Breaking News

Daily Archives: May 31, 2018

తపాలా ఉద్యోగుల భిక్షాటన

నిజామాబాద్‌ టౌన్‌, మే 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తు నిరసన చేపట్టిన గ్రామీణ తపాలా ఉద్యోగుల సమ్మె గురువారంతో 10వ రోజుకు చేరింది. ఉద్యోగులు భిక్షాటన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉద్యోగ సంఘాల ప్రతినిధి యోగేశ్‌ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల వల్ల తాము తీవ్రంగా నష్టపోతున్నామని, దేశంలో ఏశాఖకు ఇంత తక్కువ వేతనాలు లేవని, తపాలా శాఖలోనే గ్రామీణ డాక్‌ సేవకులకు జీతాలు చాలా తక్కువగా ఉన్నాయని ఆయన ఆవేదన ...

Read More »

ఎంబిసి ఐక్యవేదిక జిల్లా నూతన కార్యవర్గం ఏర్పాటు

నిజామాబాద్‌ టౌన్‌, మే 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎంబిసి ఐక్యవేదిక జిల్లా నూతన కార్యవర్గం ఎన్నికైనట్టు జిల్లా ఛైర్మన్‌ దండి వెంకట్‌, అధ్యక్షుడు మహతి రమేశ్‌ తెలిపారు. గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. ఈనెల 29న ఐక్యవేదిక కార్యవర్గాన్ని ఏర్పాటు చేసినట్టు వారు తెలిపారు. ఉపాధ్యక్షులుగా రాజేశ్వర్‌ -వాల్మీకి బోయ, సత్యనారాయణ, నారాయణ, ప్రకాశ్‌, భీంరాజు, ముత్యాల శ్యాంబాబు, వెంకటేశ్‌, నర్సయ్య, గంటికోటి రాజన్న తదితరులను కార్యవర్గంలో తీసుకున్నట్టు తెలిపారు. అనంతరం పలు తీర్మానాలు చేశారు. ...

Read More »

జిల్లా ప్రభుత్వ డ్రైవర్ల సంఘం అధ్యక్షునిగా వెంకటేశం

నిజామాబాద్‌ టౌన్‌, మే 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా ప్రభుత్వ డ్రైవర్ల సంఘం అధ్యక్షునిగా వెంకటేశం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గురువారం స్థానిక ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వెంకటేశం మాట్లాడారు. ఇదివరకు అధ్యక్షునిగా పనిచేసిన గంగాధర్‌ పదవీ విరమణ పొందడంతో రాష్ట్ర అధ్యక్షుడు జహంగీర్‌ తనను ఏకగ్రీవంగా జిల్లా అధ్యక్షునిగా నియమించినట్టు తెలిపారు. డ్రైవర్ల సంక్షేమం కొరకు కృషి చేస్తానని, ప్రభుత్వ పరంగా డ్రైవర్లకు రావాల్సిన బెనిఫిట్ల విషయంలో ఉన్నతాదికారులతో చర్చించి డ్రైవర్లకు న్యాయం జరిగేలా తనవంతు కృషి ...

Read More »

జూన్‌ 2న అవతరణ దినోత్సవ వేడుకలు

నిజామాబాద్‌ టౌన్‌, మే 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జూన్‌ 2న రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు నిర్వహిస్తున్నట్టు జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌రావు తెలిపారు. ఉదయం 8 గంటలకు అమరవీరుల స్థూపం వద్ద నివాళులు అర్పించి వేడుకలు ప్రారంభిస్తారని తెలిపారు. 8.30 గంటలకు రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి మాట్లాడతారని అన్నారు. అనంతరం వివిధ శాఖల శకటాల ప్రదర్శన, మార్చ్‌ఫాస్ట్‌, సాంస్కృతిక కార్యక్రమాలు, తెలంగాణ అమరవీరుల కుటుంబాలకు సత్కార కార్యక్రమం, విధుల్లో ప్రతిభ కనబరిచిన ఉద్యోగులకు ...

Read More »

షీ టీంల పనితీరు భేష్‌

నిజామాబాద్‌ టౌన్‌, మే 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : షీ టీంల పనితీరు భేషుగ్గా ఉందని నిజామాబాద్‌ పోలీసు కమీషనర్‌ కార్తికేయ తెలిపారు. నిజామాబాద్‌ కమీషనరేట్‌ పరిధిలో షీ టీంలు తమ విధులను సక్రమంగా నిర్వహిస్తు పోకిరిల బారినుండి మహిళలను కాపాడుతున్నట్టు ఆయన తెలిపారు. మే 1 నుంచి 30 వరకు షీ టీంల వివరాలు ఇలా ఉన్నాయి… నిజామాబాద్‌ డివిజన్‌ పరిధిలో మొత్తం 4 సంఘటనలు చోటుచేసుకున్నాయని, నలుగురిని కౌన్సిలింగ్‌ చేయడం జరిగిందని కమీషనర్‌ తెలిపారు. ఆర్మూర్‌ డివిజన్‌ పరిధిలో ...

Read More »

ముగిసిన వేసవి క్రీడలు

నిజామాబాద్‌ టౌన్‌, మే 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ మునిసిపల్‌ కార్పొరేషన్‌ ఆద్వర్యంలో వేసవిలో నిర్వహించిన క్రీడలు గురువారంతో ముగిశాయి. ఈ ముగింపు ఉత్సవాల్లో నిజామాబాద్‌ నగర మేయర్‌ ఆకుల సుజాత పాల్గొని మాట్లాడారు. వేసవి కాలం దృష్ట్యా పిల్లలకు ఆడవిడుపు కోసం ఈనెల 4 నుంచి 31వ తేదీ వరకు 9 రకాల క్రీడలు నిర్వహించామని, దాంతోపాటు ఇండోర్‌ గేమ్స్‌ కూడా నిర్వహించి పిల్లల్లో మానసిక, శారీరక ఉల్లాసాన్ని పెంపొందించేందుకు కృషి చేశామని ఆమె అన్నారు. పిల్లలు కూడా ...

Read More »

పార్ట్‌ బి వివరాలు పకడ్బందీగా చేపట్టాలి

రెంజల్‌, మే 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన రైతుబందు పథకంలో భాగంగా పార్ట్‌ బి వివరాలను పకడ్బందీగా చేపట్టాలని బోధన్‌ సబ్‌ కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి అన్నారు. గురువారం మండల కేంద్రంతోపాటు, నీలా గ్రామాలలో కొనసాగుతున్న రైతుబంధు కార్యక్రమాలను ఆయన తనిఖీ చేశారు. సిబ్బంది భూ పట్టాదారు పాసుపుస్తకాలను సరిచూస్తున్న పనితీరును సబ్‌ కలెక్టర్‌ పరిశీలించారు. చనిపోయిన రైతుల భూములను వారి వారసుల పేరుమీద మారిపించే అవకాశం కల్పించాలన్నారు. కొందరు రైతులు భూములను అమ్మారని, వారి ...

Read More »

జూన్‌ 12 నుండి విద్యాసంస్థలు ప్రారంభించాలి

నిజామాబాద్‌ టౌన్‌, మే 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎండలు తీవ్రంగా ఉన్న దృష్ట్యా విద్యాసంస్థలను జూన్‌ 1 తేదీ నుండి కాకుండా 12 తేదీన ప్రారంభించాలని భారతీయ జనతా యువమోర్చా నగర అధ్యక్షుడు రోషన్‌లాల్‌ బోరా ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. గురువారం ఈ అంశంపై జిల్లా కలెక్టర్‌, ఎవోకు వినతి పత్రం అందజేసి అనంతరం మాట్లాడారు. ఎండలు ఎక్కువగా ఉన్నందున విద్యార్థులకు తీవ్ర ఇబ్బంది కలుగుతుందని, ఈ అంశాన్ని దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర వ్యాప్తంగా విద్యాసంస్థలను జూన్‌ 12 నుంచి ...

Read More »

18,428 పోలీస్‌ ఉద్యోగాలకు నోటిఫికేషన్‌

 ‌హైదరాబాద్‌: తెలంగాణ నిరుద్యోగులకు శుభవార్త. తెలంగాణ ప్రభుత్వం పోలీస్‌ శాఖలోని పలు విభాగాల్లో ఎస్సై, కానిస్టేబుల్‌ ఉద్యోగాలను పెద్ద సంఖ్యలో భర్తీ చేయాలని నిర్ణయించింది. ఈ నియామకాలకు సంబంధించి తెలంగాణ పోలీస్‌ నియామక సంస్థ నోటిఫికేషన్లను జారీ చేసింది. రాష్ట్రంలో మొత్తం 18,428 ఉద్యోగాల నియామకం చేపట్టాలని నిర్ణయించారు. వీటిలో 16,925 ఉద్యోగాలు కానిస్టేబుళ్లు కాగా.. 1503 ఎస్సై ఉద్యోగాలు భర్తీ చేయనున్నారు. గత కొంతకాలంగా పోలీసు నియామక సంస్థ ఈ నియామకాలకు సంబంధించి కసరత్తు చేసింది. అన్ని అనుమతులు పొందాక ఈ రోజు ఉద్యోగ ...

Read More »