Breaking News

ఏఐఎఫ్‌డివై ఆధ్వర్యంలో కలెక్టరేట్‌ ఎదుట ధర్నా

 

కామారెడ్డి, ఫిబ్రవరి 12

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఏఐఎఫ్‌డివై ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్‌ కార్యాలయం ఎదుట సోమవారం ధర్నా చేపట్టారు. ప్రభుత్వం అనుసరిస్తున్న యువజన వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ధర్నా చేపట్టినట్టు సంఘం జిల్లా అధ్యక్షుడు రాజు, నాయకుడు రాజలింగం తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఇంటికో హామీ ఉద్యోగం ఏమైందని ప్రశ్నించారు. రాష్ట్రంలోని తెరాస, కేంద్రంలోని బిజెపి సర్కారు సంవత్సరంలో రెండుకోట్ల ఉద్యోగాల ప్రకటనలు ఇచ్చి ఇప్పటివరకు కేంద్రంలో, రాష్ట్రంలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారని ప్రశ్నించారు. ఉద్యోగ నోటిఫికేషన్‌లు సైతం లేవని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ హామీలను అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. అనంతరం జేసికి వినతి పత్రం సమర్పించారు. కార్యక్రమంలో నాయకులు రమేశ్‌, తిరుపతి, లింగం, రాజు, రవి, తదితరులు పాల్గొన్నారు.

Check Also

26 నుంచి కాంగ్రెస్‌ బస్సుయాత్ర

  నిజామాబాద్‌ టౌన్‌, ఫిబ్రవరి 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈనెల 26 నుంచి తెలంగాణ కాంగ్రెస్‌ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *