Breaking News

భక్తుల సౌకర్యాలపై ప్రత్యేక శ్రద్ద వహించాలి

 

కామారెడ్డి, ఫిబ్రవరి 12

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈనెల 21 నుంచి 25 వరకు బీర్కూర్‌ మండలం తిమ్మాపూర్‌లోని శ్రీవెంకటేశ్వర స్వామి బ్రహ్మూెత్సవాల సందర్భంగా భక్తుల సౌకర్యాలపై ప్రత్యేక శ్రద్ద తీసుకోవాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. ఆయన సోమవారం తెలంగాణ తిరుమల ఆలయాన్ని సందర్శించారు. ఆలయ కమిటీ సభ్యులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని, కొండమీదకు బస్సు సౌకర్యంతోపాటు బాన్సువాడ, బీర్కూర్‌ల నుంచి ప్రత్యేక బస్సులు నడపాలన్నారు. ఆలయ విస్తరణ పనులు ముమ్మరంగా జరుగుతున్నందున వచ్చే భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేయాలన్నారు. తాగునీరు, పారిశుద్యంపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని భక్తుల రద్దీకనుగునంగా ఉచిత భోజనంతోపాటు సరిపడా ప్రసాదాలు నిలువ చేసుకోవాలని సూచించారు.

Check Also

26 నుంచి కాంగ్రెస్‌ బస్సుయాత్ర

  నిజామాబాద్‌ టౌన్‌, ఫిబ్రవరి 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈనెల 26 నుంచి తెలంగాణ కాంగ్రెస్‌ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *