నిజామాబాద్ టౌన్, జూన్ 23
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఏజెంట్ల మోసాలకు బలై ఖతర్ దేశంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న తెలంగాణ ప్రజలను ఆదుకుంటామని తెలంగాణ జాగృతి ఖతర్ నిర్వాహకురాలు నందిని అబ్బగోని తెలిపారు. ఖతర్‌లో తినడానికి తిండిలేక, ఉండడానికి నీడలేక అష్టకష్టాలు పడుతున్న నిజామబాద్, కరీంనగర్ జిల్లాలకు చెందిన 20 మంది బాధితుల పరిస్తితి తెలుసుకున్న జాగృతి నాయకులు వారి వద్దకెళ్ళి నిత్యవసర సరుకులు, ఇతరత్రా అందజేశారు. ఈ సందర్భంగా నందిని మాట్లాడుతూ ఏజెంట్ల మోసాలకు బలై ఖతర్‌లో ఎంతోమంది తెలంగాణవాసులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వీరి సమస్యలను కేంద్రం, ఖతర్ ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళి పరిష్కరించేలా కృషి చేస్తామని, అదేవిధంగా కంపెనీ యాజమాన్యంతో మాట్లాడి వారికి ఉద్యోగ భద్రత, ఇతర అంశాలపై చర్చిస్తామని ఆమె తెలిపారు. కార్యక్రమంలో ప్రణీత, అశ్విని, కోటి, అనుపమ సంగిశెట్టి తదితరులు పాల్గొన్నారు.

Nizamabad News

Latest posts by Nizamabad News (see all)
- కరోన సమయంలో రక్తదానం చేయడం అభినందనీయం - April 15, 2021
- 15 మందికి పాజిటివ్ - April 15, 2021
- సుస్థిర రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ - April 14, 2021