Breaking News

అక్రమ నిర్మాణాలు చేపడుతున్న కార్పొరేటర్‌పై చర్యలు తీసుకోవాలి

 

నిజామాబాద్‌ టౌన్‌, ఫిబ్రవరి 12

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నగరంలోని అర్సపల్లి ప్రాంతంలో తమ భూమిని ఆక్రమించుకొని అక్రమంగా నిర్మాణాలు చేపడుతున్న కార్పొరేటర్‌ షకీల్‌పై చర్యలు తీసుకొని అట్టి అక్రమ నిర్మాణాలను వెంటనే ఆపివేయాలని బాధితుడు ఏ.ఆనంద్‌కుమార్‌ డిమాండ్‌ చేశారు. సోమవారం బాధితుడు కుటుంబీకులతో కలిసి ప్రజావాణికి వచ్చి కలెక్టర్‌కు పిర్యాదు చేసిన అనంతరం విలేకరులతో మాట్లాడారు. అంశంపై తాము పలుమార్లు ప్రజావాణిలో ఫిర్యాదు చేస్తున్నామని, ప్రజావాణి నుంచి సంబందిత అధికారులకు ఆదేశాలు జారీఅయ్యాయని, ఈ అంశంపై స్పందించిన మునిసిపల్‌ కమీషనర్‌ అక్రమ నిర్మాణం చేపడుతున్న కట్టడాలను 24 గంటల్లో తొలగించాలని ఆదేశించినప్పటికి కార్పొరేటర్‌ షకీల్‌ అహ్మద్‌ మాత్రం నాయకుల అండతో అక్కడికి వెళ్ళినవారిని భయభ్రాంతులకు గురిచేస్తు వెనక్కి పంపుతున్నారని ఆరోపించారు. కార్పొరేటర్‌ షకీల్‌ ఆగడాలను ఇప్పటికైనా అరికట్టాలని, తమకు వారసత్వంగా లభించిన భూమిలో హక్కు ఉందని, తమ కుటుంబం తీవ్ర ఆవేదనకు గురవుతున్నారని, షకీల్‌ బెదిరింపులు మరింత ఎక్కువయ్యాయని, తమకు ప్రాణహాని ఉందని ఆయన తెలిపారు. ఇప్పటికైనా జిల్లా అధికారులు స్పందించి తమను తమ భూమిని కాపాడాలని ఆయన కోరారు.

Check Also

26 నుంచి కాంగ్రెస్‌ బస్సుయాత్ర

  నిజామాబాద్‌ టౌన్‌, ఫిబ్రవరి 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈనెల 26 నుంచి తెలంగాణ కాంగ్రెస్‌ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *