Breaking News

మనోరమ ఆసుపత్రిలో అరుదైన శస్త్రచికిత్స

 

నిజామాబాద్‌ టౌన్‌, ఫిబ్రవరి 17

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కిడ్నీ, అధిక రక్తపోటుతో బాదపడుతున్న హైరిస్కు పేషెంట్‌కు నగరంలోని మనోరమ ఆసుపత్రిలో అరుదైన శస్త్రచికిత్స నిర్వహించి విజయం సాధించినట్టు ప్రముఖ వైద్యులు వెంకటకృష్ణ తెలిపారు. శనివారం ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. శస్త్ర చికిత్సకు సంబంధించిన వివరాలు వెల్లడిస్తు ఆర్మూర్‌ డివిజన్‌ పరిధిలో పెర్కిట్‌ గ్రామానికి చెందిన 90 సంవత్సరాల వెంకట్‌గౌడ్‌ గత వారంరోజులుగా మూత్రంలో రక్తం పడడం, రెండు కిడ్నీలు చెడిపోయి అధిక రక్తపోటుతో బాదపడుతున్నట్టు పేర్కొన్నారు. అతన్ని పరీక్షించి రక్తం గడ్డకట్టి మూత్రం నుంచి వెళుతుందని క్రియేటింగ్‌ 7 మి. గ్రా. పొటాషియం, 8 మి.గ్రా. ఫ్లోరల్‌ శరీరమంత నీరు లేకపోవడం, రోజురోజుకు మూత్రంలో రక్తగడ్డలు ఎక్కువవడం జరిగిందన్నారు. ఈ పేషెంట్‌కు డయాలసిస్‌ నిర్వహించిన అనంతరం అత్యాధునిక టియుఆర్‌ఏ పద్దతిలో కుట్టు, కోత లేకుండానే చికిత్స చేసినట్టు తెలిపారు. వృద్ద వయసులో మత్తుమందుకు కూడా క్లిష్టమైన రోగికి అధునాతన పద్దతిలో ఆపరేషన్‌ నిర్వహించి ప్రాణాలు కాపాడడమే కాకుండా క్షేమంగా అతని బందువులకు అప్పగించడం జరిగిందన్నారు. సమావేశంలో ఆసుపత్రి ఛైర్మన్‌ డాక్టర్‌ రాజశేఖర్‌, డాక్టర్‌ చంద్రశేఖర్‌, డాక్టర్‌ వీణ, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Check Also

వైభవోపేతంగా బ్రహ్మూెత్సవాలు

కామారెడ్డి, మే 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా చిన్నమల్లారెడ్డి గ్రామంలో శ్రీ ప్రసన్న వెంకటేశ్వర ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *