Breaking News

Daily Archives: May 15, 2018

12 వేల మంది కృషితో జిల్లాలో సజావుగా రైతుబంధు

కామారెడ్డి, మే 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : దాదాపు 12 వేల మంది సమష్టి కృషితో కామారెడ్డి జిల్లాలో రైతుబంధు పెట్టుబడి చెక్కులు, పాసుపుస్తకాల పంపిణీ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించుకుంటున్నామని జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ తెలిపారు. జుక్కల్‌ మండలం ఖండేబల్లూర్‌ గ్రామంలో మంగళవారం జరిగిన కార్యక్రమానికి కలెక్టర్‌తోపాటు జుక్కల్‌ ఎమ్మెల్యే హన్మంత్‌షిండే పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ రికార్డుల ప్రక్షాళన ద్వారా జిల్లాలో 49 శాతం నుంచి 96 శాతానికి భూ రికార్డులు క్లియర్‌ చేసుకున్నామన్నారు. దాని ఆధారంగా రైతుబంధు ...

Read More »

నూతన గ్రంథాలయ భవన పరిశీలన

కామారెడ్డి, మే 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డిలో నిర్మితమవుతున్న జిల్లా నూతన గ్రంథాలయ భవనాన్ని జిల్లా గ్రంథాలయ కార్యదర్శి సురేశ్‌బాబు, గ్రంథాలయ డైరెక్టర్‌ సంగి మోహన్‌లు మంగళవారం పరిశీలించారు. పనులు జరుగుతున్న తీరును పర్యవేక్షించారు. పనులు నాణ్యతతో చేపట్టాలని అనుకున్న సమయానికి పూర్తిచేయాలని కాంట్రాక్టర్‌ను ఆదేశించారు.

Read More »

వ్యవసాయ రంగానికి ప్రాధాన్యత

నిజామాబాద్‌ టౌన్‌, మే 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ రంగానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తుందని నిజామాబాద్‌ ఎంపి కల్వకుంట్ల కవిత అన్నారు. మంగళవారం బాల్కొండ మండలం అంక్సాపూర్‌ గ్రామంలో రైతుబందు కార్యక్రమంలో ఆమె హాజరై మాట్లాడారు. వచ్చే ఎన్నికల్లో దేశంలోని రైతులంతా తెలంగాణలో మాదిరిగా పెట్టుబడి సాయం ఎందుకు చేయరని రాజకీయ పార్టీలను అడుగుతారని ఎంపి అన్నారు. ఈ సందర్భంగా 450 మంది రైతులకు ఎంపి చేతుల మీదుగా చెక్కులు, పట్టాదారు పాసుపుస్తకాలు పంపినీ చేశారు. ...

Read More »

కర్ణాటకలో విజయంపట్ల కమలదళ సంబరాలు

కామారెడ్డి, మే 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కర్ణాటకలో మంగళవారం వెలువడిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో భారతీయ జనతాపార్టీ మెజార్టీ స్థానాలను కైవసం చేసుకోవడం పట్ల ఆ పార్టీ శ్రేణులు కామారెడ్డిలో సంబరాలు జరుపుకున్నారు. బాణాసంచా కాల్చి మిఠాయిలు పంచుకొని వేడుకలు చేశారు. ఈ సందర్భంగా ఆ పార్టీ రాష్ట్ర అభివృద్ది కమిటీ ఛైర్మన్‌ డాక్టర్‌ మురళీధర్‌గౌడ్‌ మాట్లాడుతూ కర్ణాటకలో కాంగ్రెస్‌ అవినీతి పాలనకు ప్రజలు అంతం పలికారన్నారు. ప్రధాని నరేంద్రమోడి అభివృద్ది పథకాలు విజయాన్ని చేకూర్చాయని పేర్కొన్నారు. కాంగ్రెస్‌ పార్టీ ...

Read More »

రైతులకు పెట్టుబడి సాయం అందజేత

నిజాంసాగర్‌, మే 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రైతులకు తెలంగాణ ప్రభుత్వం అండగా ఉంటుందని జడ్పి ఛైర్మన్‌ దఫేదార్‌ రాజు అన్నారు. నిజాంసాగర్‌ మండలంలోని అచ్చంపేట గ్రామంలో రైతుబందు పథకం కింద రైతులకు మంగళవారం పట్టాదారు పాసుపుస్తకాలను, చెక్కులను అందజేశారు. అంతకుముందు సిఎం చిత్రపటానికి రైతులతో కలిసి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గతంలో ఏ ప్రభుత్వాలు రైతుల గురించి పట్టించుకోలేదని, దీంతో రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారన్నారు. అచ్చంపేట గ్రామంలో 843 మంది రైతులకు రూ. 34 .57 ...

Read More »

ప్రభుత్వ పథకాలపై ఎమ్మెల్యే సమీక్ష

నిజామాబాద్‌ టౌన్‌, మే 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పలు పథకాలపై నిజామాబాద్‌ అర్బన్‌ ఎమ్మెల్యే బిగాల గణేశ్‌ గుప్త మంగళవారం సమీక్షించారు. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న ఆసరా పింఛన్లు, వృద్దాప్య పింఛన్లు, వితంతు, ఒంటరి మహిళ పింఛన్లు, షాదీముబారక్‌, కళ్యాణలక్ష్మి, మహిళా సంఘాల బలోపేతానికి రుణాలు మంజూరు చేసే విషయంపై ఇతర అంశాలపై ఎమ్మెల్యే మాట్లాడారు. అర్హులైన లబ్దిదారులందరికి ఖచ్చితంగా పింఛన్లు వచ్చేవిధంగా చూడాలని, మునిసిపాలిటి, రెవెన్యూ, మెప్మా, ఐసిడిఎస్‌ అధికారులు సమన్వయంతో పనిచేస్తు ...

Read More »

వాకర్స్‌కు ఉచిత వైద్య పరీక్షలు

నిజామాబాద్‌ టౌన్‌, మే 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ నగరానికి చెందిన మ్యాక్స్‌ క్యూర్‌ నిహారిక ఆసుపత్రి వైద్యులు మంగళవారం బోర్గాం శివారులోగల అమ్మనగర్‌ వెంచర్‌లో వాకింగ్‌ చేసేవారికి వైద్య పరీక్షలు నిర్వహించారు. ముఖ్యంగా వాకర్స్‌కు బిపి, షుగర్‌ పరీక్షలు జరిపి పలు సూచనలు చేశారు. సుమారు 50 మందికిపైగా వాకర్స్‌ పరీక్షలు చేయించుకున్నట్టు ఆసుపత్రి సిబ్బంది తెలిపారు.

Read More »

రైతుబంధు ఓ భూస్వామ్య బంధు పథకం

నిజామాబాద్‌ టౌన్‌, మే 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రైతుబందు పథకం ఒక భూస్వామ్య బందుపథకమని బిఎల్‌ఎఫ్‌ రాష్ట్ర ఛైర్మన్‌ నల్లా సూర్యప్రకాశ్‌ ఆరోపించారు. మంగళవారం జిల్లా కేంద్రంలో సిపిఐ (ఎం) కార్యాలయంలో జరిగిన సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. తెరాస ప్రభుత్వం చేపడుతున్న రైతుబంధు పథకం ఓ భూస్వామ్య బంధు పథకమని విమర్శించారు. పెట్టుబడి పథకంలో కౌలురైతులను పూర్తిగా విస్మరిస్తున్నట్టు సాక్షాత్తు ముఖ్యమంత్రి కెసిఆర్‌ చెప్పడం సిగ్గుచేటన్నారు. బిఎల్‌ఎఫ్‌ అధికారంలోకి రాగానే జిల్లాలో సూపర్‌ స్పెషాలిటి ఆసుపత్రి ఏర్పాటు ...

Read More »

రైతుబంధు బందోబస్తు పర్యవేక్షించిన సిపి

నిజామాబాద్‌ టౌన్‌, మే 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతుబందు పథకం బందోబస్తును నిజామాబాద్‌ పోలీసు కమీషనర్‌ కార్తికేయ మంగళవారం పర్యవేక్షించారు. మాధవనగర్‌ వద్దగల కార్పొరేషన్‌ బ్యాంకు, ఖలీల్‌వాడి కార్పొరేషన్‌ బ్యాంకులలో చెక్కుల పంపిణీ సందర్భంగా తీసుకుంటున్న చర్యలను పర్యవేక్షించారు. అన్ని పంపిణీ కేంద్రాల వద్ద పోలీసు బందోబస్తు చర్యలు, రైతులకు పంపినీ చేసే పట్టపాసు పుస్తకాలు, చెక్కుల గురించి ఎప్పటికప్పుడు పోలీసు సిబ్బందితో మాట్లాడుతూ పంపిణీ కేంద్రాల వద్ద పరిస్థితులు తెలుసుకుంటూ రైతులకు ...

Read More »

పలు డివిజన్‌లలో మేయర్‌ పర్యటన

నిజామాబాద్‌ టౌన్‌, మే 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ నగర మేయర్‌ ఆకుల సుజాత మంగళవారం పలు డివిజన్‌లలో ఆకస్మికంగా పర్యటించారు. నగరంలో పారిశుద్య, తాగునీటి సరఫరా పనితీరును మేయర్‌ పరిశీలించారు. 8వ, 9వ, 22వ, 25వ, 26వ, 27వ, 29వ డివిజన్‌లలో మేయర్‌ సందర్శించి తాగునీటి సరఫరా, పారిశుద్య పనులపై అధికారులకు సూచనలు చేశారు. ఈ సందర్భంగా మేయర్‌ మాట్లాడుతూ రానున్న వర్సాకాలం దృష్ట్యా భూగర్భ మురికి కాలువ పనులను త్వరగా పూర్తిచేస్తున్నామని, నగరంలో నూతన నాళాలు నిర్మిస్తున్నామని, ...

Read More »

బిజెపి సంబరాలు

నిజామాబాద్‌ టౌన్‌, మే 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో విజయఢంకా మోగించి అతిపెద్ద పార్టీగా అవతరించినందున జిల్లా భారతీయ జనతాపార్టీ నాయకులు మంగళవారం జిల్లా వ్యాప్తంగా సంబరాలు జరుపుకున్నారు. జిల్లా కేంద్రంలో బిజెపి అధ్యక్షుడు పల్లెగంగారెడ్డి ఆధ్వర్యంలో బాణాసంచా కాల్చి మిఠాయిలు పంచుకున్నారు. ఈ సందర్భంగా గంగారెడ్డి మాట్లాడుతూ దక్షిణాది రాష్ట్రాల్లో బిజెపి తన సత్తా చాటుతుందని, రాబోయే తెలంగాణ సార్వత్రిక ఎన్నికల్లో కూడా బిజెపి మంచి ఫలితాలు సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. బిజెపిని ప్రతిపక్షాలు ...

Read More »

రైతుబంధు ద్వారా రూ. 55 కోట్ల పంపిణీ

నిజామాబాద్‌ టౌన్‌, మే 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రైతుబంధు పథకం ద్వారా ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా రూ. 55 కోట్ల విలువైన చెక్కులు పంపిణీ చేసినట్టు జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌రావు తెలిపారు. మంగళవారం నవీపేట మండలం రాంపూర్‌ గ్రామంలో రైతుబంధు చెక్కుల పంపిణీ కార్యక్రమంలో కలెక్టర్‌ ముఖ్య అతిథిగా హాజరై పంపిణీ చేశారు. అనంతరం కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలో సోమవారం నాటికి 57 వేల 607 పట్టా పాసుపుస్తకాలు పంపిణీ చేయడం జరిగిందని, ఈనెల 10వ తేదీన 25 ...

Read More »

రైతుబంధుకు నగదు కొరతలేదు

నిజామాబాద్‌ టౌన్‌, మే 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రైతుబంధు పథకానికి ఎలాంటి నగదు కొరత లేదని జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌రావు అన్నారు. మంగళవారం నవీపేట మండలం జన్నేపల్లిలోని సిండికేట్‌ బ్యాంకు కార్యాలయాన్ని కలెక్టర్‌ సందర్శించారు. నగదు చెల్లింపులను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ రైతుబంధు పథకానికి నగదు లోటు లేకుండా ముందస్తుగా సిద్దం చేసినట్టు తెలిపారు. రైతులు పుకార్లను నమ్మి మోసపోకుండా బ్యాంకుల్లో వచ్చి నగదు తీసుకెళ్లవచ్చని కలెక్టర్‌ సూచించారు. బ్యాంకు సిబ్బంది రైతుల పట్ల సత్ప్రవర్తనతో మెలగాలని ...

Read More »