Breaking News

సిఎం జన్మదినం సందర్భంగా రక్తదానం

 

కామారెడ్డి, ఫిబ్రవరి 17

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్‌ జన్మదినాన్ని పురస్కరించుకొని కామారెడ్డిలో శనివారం మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే గంప గోవర్ధన్‌తోపాటు పలువురు రక్తదానం చేశారు. ముఖ్యమంత్రి ఆయురారోగ్యాలతో క్షేమంగా ఉండాలని, ప్రజల కోసం ఆయన ఇలాగే సంక్షేమ కార్యక్రమాలు కొనసాగించాలని కోరారు. అనంతరం కేక్‌కట్‌ చేసి సంబరాలు జరుపుకున్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే గంప గోవర్ధన్‌, మునిసిపల్‌ ఛైర్మన్‌ పిప్పిరి సుష్మ, ఎంపిపి లద్దూరి మంగమ్మ, మార్కెట్‌ కమిటీ ఛైర్మన్‌ పద్మ, వైస్‌ ఛైర్మన్‌ గౌరి శంకర్‌, మునిసిపల్‌ వైస్‌ఛైర్మన్‌ మసూద్‌ అలీ, నాయకులు రాజేశ్వర్‌, గోపీగౌడ్‌, తదితరులు పాల్గొన్నారు.

Check Also

మునిసిపల్‌ ఎన్నికలు సజావుగా నిర్వహించాలి

కామారెడ్డి, జూలై 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్ర ప్రభుత్వం రూపొందిస్తున్న మునిసిపల్‌ చట్టం 2019 ని ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *