Breaking News

Monthly Archives: March 2018

మత్స్యకారుల పథకాలపై సమీక్ష

కామారెడ్డి, మార్చి 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మత్స్యకారులకు సంబంధించిన పథకాలపై శనివారం కామారెడ్డి జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ అధికారులతో వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. ఇంటిగ్రేటెడ్‌ ఫిషరీస్‌ డెవలప్‌మెంట్‌ స్కీంపై ఆయన అధికారులతో సమీక్షించారు. 2017-18, 2018-19 సంవత్సరాలకు సంబంధించి ఈ పథకం సభ్యత్వంగల మత్స్యకారులకు మాత్రమే వర్తిస్తుందని చెప్పారు. 2016-17 ఆడిట్‌ కలిగి ఉండాలని వివరించారు. పథకంలో మత్స్యకారులకు చేప పిల్లల ఉత్పత్తి నుంచి మార్కెటింగ్‌ వరకు అన్ని రకాల ఉపకరనాలను సబ్సిడీ ద్వారా ఇస్తామన్నారు. మహిళా మత్స్యకారులకు రివాల్వింగ్‌ ...

Read More »

బాధితున్ని ఆదుకోవాలి

కామారెడ్డి, మార్చి 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి మండలంలోని లింగాయిపల్లి గ్రామానికి చెందిన బీరయ్యకు చెందిన పది గొర్రెలను రెండ్రోజుల కుక్కలు దాడిచేసి చంపేశాయి. ఈ సంఘటనలో సుమారు లక్షకుపైగా ఆస్తినష్టం వాటిల్లినా అధికారులు స్పందించడం లేదని కార్మిక సంఘం నాయకుడు రాజలింగం ఆరోపించారు. శనివారం బాధిత కుటుంబాన్ని పరామర్శించి ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు.

Read More »

బిసి కార్పొరేషన్‌ రుణాల అందజేత

కామారెడ్డి, మార్చి 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బిసి కార్పొరేషన్‌ ద్వారా విడుదలైన రుణాలను కామారెడ్డిలో శనివారం స్థానిక ఎమ్మెల్యే గంప గోవర్ధన్‌ లబ్దిదారులకు అందజేశారు. పట్టణంలోని శ్రీమల్లికార్జున మేదరి సంఘానికి 19 లక్షలు, దేవునిపల్లి గ్రామంలోని శ్రీనవదుర్గా విశ్వబ్రాహ్మణ సంఘానికి రూ. 14 లక్షలు, బిసి కార్పొరేషన్‌ ద్వారా రుణాలు మంజూరుకాగా చెక్కులను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎంపిపి మంగమ్మ, ఆత్మ ఛైర్మన్‌ బల్వంత్‌రావు, తెరాస పార్టీ అధ్యక్షుడు అంజన్న తదితరులు పాల్గొన్నారు.

Read More »

గ్రామ పంచాయతీల ఏర్పాటుపై హర్షం

  కామారెడ్డి, మార్చి 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మాచారెడ్డి మండలంలోని రాజాకాంపేటను కొత్త గ్రామ పంచాయతీగా ఏర్పాటు చేసినందుకు శనివారం గ్రామస్తులు ఎమ్మెల్యే గంప గోవర్ధన్‌ను కలిసి పుష్పగుచ్చం అందజేసి ధన్యవాదాలు తెలిపారు. అర్హతగల గ్రామాలను, తాండాలను గ్రామ పంచాయతీలుగా ఏర్పాటుచేస్తు ప్రబుత్వం నిర్ణయం తీసుకోవడం పట్ల హర్సం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కెసిఆర్‌కు, ఎమ్మెల్యేకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఎమ్మెల్యే ముఖ్యమంత్రి సహాయనిధి కింద విడుదలైన 1.81 లక్షల చెక్కులను మాచారెడ్డి, కామారెడ్డి మండలాలకు చెందిన ...

Read More »

ఆలయాల్లో హనుమాన్‌ జయంతి వేడుకలు

కామారెడ్డి, మార్చి 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని హనుమాన్‌ ఆలయాల్లో శనివారం జయంతి వేడుకలు వైభవంగా నిర్వహించారు. స్వామివారిని తమలపాకులు, చందనంతో అలంకరించి విశేష పూజలు జరిపారు. భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయాలకు వెళ్లి స్వామివారిని దర్శించుకున్నారు. ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయాల వద్ద భక్తులకు మహా అన్నదాన కార్యక్రమం జరిపారు. పట్టణంలోని శ్రీరాంనగర్‌ కాలనీ ఆంజనేయస్వామి ఆలయంలో స్థానిక ఎమ్మెల్యే గంప గోవర్ధన్‌ ప్రత్యేక పూజలు జరిపారు. పంచముఖి హనుమాన్‌ దేవాలయంలో ...

Read More »

కాషాయమయమైన కామారెడ్డి

కామారెడ్డి, మార్చి 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలో శనివారం హనుమాన్‌ జయంతి వేడుకలు పురస్కరించుకొని పట్టణం కాషాయమయమైంది. విశ్వహిందూ పరిషత్‌, భజరంగ్‌ దళ ఆధ్వర్యంలో పట్టణంలో భారీ ర్యాలీ చేపట్టారు. హనుమాన్‌ భారీ విగ్రహాన్ని రథంపై ఉంచి డిజె శబ్దాల నడుమ పట్టణంలోని ప్రధాన వీధుల గుండా స్వామివారి ఊరేగింపు నిర్వహించారు. వేలాది సంఖ్యలో భక్తులు యాత్రకు తరలివచ్చారు. యాత్రకు విశేష స్పందన లభించింది. ఈ సందర్భంగా పట్టణంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు భారీ బందోబస్తు ...

Read More »

కామారెడ్డిలో వెల్లివిరిసిన మతసామరస్యం

కామారెడ్డి, మార్చి 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలో శనివారం నిర్వహించిన హనుమాన్‌ జయంతి శోభాయాత్ర ప్రశాంతంగా జరగగా మతసామరస్యం వెల్లివిరిసింది. కామారెడ్డిలో మొదటి నుంచి హిందూ ముస్లింలు సోదర భావంతో ఉంటారు. ఇదే ఆనవాయితీని కొనసాగిస్తు ముస్లింలు ర్యాలీ నిర్వహిస్తున్న భక్తులకు నిమ్మరసం ఇచ్చారు. ఒకరి నొకరు ఆలింగనం చేసుకొని మతసామరస్యాన్ని చాటుకున్నారు. నిర్మల్‌లో జరిగిన గొడవల నేపథ్యంలో పోలీసులు పకడ్బందీ బందోబస్తు నిర్వహించగా జనం మాత్రం అందుకు భిన్నంగా భాయి భాయిగా కలిసి తిరిగారు.

Read More »

సిఎం కెసిఆర్‌ చిత్రపటానికి క్షీరాభిషేకం

కామారెడ్డి, మార్చి 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తాండాలను గ్రామ పంచాయతీలుగా ప్రకటిస్తు శాబ్దిపూర్‌ తాండాను గ్రామ పంచాయతీగా ఏర్పాటు చేయడం పట్ల గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తు తాండావాసుల ఆద్వర్యంలో ముఖ్యమంత్రి, ఎమ్మెల్యే చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు. శాబ్దిపూర్‌ తాండాలోని గిరిజనులందరు సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సిఎం కెసిఆర్‌ గిరిజనుల సంక్షేమానికి పెద్దపీట వేస్తు తాండాల అభివృద్ది కోసం వాటిని గ్రామ పంచాయతీలుగా మార్చడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో రవీందర్‌, లక్ష్మణ్‌, మోతిరాం, సీతారాం, రాజు, పెంటయ్య, రమేశ్‌, ...

Read More »

సిఎం కెసిఆర్‌ చిత్రపటానికి పాలాభిషేకం

నిజాంసాగర్‌, మార్చి 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని గున్కుల్‌ గ్రామంలో సిఎం కెసిఆర్‌ చిత్రపటానికి శనివారం పాలాభిషేకం చేశారు. తాండాలను గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించడంతో ఆయా గ్రామాల్లో ప్రజలు సంబరాలు జరుపుకుంటున్నారు. సిఎం కెసిఆర్‌ చిత్రపటానికి పాలభిషేకం చేసి ప్రబుత్వానికి అనుకూలంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా తెరాస నాయకులు మాట్లాడుతూ చిన్న చిన్న గ్రామాలను పంచాయతీలుగా ఏర్పాటు చేసేందుకు సహకరించిన జుక్కల్‌ ఎమ్మెల్యే హన్మంత్‌ షిండేకు కృతజ్ఞతలు తెలిపారు.

Read More »

మాలల అభ్యున్నతికి ఐక్యవేదిక

నిజామాబాద్‌ టౌన్‌, మార్చి 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మాలల అభ్యున్నతికి ఐక్యవేదిక ఏర్పాటు చేశామని మాలల ఐక్యవేదిక జిల్లా కన్వీనర్‌ స్వామి దాస్‌ అన్నారు. శనివారం స్తానిక ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మాలల ఉపకులాలు 61 అని, అణగారిన వారిని సమాజంలో అందరితో సమానంగా ఉంచడానికి డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌ ఆశయాలకు అనుగుణంగా పోరాటం సాగించడానికి మాలల ఐక్యవేదిక కృసి చేస్తుందని పేర్కొన్నారు. తెలంగాణ పోరాటంలో మాల యువజనులు, గాయకులు, కళాకారులు, మేధావులు పాల్గొని ...

Read More »

ఘనంగా వీర హనుమాన్‌ శోభాయాత్ర

నిజాంసాగర్‌, మార్చి 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలో హనుమాన్‌ జయంతి సందర్భంగా ఆయా గ్రామాల్లో వేడులు నిర్వహించారు. మనకోసం మనం అనే స్వచ్చంద సంస్థ ఆధ్వర్యంలో నిజాంసాగర్‌ మార్కెట్‌ నుంచి ప్రారంభమైన వీరహనుమాన్‌ శోభాయాత్ర, హైస్కూల్‌, పోలీసు స్టేషన్‌, మహాత్మాగాంధీ చౌరస్తా వరకు నిర్వహించారు. డిజె శబ్దాల నడుమ యువత కేరింతలు కొడుతూ జై హనుమాన్‌ నినాదాలతో మారుమోగింది. గ్రామాల్లో అన్నదాన కార్యక్రమాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో మాజీ జడ్పిటిసి వినయ్‌ కుమార్‌, కిషోర్‌, సర్పంచ్‌ బేగరి రాజు, ...

Read More »

జై హనుమాన్‌ నామస్మరణతో మారుమోగిన ఇందూరు

నిజామాబాద్‌ టౌన్‌, మార్చి 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పవన సుతుడు, ఆంజనేయస్వామి జయంతి వేడుకలు జిల్లా వ్యాప్తంగా అత్యంత ఘనంగా, భక్తి శ్రద్దలతో నిర్వహించారు. అంజన్న భక్తులతో హనుమాన్‌ ఆలయాలు కిటకిటలాడాయి. జై బోలో హనుమాన్‌కి అంటూ చేసిన నినాదాలు మారుమోగాయి. జిల్లా కేంద్రంలో హిందూ ధర్మకర్తలు, విశ్వహిందూ పరిషత్‌, హనుమాన్‌ మాలధారులు, ఆయా పార్టీల నాయకులు, పార్టీలకు అతీతంగా వీరహనుమాన్‌ విజయయాత్రలో పాల్గొన్నారు. నగర మేయర్‌ ఆకుల సుజాత, బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ధన్‌పాల్‌ సూర్యనారాయణ గుప్త ...

Read More »

ఎస్సీ శ్మశాన వాటికకు భూమి కేటాయించాలి

రెంజల్‌, మార్చి 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రెంజల్‌ మండలంలోని తాడ్‌బిలోలి గ్రామంలో శనివారం స్థానిక సర్పంచ్‌ తెలంగాణ శంకర్‌ అధ్యక్షతన గ్రామదర్శిని సభ జరిగింది. ఈ సందర్భంగా మాల మాదిగలకు శ్మశాన వాటిక స్థలం కొరకు రెండెకరాల భూమిని ప్రభుత్వం కొనుగోలు చేసి ఇవ్వాలని దళిత నాయకులు అనంతయ్య, మల్ల సాయిలు లిఖిత పూర్వకంగా అధికారులను కోరారు. ఎవరైనా మరణిస్తే పూడ్చిపెట్టేందుకు అనేక రకాల అవస్థలు తప్పడం లేదని వారు వాపోయారు. రైతు సమస్యలు కూర్చుండి మాట్లాడేందుకు ప్రత్యేక భవన ...

Read More »

సిఎం కెసిఆర్‌ చిత్రపటానికి పాలాభిషేకం

నందిపేట, మార్చి 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని చిన్నయానాం గ్రామాన్ని ప్రత్యేక గ్రామ పంచాయతీగా ప్రకటించినందుకుగాను శనివారం గ్రామస్తులు ముఖ్యమంత్రి కెసిఆర్‌ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అలాగే ఇందుకు సహకరించిన ఎంపి కవిత, ఎమ్మెల్యే జీవన్‌రెడ్డిలకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో తెరాస మండల పార్టీ అధ్యక్షుడు నక్కల భూమేశ్‌, ఉపసర్పంచ్‌ సాగర్‌, మాజీ ఎంపిటిసి చిల్క శ్రీనివాస్‌, గణేశ్‌, రాంరెడ్డి, భూమన్న, వేముల భూమన్న, దశరథ్‌, భూపతి, లక్ష్మి తదితరులున్నారు.

Read More »

ఘనంగా హనుమాన్‌ జయంతి వేడుకలు

రెంజల్‌, మార్చి 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని ఆయా గ్రామాల్లో హనుమాన్‌ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. భక్తులు ఉదయమే ఆలయాలను సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. మండల కేంద్రంతోపాటు తాడ్‌బిలోలి, ధూపల్లి, కందకుర్తి, కూనేపల్లి, నీలా గ్రామాల్లో నిర్వాహకులు పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. తాడ్‌బిలోలిలో హనుమాన్‌ భక్తులు గ్రామంలోని ప్రధాన వీధుల గుండా బైక్‌ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో సర్పంచ్‌లు తెలంగాణ శంకర్‌, చందూర్‌, సవిత, గంగామణి, కాంగ్రెస్‌ పార్టీ మండలాధ్యక్షుడు సాయిరెడ్డి, విఠల్‌, ...

Read More »

15వ డివిజన్‌లో హనుమాన్‌ జయంతి వేడుకలు

నిజామాబాద్‌ టౌన్‌, మార్చి 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ నగరంలోని 15వ డివిజన్‌లో ఘనంగా హనుమాన్‌ జయంతి వేడుకలు నిర్వహించారు. వేడుకల్లో నగర మేయర్‌ ఆకుల సుజాత, శ్రీశైలం పాల్గొన్నారు. సంకట విమోచన హనుమాన్‌ ఆలయంలో మూల విరాట్టుకు పంచామృతాభిషేకం నిర్వహించారు. అనంతరం పంచముఖి హనుమాన్‌ ఆలయంలో శుక్రవారం జరిగిన ఇందూరు అభయాంజనేయ సేవాసమితి వారు ప్రతిష్టించిన స్వామివారి విగ్రహానికి విశేష పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అన్నదానం చేశారు. కార్యక్రమంలో తెరాస ...

Read More »

చలివేంద్రం ఏర్పాటు

బీర్కూర్‌, మార్చి 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నసురుల్లాబాద్‌ మండలంలోని బొమ్మన్‌దేవుపల్లి గ్రామానికి చెందిన యువచైతన్యయూత్‌ ఆధ్వర్యంలో నసురుల్లాబాద్‌ ఎక్స్‌రోడ్డు దగ్గర శనివారం చలివేంద్రం ఏర్పాటు చేశారు. కాగా ఎస్‌ఐ అనిల్‌రెడ్డి, గ్రామ సర్పంచ్‌ గంగామణి, ఎంపిటిసి సాయవ్వ, కో ఆప్షన్‌ ఛైర్మన్‌ మజీద్‌, సునీల్‌ రాథోడ్‌ చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్బంగా ఎస్‌ఐ మాట్లాడుతూ యువత ఇలాంటి కార్యక్రమాలు చేయడం వల్ల వారిలో వ్యక్తిత్వ వికాసం జరుగుతుందని అన్నారు. జీవితంలో మరింత ఉన్నత స్తాయికి చేరుకొని మరిన్నిసేవా కార్యక్రమాలు ...

Read More »

హనుమాన్‌ జయంతి వేడుకల్లో పాల్గొన్న మంత్రి పోచారం

నిజామాబాద్‌ టౌన్‌, మార్చి 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి శనివారం హనుమాన్‌ జయంతి వేడుకల్లో పాల్గొన్నారు. స్వయంగా ట్రాక్టర్‌ నడుపుతూ ర్యాలీ ప్రారంభించారు. ముందుగా బాన్సువాడ పట్టణంలో హనుమాన్‌ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే మండలంలోని ఇబ్రహీం పేట గ్రామ సమీపంలో తాండాలో నూతన ఆలయ విగ్రహ ప్రతిష్టా కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గ్రామ గ్రామాన హనుమాన్‌ ఆలయాలు ఉంటాయని, హనుమాన్‌ మందిరంలేని ...

Read More »

సిసి రోడ్డు పనులు ప్రారంభం

నిజాంసాగర్‌, మార్చి 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎల్లారెడ్డి డివిజన్‌ పరిధిలోని దేవునిపల్లి గ్రామంలో ఉపాది హామీ పథకం కింద మంజూరైన నిదులతో సిసి రోడ్డు పనులను స్థానిక ఎంపిపి లక్క గంగాధర్‌, జడ్పిటిసి సామల్‌ శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపిపి మాట్లాడుతూ దేవునిపల్లి గ్రామంలో రూ. 5 లక్షల నిధులతో సిసి రోడ్డు పనులను చేపట్టామని, నాణ్యతతో పదికాలాల పాటు ఉండేలా నిర్మించాలని కాంట్రాక్టర్‌లను ఆదేశించారు. కార్యక్రమంలో ఏఎంసి ఛైర్మన్‌ వెంకట్‌రాంరెడ్డి, సర్పంచ్‌ చంద్రకళ, తెరాస మండల అధ్యక్షుడు ...

Read More »

జెసిటియు మండల కార్యవర్గం ఎన్నిక

బీర్కూర్‌, మార్చి 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బీర్కూర్‌ మండలంలో జెసిటియు ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు సమావేశమయ్యారు. ప్రధానంగా స్పాట్‌ వాల్యుయేషన్‌ను బహిష్కరించాలని, ఉపాధ్యాయ సమస్యలను పరిష్కరించాలని, ప్రభుత్వ దృష్టికి సమస్యలు తీసుకెళ్ళడం వంటి విషయాలపై చర్చించారు. ఇందులో భాగంగా కరపత్రాలను విడుదల చేశారు. అలాగే మండల జేసిటియు కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. మండల అధ్యక్షుడుగా నర్సింలు, ప్రధాన కార్యదర్శిగా ప్రసాద్‌లను ఎన్నుకున్నారు. కార్యక్రమానికి బీర్కూర్‌ మండల ఇన్‌చార్జిలుగా జేసిటియు జిల్లా స్టీరింగ్‌ కమిటీ సభ్యులు రవీంద్రనాథ్‌ ఆర్య, లచ్చిరం గారు వ్యవహరించారు.

Read More »