క్షమాభిక్ష అర్హులందరికీ విమాన టికెట్లు.
అందరిని క్షేమంగా ఇంటికి చేరవేయమని జాగృతి శాఖలకు ఆదేశాలు.
నిజామాబాద్ టౌన్, ఫిబ్రవరి 19
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కువైట్ దేశంలో అక్రమంగా పర్మిట్ వీసా లేకుండా శిక్షపడ్డ తెలంగాణ కార్మికులకు కువైట్ ప్రభుత్వం క్షమాభిక్ష (ఆమ్నెస్టీ) ప్రకటించిన విషయం తెలిసిందే.
గల్ప్ జైళ్ళలో మగ్గుతున్న తెలంగాణ కార్మికులకు స్వదేశానికి రప్పించేందుకు నిజామాబాద్ ఎంపి కల్వకుంట్ల కవిత ఆధ్వర్యంలో తెలంగాణ జాగృతి అందుకు తగిన ఏర్పాట్లు చేస్తుంది.
కువైట్ క్షమాభిక్ష (ఆమ్నెస్టీ)కి అర్హులై ఇండియా రావాలని అనుకొని టికెట్‌కు డబ్బులు లేని తెలంగాణ వారు ఎవరైనా ఉంటే తెలంగాణ జాగృతి ప్రధాన కార్యదర్శి నవీన్ ఆచారికి తెలపాలని ఎంపీ కవిత ఆదేశాలు జారీ చేశారు.
కువైట్‌లో ఆమ్నెస్టి ఈనెల 22తో ముగియనుండడం గమనార్హం.
దాదాపు ఏడు సంవత్సరాల తర్వాత కువైట్ ప్రభుత్వం ఇచ్చిన క్షమాభిక్ష అవకాశాన్ని ఉపయోగించుకోవాలని సూచించారు.
తెలంగాణ జాగృతి గల్ఫ్ శాఖలు, నిరంతరం కువైట్ లోని భారత రాయబార కార్యాలయం తో సమన్వయం చేస్తున్నారని తెలిపారు.
అలాగే క్షమాభిక్షలో భాగంగా దేశానికి రావాల్సిన వారు ఇప్పటికే అక్కడి ఎంబసిని కలుస్తున్నట్టు సమాచార ఉందని,
క్షమాభిక్షకు అర్హులు, వీసా గడువు ముగిసినా, కువైట్‌లోనే ఉన్నవారు తమ వివరాలు పంపాలని తెలిపారు.
అయితే కొందరికి కనీసం విమాన టిక్కెట్టుకు సైతం డబ్బులు లేని పరిస్థితి ఉందని తమ దృష్టికి రావడంతో ఇలాంటి వారందరికి తెలంగాణ జాగృతి మానవతా దృక్పథంతో బాధ్యత తీసుకుంటుందన్నారు.
బాధితులు తమ పూర్తి వివరాలు తెలియజేయాలని సూచించారు. బాధితులు కువైట్ దేశంలో ప్రస్తుతం ఉంటున్న ఊరుపేరు, వాట్సాప్ నెంబరు, ఈమెయిల్ అడ్రస్ అలాగే తెలంగాణ ప్రాంతంలోని జిల్లా, మండలం, గ్రామం, ఫోన్‌నెంబరు మొదలైన వివరాలను naveenaachari@gmail.com ఈ మెయిల్ చేయాలని లేదా ఫోన్ 8099166666 నంబర్ ద్వారా సంప్రదించవచ్చని సూచించారు.

Latest posts by NizamabadNews OnlineDesk (see all)
- డయల్ 100కు 2271 ఫోన్ కాల్స్ - October 10, 2018
- ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం - October 10, 2018
- బహుజనులు ఐక్యం కావాలి - October 10, 2018