక ప్రకటనలో తెలిపారు. నిజామాబాద్‌ కమీషనరేట్‌ పరిధిలో ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని, బాధితులు 08462-228433 నెంబరుకు ఫోన్‌ చేసి తమ సమస్యలు విన్నవించుకోవాలని కోరారు. ఫోన్‌ చేసే సమయంలో ఎలాంటి శబ్దం లేకుండా చూసుకోవాలని, ఇతరులకు కూడా అవకాశం కల్పించేలా సమయ పాలన పాటించాలని ఆయన సూచించారు. సమస్యలపై దృష్టి ...

Read More »

విద్యార్థులకు సామాజిక బాధ్యతపై అవగాహన ఉండాలి

  నిజామాబాద్‌ టౌన్‌, ఫిబ్రవరి 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : విద్యార్థులకు సామాజిక బాధ్యతపై అవగాహన ఉండాలని హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్‌ చంద్రకుమార్‌ అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని శ్రావ్యగార్డెన్స్‌లో నేను సైతం స్వచ్చంద సంస్థ ఆధ్వర్యంలో జరిగిన బాలోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హజరై మాట్లాడారు. విద్యార్థులకు సామాజిక బాధ్యత ఉండాలని, నేటి ఆధునిక యుగంలో శారీరక శ్రమ తగ్గి, దాని ప్రభావం మూలంగా మానసిక ఒత్తిడికి గురవుతున్నారని, పిల్లలు ఎంతసేపు చదువు, ఇతర దైనందిన కార్యక్రమాలకు ...

Read More »

విశ్వబ్రాహ్మణ వివాహ పరిచయ వేదిక

  నిజామాబాద్‌ టౌన్‌, ఫిబ్రవరి 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నగర శివారులోని నాగారంలో ఆదివారం విశ్వకర్మ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో విశ్వబ్రాహ్మణ వివాహ పరిచయ వేదిక జరిగింది. ఈ సందర్భంగా నిజామాబాద్‌, నిర్మల్‌, కామారెడ్డి జిల్లాలకు చెందిన వధూ వరులు పరిచయ కార్యక్రమం నిర్వహించారు. నిజామాబాద్‌ జిల్లా కన్వీనర్‌ దశరథం మాట్లాడుతూ విశ్వకర్మ ఫౌండేషన్‌ ద్వారా విశ్వకర్మ కులస్తులకు వివిధ కార్యక్రమాల్లో చేయూత నందిస్తున్నామని, పేద విశ్వబ్రాహ్మణ విద్యార్థులను గుర్తించి ఆర్థికసాయం అందజేస్తున్నామని, ఇలాంటి పరిచయ వేదికల ద్వారా విశ్వబంధు గణం ...

Read More »