Breaking News

పోతంగల్‌ గురుకుల పాఠశాల సమస్యలు పరిష్కరించాలి

 

నిజామాబాద్‌ టౌన్‌, ఫిబ్రవరి 12

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నవీపేట మండలం పోతంగల్‌ గురుకుల పాఠశాలలో అపరిష్కృతంగా ఉన్న సమస్యలు పరిష్కరించాలని పేరెంట్స్‌ కమిటీ ప్రతినిది సుధాకర్‌ డిమాండ్‌ చేశారు. సోమవారం ప్రజావాణిలో ఈ అంశంపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేసి అనంతరం విలేకరులతో మాట్లాడారు. గురుకుల పాఠశాలలో మౌలిక వసతులు లేక విద్యార్థులు అనేక ఇబ్బందులకు గురవుతున్నారని, ఈ విషయంపై సంబంధిత అధికారులకు ఎన్నిసార్లు తెలిపినా ఎటువంటి స్పందన లేదని ఆయన ఆరోపించారు. నిత్యకృత్యాలు తీర్చుకునేందుకు ఎన్నో అవాంతరాలు ఏర్పడుతున్నాయని, దీనికితోడు మూత్రశాలలు ఇతర ప్రాంతాల్లో మురికి నీరు నిలువ ఉండడంతో దోమల బెడద ఎక్కువై విద్యార్థులు రోగాల బారిన పడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు కల్పించుకొని పాఠశాలలోని సమస్యలను పరిష్కరించాలని ఆయన కోరారు.

Check Also

26 నుంచి కాంగ్రెస్‌ బస్సుయాత్ర

  నిజామాబాద్‌ టౌన్‌, ఫిబ్రవరి 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈనెల 26 నుంచి తెలంగాణ కాంగ్రెస్‌ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *