Breaking News

ఘనంగా నర్సింగ్‌ డే

 

నిజామాబాద్‌ టౌన్‌, మే 12

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రపంచ నర్సింగ్‌ డే వేడుకలను నిజామాబాద్‌ ప్రభుత్వ ఆసుపత్రిలో ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ రాములు మాట్లాడుతూ వైద్య వృత్తిలో నర్సింగ్‌ స్టాప్‌ సేవలు ఎనలేనివని, ఒక రోగి ఆసుపత్రిలో చేరిన వెంటనే డిశ్చార్జి అయ్యేంతవరకు నర్సులు రోగిపట్ల తల్లిలా వ్యవహరిస్తారని, వారి సేవలు ఎనలేనివని అన్నారు. ఆసుపత్రి ఆద్వర్యంలో ప్రతియేడు నర్సింగ్‌డేను ఘనంగా నిర్వహిస్తున్నట్టు ఆయన తెలిపారు. కార్యక్రమంలో ఆసుపత్రి డిప్యూటి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ ప్రతిభారాజ్‌, వైద్యులు, నర్సింగ్‌ స్టాఫ్‌ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Check Also

కేంద్రంలో హంగ్‌ : మనమే కీలకం : ఎంపి కవిత

జగిత్యాల, మార్చ్‌ 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కేంద్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదు, అట్లాగే ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *