Breaking News

మాజీ సైనిక సంఘం బలోపేతానికి కృషి

 

కామారెడ్డి, ఫిబ్రవరి 18

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మాజీ సైనికుల సంక్షేమానికి మాజీ సైనిక సంఘం తమవంతు కృషి చేస్తుందని సంఘం అధ్యక్ష, కార్యదర్శులు రాజారెడ్డి, బాలకిషన్‌, జనార్ధన్‌లు అన్నారు. ఆదివారం కామారెడ్డిలోని రెడ్డి సంక్షేమ భవనంలో మాజీ సైనిక సంక్షేమ సంఘం సమావేశం నిర్వహించారు. సమావేశానికి జిల్లాలోని మాజీ సైనికులు హాజరయ్యారు. వారి సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళి వాటి పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన న్యాయవాది నాగేశ్వర్‌రావు మాట్లాడుతూ మాజీ సైనికుల సమస్యలు, వాటి పరిష్కార మార్గాల గురించి వివరించారు. కార్యక్రమంలో రమేశ్‌, పాపిరెడ్డి, రాజేశ్వర్‌రావు, కృపాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Check Also

తెలంగాణ విద్వత్సభ నిర్ణయించిన పండగల వివరాలు

The following two tabs change content below.BioLatest Posts Nizamabad News Latest posts by Nizamabad News ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *