Breaking News

రైతు క్షేమమే ప్రభుత్వ ధ్యేయం

బాన్సువాడ, ఏప్రిల్‌ 25

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రైతులు క్షేమంగా ఉంటేనే దేశానికి, రాష్ట్రానికి బాగుంటుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. బాన్సువాడలోని ఎల్లయ్య చెరువు, వీక్లిమార్కెట్‌ ఆవరణలో బుధవారం రైతులకు ట్రాక్టర్ల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెరాస ప్రభుత్వం రైతు సంక్షేమం కోసం పాటుపడుతుందని పేర్కొన్నారు. రైతు కుటుంబాలు కన్నీరు కార్చకుండా ఉంటేనే దేశానికి, రాష్ట్రానికి బాగుంటుందని ఆయన వెల్లడించారు. దీనికోసమే రైతులకు అవసరమైన పనిముట్లను పంపిణీ చేస్తున్నామని పేర్కొన్నారు. ఈ సందర్భంగా లబ్దిదారులకు ట్రాక్టర్ల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. అనంతరం మాట్లాడారు. రైతులు, వ్యవసాయాధికారులు సూచించిన మేరకు పంటలు సాగుచేయాలని మంత్రి అన్నారు. రైతులు బాగుంటేనే దేశం, రాష్ట్రం బాగుంటుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్దన్‌, జుక్కల్‌ ఎమ్మెల్యే హన్మంత్‌షిండే, రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు అంజిరెడ్డి, జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ, స్థానిక అధికారులు పాల్గొన్నారు.

Check Also

చిన్నమల్లారెడ్డిలో పోలీసుల కవాతు

కామారెడ్డి, మార్చ్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : స్థానిక, పార్లమెంటు ఎన్నికల దృష్ట్యా కామారెడ్డి మండలం చిన్నమల్లారెడ్డి ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *