Breaking News

కుటుంబ నియంత్రణతోనే రేపటి భవిష్యత్తుకు శుభారంభం

 

కామారెడ్డి, జూలై 11

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కుటుంబ నియంత్రణతోనే రేపటి సంపూర్ణ భవిష్యత్తుకు శుభారంభం లభిస్తుందని కామారెడ్డి జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ అన్నారు. ప్రపంచ జనాభా దినోత్సవాన్ని పురస్కరించుకొని బుధవారం కామరెడ్డి జిల్లా ఆసుపత్రి ఆవరణలో ర్యాలీ ఆయన ప్రారంభించారు. అనంతరం రోటరీ ఆడిటోరియంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కుటుంబ నియంత్రణ సేవలను వైద్యశాఖ సమర్థంగా అందించాలని తెలిపారు. వైద్యశాఖ, మహిళా శిశు సంక్షేమ శాఖలు సంయుక్తంగా పనిచేస్తు ఐఎంఆర్‌, ఎంఎంఆర్‌ రేటు తగ్గించి మంచి ఫలితాలు సాధిస్తున్నారని ప్రశంసించారు. జనాభా నియంత్రణలో దేశం మెరుగైన ఫలితాలు సాధిస్తుందని అన్నారు. జిల్లా వైద్య శాఖాధికారి డాక్టర్‌ చంద్రశేఖర్‌ మాట్లాడుతూ జనాభా వృద్ధిరేటు 2.5 నుంచి ప్రస్తుతం 2.1కి తగ్గిందని, ఈరేటు 1.6కు తగ్గించే లక్ష్యం దిశగా కార్యాచరణ ఉంటుందన్నారు. ఏఎన్‌ఎంలకు ద్విచక్రవాహనాలు, అత్యవసర నిదులు ఇవ్వడంలో చొరవ చూపిన కలెక్టర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం ఉత్తమ వైద్యులు, సిబ్బందికి అవార్డులు ప్రదానం చేశారు. కార్యక్రమంలో వైద్యులు రాజు, రవీందర్‌రెడ్డి, ఇద్రిస్‌ ఘోరీ, రాజారమేశ్‌, చలపతి, సంజీవరెడ్డి, వేణుగోపాల్‌ తదితరులు పాల్గొన్నారు.

Check Also

వైభవోపేతంగా బ్రహ్మూెత్సవాలు

కామారెడ్డి, మే 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా చిన్నమల్లారెడ్డి గ్రామంలో శ్రీ ప్రసన్న వెంకటేశ్వర ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *