Breaking News

Daily Archives: February 17, 2018

నవోదయలో ఆధునిక వసతులు కల్పించాలి

  కామారెడ్డి, ఫిబ్రవరి 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజాంసాగర్‌ జవహార్‌ నవోదయ ప్రాంగణంలో విద్యార్థులకు ఆధునిక వసతులు కల్పించాలని జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ యాజమాన్యానికి సూచించారు. శనివారం నవోదయ విద్యాకమిటీ సమావేశం నిర్వహించారు. విద్యాలయంలో తాగునీటికోసం మిషన్‌ భగీరథ ద్వారా నీరందించాలని ఆర్‌డబ్ల్యుఎస్‌ ఇఇ వెంకటేశ్వర్‌కు సూచించారు. విద్యాలయంలో సోలార్‌ ఏర్పాటు చేయాలన్నారు. విద్యుత్‌ దీపాలకు చర్యలు తీసుకోవాలని, ఉపాద్యాయుల కొరత లేకుండా చూడాలని, స్థానిక నోటిఫికేషన్‌ ద్వారా పోస్టులు భర్తీచేయాలని ప్రిన్సిపల్‌ శేఖర్‌బాబుకు సూచించారు. బ్రాహ్మణపల్లిలో శిథిలావస్థలో ఉన్న ...

Read More »

సిఎం జన్మదినం సందర్భంగా రక్తదానం

  కామారెడ్డి, ఫిబ్రవరి 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్‌ జన్మదినాన్ని పురస్కరించుకొని కామారెడ్డిలో శనివారం మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే గంప గోవర్ధన్‌తోపాటు పలువురు రక్తదానం చేశారు. ముఖ్యమంత్రి ఆయురారోగ్యాలతో క్షేమంగా ఉండాలని, ప్రజల కోసం ఆయన ఇలాగే సంక్షేమ కార్యక్రమాలు కొనసాగించాలని కోరారు. అనంతరం కేక్‌కట్‌ చేసి సంబరాలు జరుపుకున్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే గంప గోవర్ధన్‌, మునిసిపల్‌ ఛైర్మన్‌ పిప్పిరి సుష్మ, ఎంపిపి లద్దూరి మంగమ్మ, మార్కెట్‌ కమిటీ ఛైర్మన్‌ ...

Read More »

మనోరమ ఆసుపత్రిలో అరుదైన శస్త్రచికిత్స

  నిజామాబాద్‌ టౌన్‌, ఫిబ్రవరి 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కిడ్నీ, అధిక రక్తపోటుతో బాదపడుతున్న హైరిస్కు పేషెంట్‌కు నగరంలోని మనోరమ ఆసుపత్రిలో అరుదైన శస్త్రచికిత్స నిర్వహించి విజయం సాధించినట్టు ప్రముఖ వైద్యులు వెంకటకృష్ణ తెలిపారు. శనివారం ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. శస్త్ర చికిత్సకు సంబంధించిన వివరాలు వెల్లడిస్తు ఆర్మూర్‌ డివిజన్‌ పరిధిలో పెర్కిట్‌ గ్రామానికి చెందిన 90 సంవత్సరాల వెంకట్‌గౌడ్‌ గత వారంరోజులుగా మూత్రంలో రక్తం పడడం, రెండు కిడ్నీలు చెడిపోయి అధిక రక్తపోటుతో ...

Read More »

ఉదృతమవుతున్న ఎర్రజొన్న రైతుల ఆందోళన

  నిజామాబాద్‌ టౌన్‌, ఫిబ్రవరి 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎర్రజొన్న, పసుపు పంటకు గిట్టుబాటు ధర కల్పించి ప్రభుత్వమే కొనుగోలు చేయాలని చేపట్టిన ఆందోళన మరింత ఉదృతరూపం దాల్చింది. పోలీసు ఆంక్షలను ఖాతరు చేయకుండా రైతులు నిరసనలు కొనసాగిస్తున్నారు. ప్రభుత్వం ప్రకటించిన ఎర్రజొన్న క్వింటాలుకు రూ. 2300 మద్దతు ధరపై రైతులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కనీసం 4500 రూపాయలు చెల్లించాలని అంతవరకు ఆందోళన కొనసాగిస్తామని జేఏసి నాయకులు పేర్కొన్నారు. ఆందోళనలో భాగంగా శనివారం జక్రాన్‌పల్లి తహసీల్‌ కార్యాలయం ఎదుట ...

Read More »

విద్యార్థుల ఉపకార వేతనాలు వెంటనే మంజూరు చేయాలి

  కామారెడ్డి, ఫిబ్రవరి 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లాలోఇని బిసి, ఎస్‌సి, ఎస్‌టి, మైనార్టీ విద్యార్థులకు సంబంధించిన ఉపకార వేతనాలు వెంటనే మంజూరు చేసి నివేదిక సమర్పించాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ ఆదేశించారు. శనివారం కలెక్టరేట్‌ చాంబరులో జిల్లా కళాశాలల అభివృద్ది కమిటీ సమావేశం నిర్వహించారు. కళాశాలల వారిగా విద్యార్థుల దరఖాస్తులను వివిధ శాఖలకు పంపి ట్రెజరీ ద్వారా ఉపకార వేతనాలు మంజూరు చేసేలా చర్యలు తీసుకోవాలని ప్రిన్సిపాళ్ళకు సూచించారు. రామారెడ్డి మండలం ప్రభుత్వ జూనియర్‌ కళాశాలకు చెందిన ...

Read More »

ఇంటర్‌ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి

  కామారెడ్డి, ఫిబ్రవరి 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఫిబ్రవరి 28 నుంచి మొదలయ్యే ఇంటర్‌ ప్రథమ, ద్వితీయ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించేలా సంబందిత అధికారులు చర్యలు తీసుకోవాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ ఆదేశించారు. ఇంటర్‌ పరీక్షల సన్నాహక చర్యలపై శనివారం అధికారులతో ఆయన సమీక్షించారు. విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా బస్సు సౌకర్యం, నిరంతర విద్యుత్తు, వైద్యసిబ్బందిని అందుబాటులో ఉంచాలన్నారు. పరీక్షల సమయంలో 144 సెక్షన్‌ అమలు చేయాలని చెప్పారు.జిరాక్సు మిషన్లను మూసి ఉంచాలని కోరారు. విద్యార్థులు పరీక్ష ...

Read More »

కొత్త గ్రామ పంచాయతీల ఏర్పాటుకు ప్రతిపాదనలు

  నిజామాబాద్‌ టౌన్‌, ఫిబ్రవరి 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లాలో కొత్తగా ఏర్పాటు చేయనున్న 151 గ్రామ పంచాయతీల వివరాలను జిల్లా యంత్రాంగం రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. త్వరలో 151 గ్రామ పంచాయతీలు కొత్తగా ఏర్పడనున్నాయి. వీటిలో 74 తాండాలు కూడా గ్రామ పంచాయతీలుగా మారనున్నాయి. 500 జనాభాగల గ్రామాలను గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు పంపారు. ఈ గ్రామ పంచాయతీలు ఏర్పడితే ప్రజలకు మరిన్ని సేవలు అందించిన వారవుతామని అధికారులు పేర్కొన్నారు. కొత్త గ్రామ ...

Read More »

బాల నేరస్తుల భవిష్యత్తు మనందరి బాధ్యత

  నిజామాబాద్‌ టౌన్‌, ఫిబ్రవరి 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాల నేరస్తుల భవిష్యత్తు మన అందరి బాధ్యత అని నిజామాబాద్‌ అదనపు డిసిపి (అడ్మిన్‌) రాంరెడ్డి అన్నారు. శనివారం పోలీసు కమీషనర్‌ కార్యాలయంలో జరిగిన బాల నేరస్తుల చట్టం 2015 నూతన విధి విధానాలపై అవగాహన కార్యక్రమం జరిగింది. ఈకార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై రాంరెడ్డి మాట్లాడారు. నేరాలకు సంబందించి బాల నేరస్తులు పట్టుబడినపుడు వారితో సున్నితంగా వ్యవహరించాలని, పిల్లలకు మానసిక పరిపక్వత ఉండదని, వారిపట్ల జాగ్రత్తగా వ్యవహరించి బంగారు ...

Read More »

ఘనంగా బాజిరెడ్డి గోవర్ధన్‌ జన్మదిన వేడుకలు

  నిజామాబాద్‌ టౌన్‌, ఫిబ్రవరి 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ రూరల్‌ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్‌ జన్మదిన వేడుకలు శనివారం ఘనంగా జరిగాయి. నియోజకవర్గానికి చెందిన తెరాస నాయకులు, అభిమానులు పెద్ద సంఖ్యలో ఎమ్మెల్యే ఇంటికి చేరుకొని శుభాకాంక్షలు తెలిపారు. ఎమ్మెల్సీ వి.జి.గౌడ్‌ కూడా ఎమ్మెల్యేను కలిశారు. అనంతరం రూరల్‌ నాయకులు రక్తదానం చేశారు. వివిధ పాఠశాలల విద్యార్థులకు మిఠాయిలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బాజిరెడ్డి మాట్లాడుతూ తన పుట్టినరోజు, సిఎం కెసిఆర్‌ పుట్టినరోజు ఒకేరోజు రావడం ...

Read More »

ముఖ్యమంత్రి పాలన దేశానికే దిక్సూచి

  – తెరాస జిల్లా అధ్యక్షుడు ఈగ గంగారెడ్డి నిజామాబాద్‌ టౌన్‌, ఫిబ్రవరి 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ముఖ్యమంత్రి కెసిఆర్‌ పాలన దేశానికే దిక్సూచి అని తెరాస జిల్లాఅధ్యక్షుడు ఈగ గంగారెడ్డి అన్నారు. శనివారం ముఖ్యమంత్రి కెసిఆర్‌ జన్మదినం సందర్భంగా స్థానిక ఆదర్శ హిందీ మహా విద్యాలయంలో కేక్‌కట్‌ చేసి వేడుకలు ప్రారంభించారు. అనంతరం గంగారెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి కెసిఆర్‌ పాలన దేశానికే దిక్సూచి లాంటిదని, ఆయన పాలన చూసి ఇతర ముఖ్యమంత్రులు కూడా అనుసరిస్తున్నారని, దేశంలో ఏ రాష్ట్రంలో ...

Read More »

ఉద్యోగాలు క్రమబద్దీకరించాలి

  నిజామాబాద్‌ టౌన్‌, ఫిబ్రవరి 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తమ ఉద్యోగాలు క్రమబద్దీకరించాలని డిమాండ్‌ చేస్తు వైద్య ఆరోగ్య శాఖలో పనిచేస్తున్న కాంట్రాక్టు సిబ్బంది శనివారం జిల్లా కేంద్రంలోగల డిఎం అండ్‌ హెచ్‌వో కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పబ్లిక్‌ హెల్త్‌ అండ్‌ మెడికల్‌ ఎంప్లాయిస్‌ యూనియన్‌ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు నటరాజన్‌ మాట్లాడుతూ వైద్య ఆరోగ్య శాఖలో గత 15 సంవత్సరాలుగా పనిచేస్తున్న పారా మెడికల్‌ సిబ్బంది, హెల్త్‌ అసిస్టెంట్లు, ల్యాబ్‌ టెక్నిషియన్లను, ఫార్మసిస్టులను, స్టాప్‌ ...

Read More »

ఆదివారం మేరు వివాహ పరిచయ వేదిక

  నిజామాబాద్‌ టౌన్‌, ఫిబ్రవరి 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆదివారం జిల్లా కేంద్రంలోని మేరు భవనంలో మేరు కులస్తుల వివాహ పరిచయ వేదిక నిర్వహిస్తున్నట్టు జిల్లా మేరు సంఘం అధ్యక్షుడు పోల్కం గంగాకిషన్‌ ఒక ప్రకటనలో తెలిపారు. నిజామాబాద్‌ జిల్లాతోపాటు కామారెడ్డి, నిర్మల్‌, మెదక్‌, కరీంనగర్‌, నాందేడ్‌ జిల్లాల నుంచి ఔత్సాహిక వధూవరులు వారి కుటుంబ సభ్యులు పాల్గొంటున్నారని, ఈ వేదికను మేరు కులస్తులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.

Read More »

ఘనంగా ముఖ్యమంత్రి కెసిఆర్‌ జన్మదిన వేడుకలు

  నిజామాబాద్‌ టౌన్‌, ఫిబ్రవరి 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్‌ జన్మదిన వేడుకలు జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. అధికార పార్టీకి చెందిన నాయకులు నిజామాబాద్‌ జిల్లా కేంద్రంతోపాటు బోధన్‌, ఆర్మూర్‌ పట్టణాల్లో వేడుకలు ఘనంగా నిర్వహించారు. పలు పాఠశాలల్లో విద్యార్థులకు మిఠాయిలు పంపిణీ చేశారు. జిల్లా కేంద్రంలో నగర మేయర్‌ ఆకుల సుజాత ఆధ్వర్యంలో స్నేహ సొసైటీలో సిఎం జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ముఖ్యమంత్రి కెసిఆర్‌ వల్లే తెలంగాణ ...

Read More »