Breaking News

సిబ్బందికి తగిన వేతనాలు ఇవ్వాలి

బాన్సువాడ, ఏప్రిల్‌ 24

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కాంట్రాక్టు పద్దతిన ఆసుపత్రుల్లో పనిచేస్తున్న సిబ్బందికి నిబంధనల ప్రకారం వేతనాలు అందించాలని ఏఐటియుసి ఆధ్వర్యంలో బాన్సువాడ ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ శ్రీనివాస్‌ ప్రసాద్‌కు వినతి పత్రం సమర్పించారు. మంగళవారం ఆసుపత్రి వరకు ఏఐటియుసి ఆధ్వర్యంలో ప్రదర్శన నిర్వహించారు. కాంట్రాక్టు పద్దతిలో పనిచేస్తున్న సానిటేషన్‌, సెక్యురిటి సిబ్బందికి పండగలు, జాతీయ, ఆర్జిత సెలవులు అమలు చేయాలని తెలిపారు. సిబ్బంది పనిచేస్తున్న సదరు కాంట్రాక్టు సంస్థకు సూచనలు ఇవ్వాలని ఈ సందర్భంగా కోరారు. కార్యక్రమంలో ఏఐటియుసి ప్రతినిధి దుబాస్‌ రాములు, ఎం.డి. యూసుఫ్‌, సిబ్బంది రేణుక, గంగారాం, హనుమాండ్లు తదితరులున్నారు.

Check Also

చిన్నమల్లారెడ్డిలో పోలీసుల కవాతు

కామారెడ్డి, మార్చ్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : స్థానిక, పార్లమెంటు ఎన్నికల దృష్ట్యా కామారెడ్డి మండలం చిన్నమల్లారెడ్డి ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *