Breaking News

మ్యాక్సు క్యూర్‌ నిహారిక ఆసుపత్రి ఆద్వర్యంలో ఉచిత వైద్య శిబిరం

 

నిజామాబాద్‌ టౌన్‌, జూలై 13

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌కు చెందిన మ్యాక్సు క్యూర్‌ నిహారిక ఆసుపత్రి ఆద్వర్యంలో శుక్రవారం మోపాల్‌ మండలం నర్సింగ్‌పల్లి గ్రామంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఇందులో 200కు పైగా గ్రామస్తులు పాల్గొని వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ఈ సందర్భంగా ఆసుపత్రి వైద్యులు డాక్టర్‌ నవీన్‌కుమార్‌ మాట్లాడుతూ ప్రజలకు బిపి, షుగర్‌ పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు అందించడం జరిగిందని ఆయన తెలిపారు. మెరుగైన వైద్యం గ్రామీణ ప్రాంత ప్రజలకు అందించాలనే లక్ష్యంతో మ్యాక్సుక్యూర్‌ ఆసుపత్రి వారు గ్రామాల్లో ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తున్నామని, మారుమూల గ్రామాల్లో సైతం గుర్తించి ఎన్నో వైద్యశిబిరాలు నిర్వహించామని, భవిష్యత్తులో మరిన్ని నిర్వహిస్తామని ఆయన తెలిపారు. వర్షాకాలం మూలంగా సీజనల్‌ వ్యాధులువ్యాపించే ప్రమాదముందని, ప్రజలు పరిసరాలు శుభ్రంగా ఉంచుకొని అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వైద్య శిబిరంలో ఆసుపత్రి సిబ్బంది స్వామి, మేనేజర్‌ సురేశ్‌బాబు, కో ఆర్డినేటర్‌ ప్రవీణ్‌, శ్రీదర్‌, నర్సింగ్‌ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Check Also

జ్వరాలు రాకుండా ముందే నివారణ చర్యలు తీసుకోవాలి

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జ్వరాలతో వచ్చిన ప్రజలకు అవసరమైన చికిత్సలు అందించడంతోపాటు జ్వరాలు ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *