Breaking News

కుష్టువ్యాధి రహిత సమాజాన్ని నిర్మిద్దాం

 

– లయన్స్‌ క్లబ్‌ ఆధ్వర్యంలో దుప్పట్ల పంపిణీ

గాంధారి, ఫిబ్రవరి 12

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కుష్టువ్యాధి రహిత సమాజాన్ని నిర్మిద్దామని గాంధీజి కలలు సాకారం చేద్దామని గాంధారి జడ్పిటిసి తానాజీరావు అన్నారు. సోమవారం మండలంలోని వండ్రికల్‌ లెప్రసీ క్యాంప్‌లో లయన్స్‌ క్లబ్‌ కామారెడ్డి ఆధ్వర్యంలో స్పర్శ కుష్టు వ్యాధి నిర్మూలనా దినోత్సవాన్ని నిర్వహించారు. కుష్టు వ్యాధి నిర్మూలనపై గ్రామస్తులకు అవగాహన కల్పించారు. లయన్స్‌ క్లబ్‌ కామారెడ్డి అధ్యక్షుడు వాసవి రమేశ్‌ అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమానికి జడ్పిటిసి తానాజీరావు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. గాంధీజి వర్ధంతిని పురస్కరించుకొని జనవరి 31 నుంచి ఫిబ్రవరి 13 వరకు దేశ వ్యాప్తంగా కుష్టు వ్యాధి నిర్మూలనా వారోత్సవాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. కార్యక్రమాన్ని లయన్స్‌ క్లబ్‌ ఆధ్వర్యంలో నిర్వహించడం పట్ల అభినందించారు. లయన్స్‌ క్లబ్‌ తరఫున చాలా సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారన్నారు.

ఇదేవిధంగా గాంధారి మండలంలో చాలా తాండాల్లో పాఠశాలల్లో విద్యార్థులకు మౌలిక సదుపాయాలు కల్పించాలని క్లబ్‌ సభ్యులను కోరారు. లెప్రసీ క్యాంప్‌లోని 21 మందికి శీతాకాలం సందర్బంగా దుప్పట్లు పంపిణీ చేశారు. లయన్స్‌ క్లబ్‌ ప్రతినిధులు రమేశ్‌, సతీష్‌గౌడ్‌లు మాట్లాడుతూ గాంధారి మండలంలోని తాండాలో పాఠశాలకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు తమవంతు సహకారం అందిస్తామన్నారు. అనంతరం క్యాంప్‌లో ఉచిత కంటి పరీక్షలు నిర్వహించారు. అవసరమైన వారికి మందులు అందించారు. కంటి ఆపరేషన్‌ అవసరమైన వారికి కామారెడ్డికి తరలించి చికిత్స చేసేవిధంగా చూస్తామని లయన్స్‌ క్లబ్‌ సభ్యులు తెలిపారు. క్యాంప్‌ సభ్యులకు పండ్లను పంపిణీ చేశారు. కార్యక్రమంలో లయన్స్‌ క్లబ్‌ ప్రతినిదులు ప్రవీణ్‌, జయప్రకాశ్‌, లింబాద్రి, కాంశెట్టి, లక్ష్మినారాయణ, సర్పంచ్‌ ప్రహ్లాద, తదితరులు ఉన్నారు.

Check Also

26 నుంచి కాంగ్రెస్‌ బస్సుయాత్ర

  నిజామాబాద్‌ టౌన్‌, ఫిబ్రవరి 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈనెల 26 నుంచి తెలంగాణ కాంగ్రెస్‌ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *