Breaking News

మైనార్టీ గురుకుల పాఠశాల విద్యార్థికి పాముకాటు

రెంజల్‌, జూన్‌ 29

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మైనార్టీ గురుకుల పాఠశాలలో చదువుతున్న విద్యార్థిని షహానా గురువారం ఉదయం పాముకాటుకు గురైంది. దీంతో హైదరాబాద్‌లోని యశోదా ఆసుపత్రికి తరలించారు. విషయం బయటకు పొక్కకుండా పాఠశాల ప్రధానోపాద్యాయురాలు అఫ్రోజ్‌ కహ్కష జాగ్రత్త పడ్డారు. మీడియాకు తెలియడంతో పాఠశాలకు వెళ్ళి ఆరాతీశారు. అయినా ఏమి జరగలేదంటూ సమాధానం దాటవేశారు. ఏమి చెప్పాలో తెలియక ఉన్న వాస్తవాన్ని చెప్పుకొచ్చి జరిగిన సంఘటన ఒప్పుకుంది. అనంతరం బాలిక ఆరోగ్యం మెరుగు పడ్డట్లు సిబ్బంది పేర్కొన్నారు. పాఠశాల ఆవరణలో చెత్త, చెదారం మురికి అధికంగా ఉండడంతో పాములు తిరుగుతున్నాయని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.

Check Also

భీమ్‌గల్‌ ఉత్తరాధి మఠం ఆధ్వర్యంలో ఆహార వితరణ

భీమ్‌గల్‌, ఏప్రిల్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పరమ పూజ్య శ్రీ సత్యాత్మ తీర్థ యొక్క దైవిక ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *