Breaking News

అరుదైన చికిత్సకు వేదికైన నిజామాబాద్‌ మ్యాక్స్‌క్యూర్‌ నిహారిక ఆసుపత్రి

 

నిజామాబాద్‌ టౌన్‌, ఏప్రిల్‌ 6

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ నగరంలో గల మ్యాక్స్‌క్యూర్‌ నిహారిక ఆసుపత్రి అరుదైన చికిత్సకు వేదికైంది. కామారెడ్డి జిల్లా పిట్లం మండలం గౌరారం గ్రామానికి చెందిన బాబి అనే మహిళ గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతుంది. ఆమెకు గతంలో వైద్యులు ఎట్టి పరిస్థితిలో గర్బం దాల్చకూడదని హెచ్చరించారు. వివాహం తర్వాత గర్బం దాల్చడంతో 7వ నెలలో గుండె సంబంధిత వ్యాధి తీవ్రమైంది. అత్యవసర పరిస్థితిలో గుండె రక్తనాళాలు మూసుకొని (గుండె కవాటం) ఉండడంతో గుండె కవాట సర్జరీ (బెలూన్‌ మెట్రో వాల్వో ప్లాస్టి) జరిగిన గుండె పనితీరులో ఎటువంటి మార్పు లేకపోయిందని ఆసుపత్రి వైద్యులు డాక్టర్‌ రాజ్‌కమల్‌ గౌడ్‌ తెలిపారు. 8వ నెలలో గుండెసంబంధిత వ్యాధి తీవ్రమవడంతో నెలలు నిండకముందే అత్యవసర పరిస్థితిలో నగరంలోని వివిధ ఆసుపత్రులకు తీసుకెళ్లగా వారు హైదరాబాద్‌ వెళ్లాలని సూచించారని డాక్టర్‌ తెలిపారు. చివరి ప్రయత్నంగా వారు తమ వద్దకు రాగానే ఆసుపత్రి సూపరింటెండెంట్‌ కార్డియాలజిస్టు డాక్టర్‌ సదానందరెడ్డి బృందం తల్లి ప్రాణాలు దృష్టిలో ఉంచుకొని అత్యవసర సర్జరీ ద్వారా డెలివరి చేయాలని నిర్దారించి ఆపరేషన్‌ ఏర్పాటు చేశారని, తల్లి, బిడ్డ ప్రాణాలు కాపాడారని పేర్కొన్నారు. సర్జరీ చేసిన వారిలో డాక్టర్‌ సదానందరెడ్డితోపాటు డాక్టర్‌ శైలజ, డాక్టర్‌ భాస్కర్‌రెడ్డి, డాక్టర్‌ బైరవ్‌ ఉన్నారన్నారు. విలేకరుల సమావేశంలో పేషెంట్‌ బాబి, కుటుంబ సభ్యులు, వైద్యులు అమర్‌ బాబు, ఆసుపత్రి ఎజిఎం శ్రీనివాస్‌ శర్మ, స్వామి, సురేశ్‌ తదితరులున్నారు.

Check Also

ఎమ్మెల్యేను సన్మానించిన సొసైటీ సభ్యులు

నిజాంసాగర్‌, ఫిబ్రవరి 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజాంసాగర్‌ మండలంలోని అచ్చంపేట్‌ సొసైటీ చైర్మన్‌ నరసింహారెడ్డి, వైస్‌ ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *