Breaking News

రోడ్డు నిర్మాణ పనులు పరిశీలించిన మంత్రి

బాన్సువాడ, ఏప్రిల్‌ 24

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాన్సువాడ-కామారెడ్డి ప్రధాన రహదారి విస్తరణ పనులను రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి మంగళవారం పరిశీలించారు. మండలంలోని మండి సడక్‌ వద్ద అటవీప్రాంతంలో జరుగుతున్న పనులను పరిశీలించి స్థానిక నాయకులను నిర్మాణ పనులపై అడిగి తెలుసుకున్నారు. రూ. 12 కోట్లతో జరుగుతున్న రోడ్డు విస్తరణ పనులను స్థానిక ప్రజాప్రతినిధులు ఎప్పటికప్పుడు పరిశీలించి సూచనలు చేయాలని మంత్రి అన్నారు. నిర్మాణ పనులు చేపడుతున్న నిర్మాణ సంస్థ ప్రతినిధులతో పనుల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రానికి ఎంతో కీలకంగా ఉన్న రహదారి పనులను త్వరగా పూర్తిచేయాలని సూచించారు. మే నెల చివరి నాటికి పనులు పూర్తిచేసి ప్రయాణీకులకు సౌకర్యం కల్పించాలని మంత్రి అన్నారు. మంత్రి వెంట స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు ఉన్నారు.

Check Also

సోమవారం నుండి జీలుగ విత్తనాలు పంపిణీ

రెంజల్‌, మే 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని రైతులకు సోమవారం నుండి జీలుగ విత్తనాలు పంపిణీ ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *