Breaking News

వ్యవసాయ శాఖ పనితీరు భేష్‌

నిజామాబాద్‌ టౌన్‌, జూన్‌ 26

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వ్యవసాయ శాఖ పనితీరు భేషుగ్గా ఉందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌.కె.జోషి అన్నారు. మంగళవారం సచివాలయం నుంచి జిల్లా కలెక్టర్లతో ఆయన వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. ఈ సందర్భంగా జోషి మాట్లాడుతూ రైతుబంధు పథకంలో వ్యవసాయశాఖ రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని చర్యలు చేపట్టి ప్రశంసలు పొందిందని అన్నారు. రైతుబందు పథకాన్ని వ్యవసాయశాఖ ద్వారా ఏవోలు ట్యాబుల సహాయంతో పర్యవేక్షిస్తున్నారని తెలిపారు. కెసిఆర్‌ కిట్‌లు, ఎంఎంఆర్‌, ఐఎంఆర్‌ పర్యవేక్షణ, ఆరోగ్యలక్ష్మి, స్కాలర్‌షిప్‌ల పంపిణీ, షాదీముబారక్‌, కళ్యాణలక్ష్మి, సోషల్‌ వెల్పేర్‌, రెసిడెన్సియల్‌ పాఠశాలల విద్యార్థుల ప్రవేశాలు, వారి ఆరోగ్య పరిరక్షణ తదితర అంశాలకు సంబంధించి సేకరించే సమాచారం కలెక్టర్లు పర్యవేక్షించడంతోపాటు సంబంధిత కార్యదర్శులు సమీక్షించేలా డ్యాష్‌బోర్డును రూపకల్పన చేయనున్నట్టు ఆయన తెలిపారు. కార్యక్రమంలో జిల్లా సంయుక్త కలెక్టర్‌ రవీందర్‌రెడ్డి, వ్యవసాయ అధికారి గోవింద్‌, వైద్య శాఖాధికారి వెంకట్‌ తదితరులు పాల్గొన్నారు.

Check Also

చెక్కుల పంపిణీ

కామారెడ్డి, నవంబర్‌ 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి నియోజకవర్గంలో ఎస్సీ కార్పొరేషన్‌ ద్వారా మంజూరైన 25.05 ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *