Breaking News

Daily Archives: February 28, 2018

ఉచిత వైద్య శిబిరం

  బీర్కూర్‌, ఫిబ్రవరి 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బీర్కూర్‌ మండల కేంద్రంలో బుధవారం మాక్స్‌ క్యూర్‌ ఆసుపత్రి నిజామాబాద్‌ వారి ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈసి, బిపి, షుగర్‌ పరీక్షలు ఉచితంగా నిర్వహించి మందులు పంపిణీ చేశారు. వైద్య శిబిరానికి అపూర్వ స్పందన లభించిందని, సుమారు 500 మంది హాజరై పరీక్షలు చేయించుకోవడం జరిగిందన్నారు.

Read More »

కోర్టు ఆవరణలో హరితహారం

  కామారెడ్డి, ఫిబ్రవరి 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జాతీయ సైన్స్‌ దినోత్సవాన్ని పురస్కరించుకొని బుధవారం వాగ్దేవి విద్యాలయ విద్యార్థులు కామారెడ్డి కోర్టు ఆవరణలో మొక్కలు నాటారు. విద్యార్థులతో కలిసి కామరెడ్డి అదనపు జూనియర్‌ సివిల్‌ జడ్జి ఆర్‌.రాజ్‌కుమార్‌ మొక్కలు నాటారు. ఈ సందర్భంగా విద్యార్థులు హరితహార దీక్ష ప్రతిజ్ఞ చేశారు. న్యాయమూర్తి మాట్లాడుతూ నేటి మొక్కలు రేపు చెట్లుగా ఎదిగి మనకు ఆక్సిజన్‌ ఇచ్చి ప్రాణాలు నిలబెడతాయని పేర్కొన్నారు. వీలైనన్ని మొక్కలు నాటాలని సూచించారు. కార్యక్రమంలో సీనియర్‌ అసిస్టెంట్‌ భుజంగరావు, ...

Read More »

మేరు సంఘం ఆధ్వర్యంలో బైక్‌ ర్యాలీ

  కామారెడ్డి, ఫిబ్రవరి 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామరెడ్డి జిల్లా కేంద్రంలో బుదవారం టేలర్స్‌ డే పురస్కరించుకొని మేరు సంఘం కామారెడ్డి జిల్లా ఆధ్వర్యంలో గాంధీ గంజ్‌ నుంచి పట్టణంలో బైక్‌ ర్యాలీ నిర్వహించారు. అనంతరం జిల్లా కలెక్టర్‌ను కలిసి తమ సమస్యలపై వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా సంఘం ప్రతినిదులు మాట్లాడుతూ ప్రభుత్వం మేరు ఫెడరేషన్‌ ఏర్పాటు చేసి వందకోట్ల రూపాయలతో ప్రతి యేడు బడ్జెట్‌ ఏర్పాటు చేయాలన్నారు. మేరు కుల వృత్తిపై ఆధారపడి ఉన్నవారికి అధునాతన ...

Read More »

ఆకట్టుకున్న విద్యార్థుల ఆవిష్కరణలు

  కామారెడ్డి, ఫిబ్రవరి 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డిలోని ఎస్‌పిఆర్‌ పాఠశాలలో విద్యార్థులు జాతీయ సైన్స్‌ దినోత్సవం సందర్భంగా చేసిన ప్రయోగాలు, ఆవిష్కరణలు విశేషంగా ఆకట్టుకున్నాయి. బుధవారం సైన్స్‌ డే సందర్భంగా పలు ప్రదర్శనలు చేశారు. రాబోయే తరానికి శాస్త్రవేత్తలు మేమే అంటూ రూపొందించిన ప్రదర్శనలు సందర్శకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్‌ భారతి మాట్లాడుతూ శాస్త్రీయ ఆలోచనల ద్వారానే సమాజం ప్రగతి పథం లోకి పయనిస్తుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో డైరెక్టర్‌ విశ్వనాథ్‌, ప్రిన్సిపాల్‌, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Read More »

ఇంటర్‌ పరీక్షలు విజయవంతంగా పూర్తిచేయాలి

  కామారెడ్డి, ఫిబ్రవరి 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఇంటర్‌, స్కూల్‌ ఎడ్యుకేషన్‌ పబ్లిక్‌ పరీక్షలను విజయవంతంగా పూర్తిచేయాలని పాఠశాల, విద్యాశాఖ మంత్రి, ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి వీడియో కాన్ఫరెన్సు ద్వారా అధికారులకు సూచించారు. బుధవారం ఆర్డీవో కార్యాలయంలో ఏర్పాటైన విసిలో జిల్లా కలెక్టర్‌తోపాటు ఎస్‌పి శ్వేత పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ విద్యార్థులకు అసౌకర్యం కలగకుండా రవాణా, ఫస్ట్‌ ఎయిడ్‌ సౌకర్యం కల్పించాలన్నారు. మార్చి 1న ప్రభుత్వ సెలవు ఉన్నందున 2వ తేదీన యదాతథంగా పరీక్ష నిర్వహించాలన్నారు. ...

Read More »

ఆలయ అభివృద్దికి కృషి

  కామారెడ్డి, ఫిబ్రవరి 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలోని అశోక్‌నగర్‌లో బుధవారం నూతనంగా ప్రారంభించిన సిద్దివినాయక ఆలయ అభివృద్దికి తనవంతు కృషి చేస్తానని ఎమ్మెల్యే గంప గోవర్దన్‌ అన్నారు. అశోక్‌నగర్‌ రెడ్డి సంఘం ఆద్వర్యంలో ఏర్పాటు చేసిన సిద్దివినాయక ఆలయ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ప్రతి ఒక్కరు ఆధ్యాత్మిక భావాలను పెంపొందించుకోవాలని సూచించారు. అప్పుడే ప్రతి ఒక్కరికి మానసిక ప్రశాంతత చేకూరుతుందని అన్నారు. కార్యక్రమంలో రెడ్డి సంఘం ప్రతినిదులు రాంరెడ్డి, మోహన్‌రెడ్డి, రాజిరెడ్డి, శ్రీనివాస్‌ రెడ్డి, ...

Read More »

పోలీసు స్టేషన్‌ వద్ద యువకుడి ఆత్మహత్య యత్నం

  కామారెడ్డి, ఫిబ్రవరి 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భిక్కనూరు పోలీసు స్టేషన్‌ వద్ద బుధవారం ఓ యువకుడు ఎండ్రిన్‌ విషపు గుళికలు మింగి ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడు. భిక్కనూరు మండలం కాచాపూర్‌ గ్రామానికి చెందిన నర్సింలు, అవంతిలు కొన్ని రోజుల క్రితం ప్రేమించి వివాహం చేసుకున్నారు. ఈ విషయంపై యువతి కుటుంబీకులు పోలీసు స్టేషన్‌కు చేరుకొని ఫిర్యాదు చేశారు. ఇరువర్గాల వారు వాగ్వాదం చేసుకోగా అనంతరం యువతి అన్న తన వెంట తెచ్చుకున్న విషపు గుళికలు మింగి ఆత్మహత్య యత్నానికి ...

Read More »

ఉపాధి అవకాశాలు సద్వినియోగం చేసుకోవాలి

  కామారెడ్డి, ఫిబ్రవరి 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిరుద్యోగ యువత ఉపాధి హామీ అవకాశాలు సద్వినియోగం చేసుకోవాలని జాయింట్‌ కలెక్టర్‌ సత్తయ్య పిలుపునిచ్చారు. బుధవారం స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో తెలంగాణ జాగృతి నిజామాబాద్‌ శిక్షణ సంస్థ ఆధ్వర్యంలో సదస్సు నిర్వహించారు. నిరుద్యోగ యువత మూడునెలల పాటు నిజామాబాద్‌లో వృత్తి విద్యా కోర్సుల్లో శిక్షణ పొందాలని కోరారు. శిక్షణ పొందిన వారికి పలు కంపెనీల్లో ఉద్యోగావకాశాలు కల్పించడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో జాగృతి జిల్లా అధ్యక్షుడు అనంతరాములు, ప్రభాకర్‌, మురళి, తదితరులు ...

Read More »

తెలంగాణ తిరుమల ఆలయ హుండీ లెక్కింపు

  బీర్కూర్‌, ఫిబ్రవరి 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బీర్కూర్‌ గ్రామ శివారులోని తెలంగాణ తిరుమల ఆలయంలో బుధవారం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో హుండీ లెక్కింపు చేపట్టారు. 1,56,470 రూపాలయ నగదు ఉన్నట్లు ఆలయ కమిటీ సభ్యుడు మద్దినేని నాగేశ్వర్‌ రావు తెలిపారు. గత ఆరురోజులుగా నిర్వహించిన బ్రహ్మూెత్సవాల్లో భాగంగా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారని అన్నారు. తెలంగాణ తిరుమల ఆలయంలో ప్రతి శనివారం లక్ష్మి వెంకటేశ్వర స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహింపబడతాయని భక్తులకు మౌలిక సదుపాయాల్లో భాగంగా మహా ...

Read More »

పకడ్బందీగా పరీక్షలు నిర్వహించాలి

  గాంధారి, ఫిబ్రవరి 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఇంటర్‌ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని కామరెడ్డి జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ అన్నారు. బుధవారం ఆయన గాంధారి మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో ఇంటర్‌ పరీక్షా కేంద్రాన్ని తనిఖీ చేశారు. బుధవారం ప్రారంభమైన ఇంటర్‌ పరీక్షలో మొదటిరోజు ఎంత మంది విద్యార్థులు హాజరయ్యారో నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు తాగునీటి సౌకర్యం కల్పించాలని సూచించారు. పరీక్ష కేంద్రం వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలన్నారు. విద్యార్థులు పరీక్షలు ప్రశాంత ...

Read More »

సిఎం కెసిఆర్‌ దిష్టిబొమ్మ దగ్దం

  కామారెడ్డి, ఫిబ్రవరి 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రధానమంత్రి మోడిపై సిఎం కెసిఆర్‌ అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా బుధవారం కామారెడ్డి జిల్లా కేంద్రంలో బిజెపి ఆధ్వర్యంలో సిఎం కెసిఆర్‌ దిష్టిబొమ్మ దగ్దం చేశారు. స్థానిక నిజాంసాగర్‌ చౌరస్తాలో జరిగిన ఆందోళన కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర నాయకుడు డాక్టర్‌ సిద్దిరాములు మాట్లాడారు. దేశాన్ని అభివృద్ది పరుస్తున్న ప్రధానమంత్రి మోడిపై తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్‌ దురుసుగా మాట్లాడడం సిగ్గుచేటన్నారు. వెంటనే ప్రధానమంత్రికి క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. రాబోయే రోజుల్లో ప్రజలు ...

Read More »

వాహనాల తనిఖీ

  కామారెడ్డి, ఫిబ్రవరి 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పట్టణంలోని నిజాంసాగర్‌ చౌరస్తాలో బుధవారం సాయంత్రం పోలీసులు ద్విచక్ర వాహనాలు తనికీ చేశారు. నిబంధనలకు విరుద్దంగా వాహనాలు నడుపుతున్న 20 మందికి పట్టణ ఎస్‌ఐ మాజర్‌ జరిమానా విధించారు. ప్రతి ఒక్కరు రవాణా నిబందనలు పాటించాలని సూచించారు. తనిఖీలో ఏఎస్‌ఐ రాములు, సిబ్బంది ఉన్నారు.

Read More »

జర్నలిస్టు కుటుంబాలకు అండగా ఉంటాం

  నిజామాబాద్‌ టౌన్‌, ఫిబ్రవరి 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జర్నలిస్టు కుటుంబాలకు అండగా ఉంటామని శాసనమండలి ఛైర్మన్‌ స్వామిగౌడ్‌ అన్నారు. బుధవారం హైదరాబాద్‌లో జరిగిన తెలంగాణ రాష్ట్ర వర్కింగ్‌ జర్నలిస్టుల సంఘం (ఐజెయు) నిజామాబాద్‌ జిల్లా తరఫున జిల్లాలో చనిపోయిన జర్నలిస్టు కుటుంబాలకు జర్నలిస్టు సంక్షేమ నిధి ద్వారా చెక్కులు అందజేశారు. ఈ సందర్భంగా ప్రెస్‌అకాడమి ఛైర్మన్‌ అల్లం నారాయణ మాట్లాడుతూ జర్నలిస్టులు విధి నిర్వహణలో నిమగ్నమై తమ ఆరోగ్యాన్ని పట్టించుకోరని, దేశంలో ఏ మూల ఏ చిన్న సంఘటన ...

Read More »

ముఖ్యమంత్రి చిత్రపటానికి పాలాభిషేకం

  నిజామాబాద్‌ టౌన్‌, ఫిబ్రవరి 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్‌ చిత్రపటానికి నగర గౌడ సంఘం ఆద్వర్యంలో బుధవారం పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా నగర సంఘం కార్యదర్శి సత్యనారాయణగౌడ్‌ మాట్లాడుతూ 2013 నుంచి మూతపడిన డిపో-1,2 లను తెరిపించడం ఆనందంగా ఉందని, గౌడ సంఘం సభ్యులు ఉపాధి లేక తీవ్ర ఇబ్బందుల పాలవుతున్నారని, ఈ పరిస్థితిపై స్పందించిన ఎంపి కవిత ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లగా నూతన పాలసీ ప్రకారం కల్లు సొసైటీకి అనుమతి జారీచేయడం ...

Read More »

జయేంద్ర సరస్వతి స్వామిజీకి ఘన నివాళి

  నిజామాబాద్‌ టౌన్‌, ఫిబ్రవరి 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కంచి కామకోటి పీఠాధిపతులు జయేంద్ర సరస్వతి అకాల మరణం కంచి పీఠానికి తీరని లోటని మన బ్రాహ్మణ సమాజం జిల్లా అధ్యక్షుడు ఆదిలాబాద్‌, నిర్మల్‌, కామారెడ్డి, జిల్లాల సమన్వయకర్త జనగామ చంద్రశేఖర శర్మ అన్నారు. నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలో అఖిలభారత భగవద్గీత ప్రచార మండలి ఆధ్వర్యంలో గీతా భవనంలో బుధవారం సాయంత్రం స్వామీజీకి శ్రద్దాంజలి ఘటించారు. ఈ సందర్భంగా శర్మ మాట్లాడుతూ కంచి పీఠానికి జయేంద్ర సరస్వతి స్వామిజీకి 60 ...

Read More »

మేరు కులాన్ని బిసి-ఎ లో చేర్చాలి

  నిజామాబాద్‌ టౌన్‌, ఫిబ్రవరి 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మేరు కులాన్ని బిసి-బి గ్రూప్‌ నుంచి తొలగించి బిసి -ఎ లో చేర్చాలని జిల్లా మేరు సంఘం అధ్యక్షుడు పోల్కం గంగాకిషన్‌ ప్రభుత్వాన్ని కోరారు. బుధవారం టేలర్స్‌డే సందర్భంగా జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌రావుకు వినతి పత్రం అందజేసిన అనంతరం ఆయన మాట్లాడారు. మేరు కులస్తులు ఆర్థికంగా చాలా వెనకబడి ఉన్నారని, రెడిమేడ్‌ వస్త్ర వ్యాపారం విస్తరించడంతో మేరు కులస్తులకు పనిలేకుండా పోయి దుర్బర జీవితాన్ని గడుపుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం ...

Read More »

షీ టీంల పనితీరు భేష్‌

  నిజామాబాద్‌ టౌన్‌, ఫిబ్రవరి 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : షీ టీంల పని బేషుగ్గా ఉందని నిజామాబాద్‌ పోలీసు కమీషనర్‌ కార్తికేయ అన్నారు. బుధవారం షీ టీంల నెలవారి సమాచారాన్ని విడుదల చేసిన అనంతరం మాట్లాడారు. ఫిబ్రవరి 1వ తేదీ నుంచి 27వ తేదీ వరకు కమీషనరేట్‌ పరిధిలో షి టీం లద్వారా మొత్తం 20 మందిని పట్టుకున్నామని, బోధన్‌, నిజామాబాద్‌, ఆర్మూర్‌ డివిజన్‌లలో ఆకతాయిలను పట్టుకొని అందులో ఐదుగురిపై కేసు నమోదు చేశామని, ఒకరిపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశామని, ...

Read More »