Breaking News

Daily Archives: February 20, 2018

రెడ్డి జాగృతి యువజన విభాగం అధ్యక్షునిగా శ్రీకాంత్‌

  కామారెడ్డి, ఫిబ్రవరి 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా రెడ్డి జాగృతి యువజన విభాగం అధ్యక్షునిగా మోసర్ల శ్రీకాంత్‌రెడ్డిని నియమిస్తు జాగృతి రాష్ట్ర అధ్యక్షుడు ఎడ్ల ఉప్పల్‌రెడ్డి ఉత్తర్వులు జారీచేశారు. ఈమేరకు మంగళవారం శ్రీకాంత్‌రెడ్డికి నియామక పత్రం అందజేశారు. రెడ్డి జాగృతి అభ్యున్నతికి రెడ్డి జాగృతి చేపట్టే కార్యక్రమాల్లో సహాయ సహకారాలు అందించాలని సూచించారు.

Read More »

సంపు నిర్మాణానికి అనుమతినివ్వాలి

  కామారెడ్డి, ఫిబ్రవరి 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలోని సిరిసిల్లా రోడ్డులో తమ ఇంట్లోనే సంపు నిర్మాణం చేపడుతుండగా కొందరు వ్యక్తులు ఉద్దేశపూర్వకంగా తప్పుడు ఫిర్యాదు చేశారని, బాధితుడు మహ్మద్‌ బషురుద్దీన్‌ అన్నారు. మంగళవారం ఆయన స్తానిక విలేకరులతో మాట్లాడారు. గత కొన్ని సంవత్సరాల క్రితం శిథిలమైన భవనాన్ని తొలగించి మునిసిపల్‌ సంబంధిత శాఖల అనుమతితోనే రెండు సంవత్సరాల క్రితం భవన నిర్మాణం చేపట్టడం జరిగిందన్నారు. ప్రస్తుతం వేసవి కాలం వస్తుండడంతో నీటి ఎద్దడి దృష్ట్యా మునిసిపల్‌ వారి ...

Read More »

రోగులకు నాణ్యమైన వైద్య సేవలందించాలి

  కామారెడ్డి, ఫిబ్రవరి 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే రోగులకు ఆసుపత్రి సిబ్బంది, వైద్యులు నాణ్యమైన వైద్యసేవలు అందించాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ ఆదేశించారు. ఎల్లారెడ్డి మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని మంగళవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన కెసిఆర్‌ కిట్‌ల పంపిణీ, రోగులకు అందుతున్న వైద్య సేవలపై రోగులకు అడిగి తెలుసుకున్నారు. స్వచ్చంద ఆరోగ్య నేస్తం వారు వార్డుల వారిగా అందిస్తున్న సేవలను పరిశీలించారు. చిన్నారుల వ్యాక్సినేషన్‌ వివరాలను అడిగి తెలుసుకున్నారు. ...

Read More »

వాహనాల తనిఖీ

  కామారెడ్డి, ఫిబ్రవరి 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలోని నిజాంసాగర్‌చౌరస్తాలో మంగళవారం వాహనాలు తనిఖీ చేపట్టారు. ఇందులో భాగంగా నిబంధనలకు విరుద్దంగా నడుపుతున్న ఆటోలు, ద్విచక్ర వాహనదారులకు పోలీసు అధికారులు జరిమానా విధించారు. ఈ సందర్భంగా ఎస్‌ఐలు రవికుమార్‌, మాజర్‌, యాదగిరిగౌడ్‌లు మాట్లాడుతూ ప్రతి ఒక్కరు రవాణా శాఖనిబందనలు పాటించాలన్నారు. వాహనం నడిపేటపుడు హెల్మెట్‌ ధరించాలని సూచించారు. ఆటోల్లో డ్రైవింగ్‌ సీటు పక్కన ప్రయాణీకులను కూర్చొబెట్టవద్దని సూచించారు. నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవన్నారు. తనిఖీలో ఏఎస్‌ఐ రాములు, పోలీసు ...

Read More »

కామారెడ్డి జిల్లా వాసులకు సిఐటియు రాష్ట్ర కమిటీలో చోటు

  కామారెడ్డి, ఫిబ్రవరి 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ అంగన్‌వాడి టీచర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ సిఐటియు రాష్ట్ర కమిటీలో కామారెడ్డి జిల్లాకు చెందిన ముగ్గురికి అవకాశం వచ్చినట్టు సిఐటియు జిల్లా కార్యదర్శి సిద్దిరాములు తెలిపారు. నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలో జరిగిన మహాసభల్లో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారన్నారు. సిహెచ్‌.భారతి, చుక్కమ్మ, బాబాయిలను రాష్ట్ర కమిటీలోకి తీసుకున్నట్టు పేర్కొన్నారు. జిల్లాలో అంగన్‌వాడి ఉద్యమంలో అగ్రభాగంగా ఉండి పోరాడుతున్నారని ఈ క్రమంలో వారికి రాష్ట్ర కమిటీలో చోటు కల్పించినట్టు పేర్కొన్నారు.

Read More »

సిఎంకు పోస్టుకార్డులు రాస్తు నిరసన

  కామారెడ్డి, ఫిబ్రవరి 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మేదరి కులస్తులను ఆదుకోవాలని కోరుతూ మంగళవారం సంఘం ఆధ్వర్యంలో ప్రతినిదులు సిఎం కెసిఆర్‌కు పోస్టుకార్డులు రాసి నిరసన వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో మేదరులు 15 లక్షల మంది ఉన్నట్టు రాష్ట్ర నాయకుడు పుట్ట మల్లికార్జున్‌ పేర్కొన్నారు. 90 శాతం మంది మేదరులు ఇదే వృత్తిపై ఆధారపడి జీవిస్తున్నారని, అయినప్పటికి సరైన ఉపాధి లభించడం లేదన్నారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని కోరారు. కార్యక్రమంలో ప్రతినిధులు శ్రీనివాస్‌, ధర్మపురి, నర్సయ్య, తదితరులు ఉన్నారు.

Read More »

యాదయ్య స్మరణలో క్రొవ్వొత్తుల ర్యాలీ

  కామారెడ్డి, ఫిబ్రవరి 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ అమరవీరుడు సిరిపురం యాదయ్య స్మరణలో మంగళవారం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని అమరవీరుల స్థూపం వద్ద టిజివిపి ఆధ్వర్యంలో క్రొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా టిజివిపి రాష్ట్ర కార్యదర్శి ఎనుగందుల నవీన్‌ మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమానికి తన జీవితాన్ని అంకితమిస్తున్నానని, ఉద్యమాన్ని ఆపవద్దని పేర్కొంటూ యాదయ్య ఒంటిపై కిరోసిన్‌ పోసుకొని ప్రాణ త్యాగం చేశారన్నారు. ఆయన త్యాగం వెలకట్టలేనిదని పేర్కొన్నారు. బంగారు తెలంగాణలో నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు కల్పించినపుడే అది నెరవేరుతుందని ...

Read More »

అయ్యప్ప విగ్రహ ప్రతిష్టలో పాల్గొన్న ప్రభుత్వ విప్‌

  కామారెడ్డి, ఫిబ్రవరి 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బీబీపేట మండల కేంద్రంలో మంగళవారం అయ్యప్ప విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమానికి ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్యే గంప గోవర్ధన్‌ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ ప్రతినిదులు, స్వాములు ఎమ్మెల్యేకు స్వాగతం పలికారు. అంతకుముందు గ్రామంలోని ప్రధాన వీధుల గుండా అయ్యప్ప విగ్రహాన్ని ఊరేగింపుగా తీసుకొచ్చి ఆలయంలో వేద పండితులు పూజలు నిర్వహించి ప్రతిష్టాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ భక్తి మార్గంలో నడవడంతో ప్రజలందరు సుఖ సంతోషాలతో జీవిస్తారని పేర్కొన్నారు. ...

Read More »

మునిసిపల్‌లో విలీనం చేయొద్దంటూ రాస్తారోకో

  కామారెడ్డి, ఫిబ్రవరి 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తమ గ్రామాన్ని మునిసిపల్‌లో విలీనం చేయొద్దంటూ మంగళవారం ఓ గ్రామానికి చెందిన రైతులు గంటపాటు రాస్తారోకో నిర్వహించి నిరసన తెలిపారు. వివరాలిలా ఉన్నాయి… కామారెడ్డి మండలంలోని లింగాపూర్‌ గ్రామాన్ని మునిసిపల్‌లో విలీనం చేయడానికి అధికారులు కసరత్తులు ప్రారంభించారు. విలీనం వద్దంటూ వందలాది మంది గ్రామస్తులు కామారెడ్డి- ఎల్లారెడ్డి ప్రధాన రహదారిపై గంటపాటు రాస్తారోకో చేశారు. దీంతో రోడ్డుకిరువైపులా ట్రాఫిక్‌ స్థంభించింది. ఆందోళన స్థలం వద్దకు దేవునిపల్లి ఎస్‌ఐ సంతోష్‌కుమార్‌ చేరుకొని సమస్యను ...

Read More »

ఆధార్‌ అనుసంధానం చేయనివారు ఫోటోలు అందజేయాలి

  గాంధారి, ఫిబ్రవరి 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రెవెన్యూ భూ ప్రక్షాళనలో ఆధార్‌తో అనుసంధానం చేయని రైతులు తమ ఫోటోలను రెవెన్యూ అధికారులకు అందజేయాలని జాయింట్‌ కలెక్టర్‌ సత్తయ్య అన్నారు. మంగళవారం గాంధారి తహసీల్‌ కార్యాలయంలో నూతన వ్యవసాయ పట్టా పాస్‌ పుస్తకాల కంప్యూటరీకరణ నిర్వహణను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటీవల జరిగిన భూ రికార్డుల సర్వేలో ఎవరైతే ఆధార్‌ కార్డు సమర్పించలేదో వారు తమ ఫోటోలనైనా అందజేయాలన్నారు. మార్చి 11వ తేదీనుండి రైతులకు ప్రభుత్వం నూతనంగా ...

Read More »

చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి

  గాంధారి, ఫిబ్రవరి 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రతి వ్యక్తికి చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని ఎల్లారెడ్డి ప్రథమ శ్రేణి న్యాయమూర్తి అనిత అన్నారు. మంగళవారం గాంధారి మండలంలోని ముధోలి గ్రామంలో నిర్వహించిన న్యాయచైతన్య సదస్సులో ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ముఖ్యంగా అమ్మాయిలు అట్రాక్షన్‌కు లోనుకావద్దన్నారు. దీనికి సంబంధించిన లఘుచిత్రాన్ని అమ్మాయిలకు చూపించారు. గ్రామాల్లో భూములు, ఆస్తి తగాదాలకు సంబంధించిన గొడవలు సాధ్యమైనంత వరకు గ్రామ పెద్దల సమక్షంలో పరిష్కారం చేసుకోవాలన్నారు. గ్రామంలో పరిష్కారం కానివాటికి పోలీసులను ఆశ్రయించాలని, ...

Read More »