Breaking News

కాంటిజెన్సి కార్మికులకు కనీస వేతనం ఇవ్వాలి

 

కామారెడ్డి, ఫిబ్రవరి 11

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రభుత్వ పాఠశాలలో పనిచేయు స్వచ్చ కార్మికులకు, జూనియర్‌ డిగ్రీ కళాశాలలో పనిచేయు కాంటిజెన్సి కార్మికులకు కనీస వేతనాలు తెలంగాణ ప్రభుత్వం అందజేయాలని సిఐటియు జిల్లా కార్యదర్శి సిద్దిరాములు అన్నారు. ఆదివారం కామరెడ్డి జిల్లా కేంద్రంలోని ఆర్డీవో కార్యాలయంముందు సిఐటియు ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాల, జూనియర్‌, డిగ్రీ కళాశాలలో పనిచేసే స్వచ్చ కార్మికుల జనరల్‌ బాడీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ కార్మికులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కనీస వేతనం 18 వేల రూపాయలు ఇవ్వాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని కార్మికులకి పిఎఫ్‌, ఈఎస్‌ఐ సౌకర్యం కల్పించాలని డిమాండ్‌ చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక చట్టాలను కాలరాస్తున్నాయన్నారు. కార్మికులకు సమాన పనికి సమాన వేతనం అందజేయాలని డిమాండ్‌ చేశారు. మార్చిలో జరిగే బడ్జెట్‌ సమావేశంలో కార్మికులకు తగిన బడ్జెట్‌ కేటాయించాలని, కనీస వేతనం పెంచాలన్నారు. కార్మికుల సమస్యల పరిష్కారానికై 18 ఫిబ్రవరిన హైదరాబాద్‌లోని సిఐటియు కార్యాలయంలో రాష్ట్ర జనరల్‌ బాడీ సమావేశం ఉంటుందని కార్మికులకు సూచించారు. కార్యక్రమంలో యూనియన్‌ నాయకులు లక్ష్మినారాయణ, రవి, అశోక్‌, సంధ్య, హన్మాండ్లు, నారాయణ, అర్జున్‌, సంజీవ్‌, సాయిలు తదితరులు పాల్గొన్నారు.

Check Also

26 నుంచి కాంగ్రెస్‌ బస్సుయాత్ర

  నిజామాబాద్‌ టౌన్‌, ఫిబ్రవరి 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈనెల 26 నుంచి తెలంగాణ కాంగ్రెస్‌ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *