Breaking News

Daily Archives: February 26, 2018

విద్యార్థులు ఉన్నత స్థాయికి ఎదగాలి

  కామారెడ్డి, ఫిబ్రవరి 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : విద్యార్థులు చదువులో రాణించి ఉన్నత స్థాయికి ఎదగాలని డిజి కృష్ణప్రసాద్‌ అన్నారు. సోమవారం సాయంత్రం సాందీపని డిగ్రీ కళాశాలలో వార్షికోత్సవానికి హాజరై మాట్లాడారు. విద్యార్థులు దేశాభివృద్దికి కీలకమన్నారు. చదువులో రాణించి తమ తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ఆశయ సాధనకు కృషి చేయాలన్నారు. కళాశాల వాతావరణంలో అధ్యాపకుల బోధనతో విద్యార్థులు మంచి ఫలితాలు సాధించవచ్చన్నారు. తాను కూడా ప్రభుత్వ కళాశాలలో చదివి డిజి స్థాయికి రావడం జరిగిందన్నారు. అంతకుముందు విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ...

Read More »

ప్రజావాణిలో 41 ఫిర్యాదులు

  కామారెడ్డి, ఫిబ్రవరి 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామరెడ్డి ప్రగతిభవన్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో ప్రజల నుంచి ఆయా శాఖలకు సంబంధించి 41 ఫిర్యాదులు అందినట్టు కలెక్టరేట్‌ అధికారులు తెలిపారు. ఇందులో రెవెన్యూ-14, మునిసిపల్‌-6, డిఆర్‌డిఎ -5, నీటిపారుదల శాఖ-3, పంచాయతీరాజ్‌ -3, ఇతర శాఖలకు సంబందించిన ఫిర్యాదులు ఉన్నాయన్నారు. ఫిర్యాదులను పరిశీలించి వాటిని వెంటనే పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించినట్టు జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ తెలిపారు. కార్యక్రమంలో జేసి సత్తయ్య, డిఆర్వో మణిమాల ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.

Read More »

రూర్బన్‌ పథకం ద్వారా ప్రగతి సాధించాలి

  కామారెడ్డి, ఫిబ్రవరి 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రూర్బన్‌ పథకం ద్వారా ఆయా శాఖలు పూర్తిస్థాయిలో ప్రగతి సాధించాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ సూచించారు. సోమవారం జిల్లా కలెక్టరేట్‌లో అధికారులతో కన్వర్జెన్స్‌ సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ హరితహారాన్ని అందరి సహకారంతో వందశాతం సాధించాలన్నారు. జుక్కల్‌ 30 పడకల ఆసుపత్రిపై చర్యలు తీసుకోవాలని, ఇందిరజల స్వచ్చ ద్వారా లింగంపేట్‌, నాగిరెడ్డిపేట్‌లలో మోటార్ల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలన్నారు. వేసవి కాలంలో పశువులకు నీటి కొరత లేకుండా నీటి ...

Read More »

మార్చి నాటికి ఇంటింటికి తాగునీటిని అందించాలి

  కామారెడ్డి, ఫిబ్రవరి 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మార్చి మాసం నాటికి మిషన్‌ భగీరథ పనులు పూర్తిచేసి ఇంటింటికి తాగునీరు అందించేలా చర్యలు తీసుకోవాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ ఆదేశించారు. సోమవారం కలెక్టర్‌ చాంబరులో మిషన్‌ భగీరథపై అధికారులతో సమీక్షించారు. గడువుకంటే ముందుగా పెండింగ్‌ పైప్‌లైన్లు, సంప్‌, ఇతర పనులు పూర్తిచేసి నీటిని అందించాలన్నారు. గ్రామం నుంచి గ్రామానికి 80 కి.మీ.లు మండలాల వారిగా 65 కి.మీలు పనులు పూర్తి కావాల్సి ఉందన్నారు. యుద్ద ప్రాతిపదికన వీటిని పూర్తిచేయాలని ...

Read More »

ప్రభుత్వ విప్‌కు సన్మానం

  కామారెడ్డి, ఫిబ్రవరి 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రావూజీ వంజరి సంఘం కామరెడ్డి పట్టణం ఆద్వర్యంలో సంఘం ప్రతినిదులు సోమవారం కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్‌ను సన్మానించారు. కామారెడ్డిలో 200లకుపైగా వంజరి కుటుంబాలున్నాయని, వెయ్యిగా పైగా ఓటర్లు నమోదై ఉన్నారన్నారు. తమ కులస్తులంతా తెలంగాణ వాదానికి, తెరాస పార్టీకివెన్నంటి ఉంటున్నారని పేర్కొన్నారు. అశోక్‌నగర్‌ కాలనీలోని వంజరి కులస్తుల శివాలయ అభివృద్దికి సహకరించాలని పేర్కొన్నారు. ఎమ్మెల్యే స్పందిస్తు ఆలయ అభివృద్దికి తనవంతు తోడ్పాటు అందిస్తానని చెప్పారు. కార్యక్రమంలో సంఘం ప్రతినిదులు చందు, ...

Read More »

లయన్స్‌ సేవలు మరింత ఉదృతం చేయాలి

  కామారెడ్డి, ఫిబ్రవరి 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : లయన్స్‌ క్లబ్‌ సేవలను మరింత ఉదృతం చేసి కామారెడ్డి లయన్స్‌ పేరును మరింత గుర్తించే విధంగా కృషి చేయాలని క్లబ్‌ రాష్ట్ర ప్రతినిధి బి.ఎస్‌.రాజు కోరారు. ఆదివారం రాత్రి పట్టణంలోని రేణుక ఫంక్షన్‌ హాల్‌లో జరిగిన రీజియన్‌ సమావేశానికి హాజరై మాట్లాడారు. ఇందులో భాగంగా తెలంగాణలోని పది జిల్లాలకు సంబంధించిన 46 క్లబ్‌ల ప్రతినిధులు పాల్గొన్నారు. ప్రజాసేవా కార్యక్రమాలతో పాటు వివిధ పాఠశాల ఆసుపత్రుల్లో సేవలందించిన క్లబ్‌ ప్రతినిదులకు జ్ఞాపికలు అందజేశారు. ...

Read More »

ఉత్తమ రక్తదాతకు సన్మానం

  కామారెడ్డి, ఫిబ్రవరి 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అత్యవసర సమయంలో 52 సార్లు రక్తదానం చేసి ఉత్తమ రక్తదాతగా నిలిచిన బాలును సోమవారం కామారెడ్డిలో సన్మానించారు. కామారెడ్డి లయన్స్‌ క్లబ్‌ రీజినల్‌ స్థాయి సమావేశం సోమవారం కామారెడ్డిలో జరిగింది. ఈ సందర్భంగా 200 మంది రక్తదాతలతో వాట్సాప్‌ గ్రూప్‌ తయారుచేసి ఆపదలో ఉన్నవారికి రక్తం అందిస్తు గత 14 ఏళ్ళుగా రక్త దానం చేస్తున్న బాలును ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో క్లబ్‌ ప్రతినిదులు రాజ్‌కుమార్‌, లాల్‌, సతీష్‌గౌడ్‌, తదితరులు పాల్గొన్నారు.

Read More »

దేవాలయాల అభివృద్దికి కృషి

  కామారెడ్డి, ఫిబ్రవరి 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : దేవాలయాల అభివృద్దికి కృషి చేస్తానని ప్రభుత్వ విప్‌ గంప గోవర్ధన్‌ అన్నారు. సోమవారం కామారెడ్డి మండలం చిన్నమల్లారెడ్డి గ్రామంలో జరిగిన రామాలయ విగ్రహ ప్రతిష్టా కార్యక్రమానికి హాజరై మాట్లాడారు. ఆలయ అభివృద్దికి ఎమ్మెల్యే నిధుల నుంచి రూ. 5 లక్షలు కేటాయిస్తున్నట్టు పేర్కొన్నారు. అనంతరం ప్రత్యేక పూజలు చేసి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. కార్యక్రమంలో మునిసిపల్‌ ఛైర్‌పర్సన్‌ పిప్పిరి సుష్మ, సర్పంచ్‌ రామాగౌడ్‌, నాయకులు గోపీగౌడ్‌, అంజన్న, బల్వంత్‌రావు తదితరులున్నారు.

Read More »

రైల్వే పోలీసు స్టేషన్‌ను తనిఖీ చేసిన డిజి కృష్ణప్రసాద్‌

  కామారెడ్డి, ఫిబ్రవరి 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రైల్వే, రోడ్డు ప్రయాణీకుల భద్రత కోసం చర్యలు చేపట్టనున్నట్టు రైల్వే డిజి కృష్ణప్రసాద్‌ అన్నారు. సోమవారం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ రైల్వే పోలీసు స్టేషన్‌ను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రికార్డులను పరిశీలించారు. అనంతరం ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడారు. కామారెడ్డి రైల్వే పోలీసు స్టేషన్‌ పరిధిలో సంవత్సరానికి 40 మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, వీటి నివారణకు ప్రత్యేక కౌన్సిలింగ్‌ కూడా ఏర్పాటు చేయాలని స్థానిక పోలీసు అదికారులకు సూచించడం ...

Read More »

వృద్ధాశ్రమానికి రూ. 25 వేల వితరణ

  కామారెడ్డి, ఫిబ్రవరి 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణ శివారులోని వృద్ధాశ్రమాన్ని సోమవారం డిజి కృష్ణప్రసాద్‌ సందర్శించారు. వృద్దులకు సేవా కార్యక్రమాలు చేస్తున్న నిర్వాహకులను అభినందించారు. ఈ సందర్భంగా తనవంతు సహాయంగా రూ. 25 వేల నగదు అందజేశారు. అంతకుముందు కామారెడ్డి ఆర్యవైశ్య సంఘం ప్రతినిధులు నాగేశ్వర్‌రావు, కైలాష్‌ శ్రీనివాస్‌రావు, రమేశ్‌ గుప్త, తదితరులు డిజి కృష్ణప్రసాద్‌ను సన్మానించారు.

Read More »

అణగారిన వర్గాలకు రాజ్యాధికారం ఇవ్వాలి

  నిజామాబాద్‌ టౌన్‌, ఫిబ్రవరి 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అణగారిన వర్గాలకు రాజ్యాధికారం అందాలని తద్వారా సమసమాజ నిర్మాణం జరుగుతుందని సామాజిక పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పు సంతోష్‌ అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని ఆర్‌అండ్‌బి అతిథి గృహంలో విలేకరులతో మాట్లాడారు. తెలంగాణలో సామాజిక వర్గాలను ఐక్యం చేయడమే తమ లక్ష్యమని ఆ దిశగా భవిష్యత్తులో అనేక కార్యక్రమాలు చేపడుతున్నట్టు ఆయన అన్నారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ అంబేడ్కర్‌ రచించిన గ్రంథంలో బహుజనులు సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా ఎదగాలనేదే ...

Read More »

గుండెపోటుతో వ్యక్తి మృతి

  నిజామాబాద్‌ టౌన్‌, ఫిబ్రవరి 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గొర్రెల మందు కొనుగోలు చేయడం కోసం వచ్చిన ఓ వ్యక్తి సోమవారం గుండెపోటుతో మృతి చెందిన సంఘటన బస్టాండ్‌లో చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం… కామారెడ్డి జిల్లా సదాశివనగర్‌ మండల కేంద్రానికి చెందిన మర్కంటి భీమయ్య గొర్లు మేపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. సోమవారం ఉదయం నిజామాబాద్‌కు గొర్రెలకు మందులు కొనుగోలు చేయడానికి ఆర్టీసి బస్సులో చేరుకున్నాడు. బస్టాండ్‌ వద్దకు రాగానే భీమయ్యకు గుండెపోటుతో రావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. 1వ ...

Read More »

పలు అభివృద్ది కార్యక్రమాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే

  నిజామాబాద్‌ టౌన్‌, ఫిబ్రవరి 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ అర్బన్‌ ఎమ్మెల్యే బిగాల గణేశ్‌ గుప్త సోమవారం పలు అభివృద్ది కార్యక్రమాల్లో పాల్గొన్నారు. నగరంలో మైనార్టీ కాలనీల్లో 5 డివిజన్‌లలో పర్యటించి ఎల్‌ఆర్‌ఎస్‌ నిదుల ద్వారా కోటి రూపాయలు మంజూరు చేశారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నిజామాబాద్‌ నగరంలో ప్రతి డివిజన్‌లో రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ మెరుగుపరచడం కోసం ఎల్‌ఆర్‌ఎస్‌ నిధుల ద్వారా డివిజన్‌కు 20 లక్షల చొప్పున మంజూరు చేశామని పేర్కొన్నారు. సోమవారం మైనార్టీ కాలనీలనుగుర్తించి ...

Read More »

ప్రజావాణికి పలు వినతులు

  నిజామాబాద్‌ టౌన్‌, ఫిబ్రవరి 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌రావు ఆధ్వర్యంలో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణికి భారీగా వినతులు వచ్చాయి. నిజామాబాద్‌ జిల్లా డిచ్‌పల్లి మండల పరిధిలోని తెలంగాణ విశ్వవిద్యాలయం భూములను ఆక్రమణ దారుల నుంచి కాపాడాలని విద్యార్థి సంఘం నాయకులు పుప్పాలరవి, యెండల ప్రదీప్‌ కలెక్టర్‌కు విన్నవించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నో పోరాటాల ఫలితంగా ఏర్పాటు చేసిన తెలంగాణ విశ్వవిద్యాలయం భూమి 576 ఎకరాలతో ఆవిర్భవించిందన్నారు. కొందరు అక్రమంగా 2007 ...

Read More »

అత్యుత్సాహం ప్రదర్శించిన గ్రామ పంచాయతీ పాలకవర్గం

  నందిపేట, ఫిబ్రవరి 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నందిపేట మండల కేంద్రంలోని బర్కత్‌పుర కాలనీలోగల రైస్‌మిల్‌ యాజమాన్యం వెంచర్‌ చేసి హద్దులు ఏర్పాటు చేశారని, వాటిని తొలగించడానికి నందిపేట సర్పంచ్‌ షాకీర్‌, కార్యదర్శి రామకృష్ణ, జేసిబి వాహనం తీసుకొని సోమవారం రైస్‌మిల్‌ వద్దకెళ్లారు. అయితే అక్కడ ఎలాంటి వెంచర్‌గాని, హద్దులు గాని లేకపోవడంతో రైస్‌మిల్‌ యాజమాన్యం ఆగ్రహం వ్యక్తం చేయడంతో అధికారులు వెనుదిరిగి వెళ్లిపోవాల్సి వచ్చింది. ఎవరైనా అనుమతి లేకుండా వెంచర్‌ చేసినట్లయితే అట్టి వెంచర్‌ యాజమాన్యానికి ముందుగా నోటీసు ...

Read More »

డయల్‌ యువర్‌ సిపికి 16 ఫిర్యాదులు

  నిజామాబాద్‌ టౌన్‌, ఫిబ్రవరి 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ పోలీసు కమీషనర్‌ కార్తికేయ ప్రతి సోమవారం నిర్వహించే డయల్‌ యువర్‌ సిపికి 16 ఫిర్యాదులు అందాయి. నిజామాబాద్‌ డివిజన్‌తోపాటు ఆర్మూర్‌, బోధన్‌ డివిజన్‌లకు చెందిన ప్రజలు తమ సమస్యలు కమీషనర్‌కు విన్నవించారు. వీటిపై స్పందించిన కమీషనర్‌, ఆయా సమస్యలను సంబంధిత పోలీసు స్టేషన్‌ అధికారులకు సంప్రదించి బాధితులకు న్యాయం చేస్తామని కమీషనర్‌ పేర్కొన్నారు. కార్యక్రమంలో స్పెషల్‌బ్రాంచ్‌ ఇన్స్‌పెక్టర్‌ సి.హెచ్‌.వెంకన్న తదితరులున్నారు.

Read More »

అటవీ భూముల ఆక్రమణలపై వాడివేడి చర్చ

  – మండల సర్వసభ్య సమావేశంలో సభ్యుల ఆగ్రహం గాంధారి, ఫిబ్రవరి 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అటవీ భూములను యథేచ్చగా ఆక్రమిస్తున్నారని, ఇందులో అధికారుల హస్తముందని మండల సర్వసభ్య సమావేశంలో వాడివేడి చర్చ జరిగింది. సోమవారం గాంధారి మండల సర్వసభ్య సమావేశం ఎంపిపి యశోదాబాయి శివాజీరావు అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో వివిద శాఖల పనితీరుపై చర్చించారు. రెవెన్యూ, ఉపాధి హామీ, విద్య, వైద్యం, ఐసిడిఎస్‌, సంక్షేమశాఖ, వ్యవసాయం , తాగునీరు తదితర అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా సమావేశంలో ...

Read More »