Breaking News

15న సేవాలాల్‌ జయంతి

 

నిజామాబాద్‌ టౌన్‌, ఫిబ్రవరి 12

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈనెల 15వ తేదీన సేవాలాల్‌ జయంతిని ఘనంగా నిర్వహిస్తున్నట్టు అఖిలభారతీయ బంజారా సేవా సంఘ్‌ రాష్ట్ర సలహాదారులు, జాతీయ బంజారా డాక్టర్స్‌ అసోసియేషన్‌ ప్రదాన కార్యదర్శి డాక్టర్‌ మోతిలాల్‌ ఒక ప్రకటనలో తెలిపారు. 279వ జయంతిని పురస్కరించుకొని భోగ్‌ భండార్‌ నిర్వహించుకొని భగవంతుని కృపకు పాత్రులు కావాలని ఆయన తెలిపారు. బంజారాల ఆరాధ్య దైవం సేవాలాల్‌ మహారాజ్‌ అని, అతను చూపించిన సన్మార్గంలో బంజారాలు నడుచుకొని ప్రజలందరికి ఆదర్శప్రాయం కావాలని ఆయన ఆకాంక్షించారు. అదేవిధంగా సేవాలాల్‌ జయంతి సందర్భంగా నిర్వహించిన క్రికెట్‌, కబడ్డి విజేతలకు శశాంక్‌ ట్రస్టు ఆధ్వర్యంలో బహుమతి ప్రదానం ఉంటుందని ఆయన పేర్కొన్నారు.

Check Also

26 నుంచి కాంగ్రెస్‌ బస్సుయాత్ర

  నిజామాబాద్‌ టౌన్‌, ఫిబ్రవరి 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈనెల 26 నుంచి తెలంగాణ కాంగ్రెస్‌ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *